alltime petrol hike

అచ్ఛేదిన్‌ కబ్‌ ఆయేగ మోడీ జీ! జనం నెత్తిన పెట్రో బాంబ్‌

Submitted by santosh on Mon, 09/10/2018 - 12:06

మోటర్‌ సైకిల్‌ ఇంట్లో నుంచి బయటకు తియ్యాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. మూలకేసిన సైకిల్‌ దుమ్ము దులిపి, బయటకు తీద్దామనుకుంటున్నారు. షెడ్డూలోనే కార్లు పెట్టి, కొందరు బస్సెక్కుతుంటే, మరొకొందరు గుర్రాలెక్కుతున్నారు. బైక్‌ రిజర్వ్‌లో పడగానే, బంకువైపు వెళదామంటేనే జంకుతున్నారు. ఇంతకీ ఏమైంది పెట్రోల్‌కు అనుకుంటున్నారా....రేట్లతో మంటపెడుతోంది...ఐదొందల పోయిస్తే ఆరేడు లీటర్లు వచ్చే పెట్రోల్, ఇప్పుడు ఐదు లీటర్లు పడిపోయింది....జేబుకు చిల్లు పడుతోంది. అటు రూపాయి కూడా పతనమవుతూ, కంప్యూటర్లు, ఫోన్లు, ఇతర బ్రాండెడ్‌ రేట్లను బాదేస్తోంది.