election commission of india telangana

అక్టోబరులో షెడ్యూల్‌... నవంబర్‌లో ఎలక్షన్స్‌? ఈసీ డిసైడైందా?

Submitted by santosh on Mon, 09/10/2018 - 11:46

తెలంగాణ అసెంబ్లీకి నాలుగు రాష్ట్రాల ఎన్నికల కన్నా ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ రెండోవారంలో షెడ్యూల్ విడుదల కానున్నట్లు సమాచారం వస్తోంది.. అప్పటి నుంచి 45 రోజులలో, నవంబరు చివరి వారంలో పోలింగ్‌ జరగవచ్చు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ సన్నాహాలను వేగవంతం చేసింది. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నవంబరులోనే జరగనున్నట్లు తెలుస్తోంది.. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ సన్నాహాలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల్లోనే ఓటింగ్‌ యంత్రాలు రాష్ట్రానికి రానున్నాయి. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ గడువును కూడా ఈసీ కుదించింది.