Vasantha Nageswara Rao

వసంత నాగేశ్వర్ రావు వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్

Submitted by arun on Mon, 09/10/2018 - 14:08

వైసీపీ నాయకుడు వసంత నాగేశ్వర్ రావు ఫోన్ చేసి గుంటుపల్లి పంచాయితీ కార్యదర్శిని బెదిరించిన వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రి దేవినేని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రినే హత్య చేస్తాం అనే ధోరణిలో వసంత నాగేశ్వర రావు చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాలని చంద్రబాబు వ్యూహ కమిటీ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఇలాంటి బెదిరింపులను సహించేది లేదని తేల్చిచెప్పారు. బెదిరింపులు, హత్యాయత్నాలు, హత్యల ద్వారా ఏమీ సాధించలేరని అన్నారు. ఫోన్ కాల్ బెదిరింపు వ్యవహారంలో వసంత నాగేశ్వర రావుపై పోలీసు కేసు నమోదైందని టీడీపీ నేతలు చంద్రబాబుకు దృష్టికి తీసుకువచ్చారు.

కలకలం రేపుతున్న వసంత నాగేశ్వరరావు ఫోన్ సంభాషణ

Submitted by arun on Mon, 09/10/2018 - 09:34

మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, గుంటుపల్లి ఈవో నరసింహరావుతో జరిపిన ఫోన్ సంభాషణ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మైలవరం నియోజకవర్గంలో బ్యానర్ల విషయంపై మాట్లాడటానికి ఫోన్ చేసిన నాగేశ్వరరావు ఈవోతో బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. మైలవరంలో రాజకీయాల గురించి వసంత నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనను ఫోన్‌లో బెదిరించారంటూ కృష్ణాజిల్లా గుంటుపల్లి గ్రామకార్యదర్శి ఎన్‌. వెంకట నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటుపల్లి  వైసీపీ బ్యానర్ల తొలగింపు వ్యవహారంపై నాగేశ్వరరావు ఫోన్‌ చేసి బెదిరించారని ఫిర్యాదులో తెలిపారు.