mukesh goud

అలర్ట్ అయిన కాంగ్రెస్... ముఖేష్ గౌడ్ ఇంట్లో నేతల భేటీ, జానారెడ్డి గైర్హాజరు!

Submitted by arun on Wed, 09/05/2018 - 10:55

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారైందనే ఊహగానాల నేపధ్యంలో  కాంగ్రెస్ నేతలు భవిష్యత్ పరిణామాలపై దృష్టి సారించారు. ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దుపై అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ నివాసంలో సాయంత్రం ఐదు గంటలకు కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు సీనియర్ నేతలు డీకే అరుణ, కోమటిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరుకానున్నారు.  ముఖేష్ గౌడ్  పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో  ఆయన నివాసంలోనే చర్చ జరగడం ఆసక్తిగా మారింది.

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీయే ఇప్పుడు ముఖేష్ రాజకీయ భవిష్యత్ నిర్ణయించబోతున్నారా.?

Submitted by arun on Sat, 06/30/2018 - 18:00

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్‌‌ను వీడతారా.? పుట్టినరోజు వేడుకల్లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ముఖేష్ పార్టీని వీడకుండా పీసీసీ చీఫ్ ఎలాంటి చర్యలు చేపట్టారు.? ఉత్తమ్ బుజ్జగింపుతో ముఖేష్ వెనక్కి తగ్గుతారా.? ఎంపీ అసదుద్దీన్ ఒవైసీయే ఇప్పుడు ముఖేష్ రాజకీయ భవిష్యత్ నిర్ణయించబోతున్నారా.?

దానం రాజీనామాపై ముఖేశ్‌గౌడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

Submitted by arun on Sat, 06/23/2018 - 10:52

దానంతోటే సరిపెడతారా..? లేక మరో భారీ షాక్‌ను తగిలించుకుంటారా..? ఇప్పుడీ విషయమే.. కాంగ్రెస్ శిబిరంలో కల్లోలం పుట్టిస్తోంది. తన దారి తాను చూసుకుని తొందరపడ్డారంటూ దానంపై మరో మాజీ మంత్రి ముకేశ్ గౌడ్.. చేసిన వ్యాఖ్యలు.. కలకలం పుట్టిస్తున్నాయి. కాస్త ఆగి ఉంటే.. అందరం కలిసి కారెక్కేవాళ్లమని.. ముఖేశ్ కుండబద్దలు కొట్టడం.. గ్రేటర్ కాంగ్రెస్‌లో అసంతృప్తి స్థాయి ఏ రేంజులో ఉందో.. చెబుతోంది. 

కాంగ్రెస్‌‌కు షాకుల మీద షాకులు...దానం దారిలో మరికొందరు సీనియర్లు

Submitted by arun on Fri, 06/22/2018 - 16:44

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రి దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడంతో మరికొంత మంది సీనియర్లు ఆయన దారిలో పార్టీకి Related imageగుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌, ఆయన కుమారుడు విక్రమ్‌ గౌడ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దానం నాగేందర్ రాజీనామాపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. దానంను బుజ్జగించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు.

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుంటారా..?

Submitted by lakshman on Sat, 12/16/2017 - 18:50

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత... మాజీ మంత్రిగా నగరంలో తనదైన ముద్ర వేసుకున్న నేత.. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ముఖేష్ గౌడ్ ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే అందరినీ ఆహ్వానించి ఆత్మీయ సదస్సు నిర్వహించారు. అయితే, ఆయన పార్టీ మారుతున్నట్టు జరుతున్న ప్రచారంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సొంత పార్టీలో ఉంటారా..? లేక గులాబీ గూటికి చేరతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 
 

పార్టీ మార్పుపై స్పందించిన ముకేశ్ గౌడ్..!

Submitted by nanireddy on Sat, 12/16/2017 - 10:41

తెరాస లో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ స్పందించారు.. తాను ఏ పార్టీలోనూ చేరడంలేదని, కాంగ్రెస్ ను వీడాల్సిన పరిస్థితి ప్రస్తుతం తనకు లేదని స్పష్టం చేసారు.. 2019 ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి తానే పోటీ చేస్తానని  ముఖేశ్‌ గౌడ్‌ వెల్లడించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదన్న ఆయన...కుమారుడు కోలుకున్నందునే ఆత్మీమ సమ్మేళనం నిర్వహించినట్లు చెప్పారు. అయితే పార్టీ మార్పు కోసం కార్యకర్తల సమావేశం నిర్వహించారన్నంటున్న వార్తలను కొట్టిపారేశారు ముకేశ్ గౌడ్..!