bjp alone in telangana

పొత్తు పొడవకున్నా... కమలం ఒంటరిగానే పొడిచేస్తోందా?

Submitted by santosh on Mon, 09/10/2018 - 11:50

తెలంగాణలో ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధమైంది. మొత్తం 119 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 15న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. పాలమూరులో నిర్వహించే బహిరంగ సభ తర్వాత... తొలి విడతగా 50 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించడానికి రెడీ అవుతోంది. అలాగే ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రులను ప్రచారానికి రప్పించేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణలో ఎలాగైనా అధిక స్థానాలు సాధించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఉన్న 5 ఎమ్మెల్యే స్థానాలను కాపాడుకోవడంతోపాటు మరిన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది.