telangana elections alliance in politics

తెలంగాణ గట్టు... పొత్తు మీద పొత్తు కట్టు!!

Submitted by santosh on Mon, 09/10/2018 - 11:31

తెలంగాణ గట్టుమీద సరికొత్త పొత్తుల ప్రస్తానం. దశాబ్దాల ప్రత్యర్థుల మధ్య చిగురిస్తున్న స్నేహం. ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దల దగ్గర, తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారన్న ఆవేశంతో, ఆవిర్భవించిన తెలుగుదేశం, తిరిగి అదే పార్టీతో చేయి కలుపుతుందన్న వార్తలు, సంచలనం సృష్టిస్తున్నాయి. కేసీఆర్‌-మోడీ ఒకే జట్టని విమర్శిస్తున్న బాబు, కాంగ్రెస్‌తో చేయి కలిపి, వారి జోడిని ఓడించాలని కంకణం కట్టుకున్నట్టు అర్థమవుతోంది. పొత్తు కోసం ఆహ్వానమన్న కాంగ్రెస్‌ ఆఫర్‌పై చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.