operation garuda in ap

ఏపీలో ఆపరేషన్‌ గరుడ నిజమవుతుందా?

Submitted by santosh on Fri, 10/26/2018 - 16:29

ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్‌ గరుడ నిజమేనా..? టీడీపీ నేతలు ఆపరేషన్‌ గరుడ నిజమని నమ్ముతున్నారా..? ఏపీలో ఐటీ దాడులు , ఆ తర్వాత నేతలపై కేసులు, ఇప్పడు జగన్‌పై కత్తి దాడి...ఇదంతా ఆపరేషన్‌ గరుడలో భాగమా..? సాక్షాత్తూ సీఎం చంద్రబాబు కూడా అంతా శివాజీ చెప్పినట్లే జరుగుతోందని భావిస్తున్నారా..? హీరో శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ గతంలో సంచలనంగా మారింది. అప్పట్లో టీడీపీ నేతలు ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడకపోయినా ఆ తర్వాత ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూనే ఉన్నారు. శివాజీ చెప్పినట్లు.. కర్ణాటక ఎన్నికల తర్వాత ఏపీని కేంద్రం టార్గెట్ చేస్తుందని గతంలో స్వయానా చంద్రబాబే చెప్పారు.

ఏపీలో ఆపరేషన్ గరుడ ఆరంభమైందా?

Submitted by santosh on Mon, 09/10/2018 - 11:35

ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్ గరుడ మళ్ళీ ప్రారంభమైందా..? సీఎం చంద్రబాబు టార్గెట్‌ గా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోందా..? ఇవాళ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చంద్రబాబుకి తాఖీదులు అందబోతున్నాయా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. సినీ హీరో , ప్రత్యేక హోదా సాథనా సమితి నాయకుడు, శివాజీ విజయవాడలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. సోమవారం ఏపీ సీఎం చంద్రబాబుకి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థ నోటీసులు ఇవ్వబోతోందంటూ శివాజీ చెప్పడం కలకలం రేపుతోంది.