Sabbam Hari

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ పార్టీదే గెలుపు: సబ్బం హరి

Submitted by arun on Mon, 09/10/2018 - 12:06

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలంటూ జరిగితే విపక్ష పార్టీ అయిన వైసీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీదే విజయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే మంచి పాలనను అందిస్తామనే భరోసాను ప్రజలకు కల్పించడంలో వైసీపీ పూర్తిగా విఫలమయిందని తెలిపారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాలను, మోసాలను ప్రజలకు వివరించడంలో చంద్రబాబు సఫలమయ్యారని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ కుక్కలు చింపిన విస్తరిలా తయారయిందని చెప్పారు.