Telangana Elections 2018

చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో ఓట్లడుగుతారు : కేసీఆర్

Submitted by arun on Wed, 11/21/2018 - 15:29

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు తెలంగాణలో వేసిన పునాది రాళ్ళతో ఓ ప్రాజెక్టు కట్టొచ్చని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. పాలమూరు జిల్లాను 9 ఏళ్ళు దత్తత తీసుకున్న చంద్రబాబు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని జడ్చర్ల ఎన్నికల ప్రచార సభలో నిలదీశారు. పాలమూరును వలస జిల్లాగా మార్చిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన చంద్రబాబు మళ్ళీ మహా కూటమి పేరుతో తెలంగాణలో ప్రవేశించడానికి యత్నిస్తున్నారని అలాంటి వారిని ఓడించాలని కేసీఆర్  పిలుపునిచ్చారు.

నాలుగు జిల్లాల్లో కేసీఆర్ సుడిగాలి ప్రచారం

Submitted by arun on Wed, 11/21/2018 - 10:47

విపక్షాల మీద విమర్శలు నాలుగున్నర ఏళ్ళలో చేసిన అభివృద్ధి పనులు అధికారంలోకి వస్తే చేయబోయే పనులను హైలెట్ చేస్తూ గులాబీ బాస్ క్యాంపెయినింగ్‌ సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన కేసీఆర్ రెండో రోజు నాలుగు గంటల్లో నాలుగు జిల్లాలను చుట్టేశారు. ఒకే రోజు నాలుగు సభల్లో పాల్గొని కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో ఆయా నియోజకవర్గాల గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది.

ప్రచారానికి రాకుంటే పాతిక లక్షలు...ఎన్నికల వేళ ఆడియో టేపులు కలకలం

Submitted by arun on Wed, 11/21/2018 - 10:29

ఎన్నికల వేళ ఆడియో టేపులు కలకలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్, ఎం.ఐ.ఎం నేతల మధ్య సాగిన ఫోన్ సంభాషణలు హాట్ టాపిక్ గా మారాయి. నిర్మల్ లో  ఎం.ఐ.ఎం సభ జరుగకుండా ఉండేందుకు కాంగ్రెస్ 25 లక్షలు ఆఫర్ చేసినట్లు ఆడియో టేపుల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని అసదుద్దీన్ సభలో బహిరంగ పరిచారు.  

చివరి నిమిషంలో మనస్సు మార్చుకున్న టీడీపీ

Submitted by arun on Tue, 11/20/2018 - 11:36

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకోవాలనుకున్న టీడీపీ చివరి నిమిషంలో మనసు మార్చుకుంది. 24 సీట్లలో పోటీ చేయాలని భావించిన టీడీపీ మహాకూటమి సీట్ల సర్ధుబాటులో 14 సీట్లలో పోటీకి సిద్ధమయ్యింది. అయితే, నామినేషన్ల పర్వం ముగిసే వరకు 13 మంది అభ్యర్ధులకు మాత్రమే బీ ఫారాలు అందచేసింది. 

రూటు మార్చిన సీఎం కేసీఆర్

Submitted by arun on Tue, 11/20/2018 - 11:23

మలివిడత ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ రూటు మార్చారు. మాటల తూటాలను పక్కన బెట్టి టీడీపీ అధినేత చంద్రబాబును ఇరుకున పెట్టేలా ప్రచారం చేపట్టారు. పేద ప్రజలు, రైతులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రసంగించిన కేసీఆర్‌ మరో సారి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. కులం వద్దు మతం వద్దు అంటూనే ఓటర్లను ఆకట్టుకునేలా కొత్త వరాలను ప్రకటించారు.  

టీకాంగ్రెస్‌‌కు దడ పుట్టిస్తున్న రెబల్స్‌

Submitted by arun on Tue, 11/20/2018 - 11:13

నిన్నమొన్నటి వరకు మహా కూటమి సీట్ల సర్దుబాటుతో సతమతమైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త  తలనొప్పి వచ్చిపడింది. నామినేషన్ల గడువు ముగియడంతో పార్టీ రెబల్స్ బెడద ఆందోళన కల్గిస్తోంది. టిక్కెట్టు ఆశించి భంగపడ్డ నేతలు తిరుబాటు అభ్యర్దులుగా రంగంలోకి దిగడంతో వాళ్లందరినీ బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ.

‘తెలంగాణ ఏర్పాటు చివరి మజిలీ కాదు’

Submitted by arun on Mon, 11/19/2018 - 13:43

జేఏసీగా ఉన్న రోజుల్లోనే రాజకీయ పార్టీపై సమాలోచనలు చేశామన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన అనేక మంది మేధావులతో తమ పార్టీ పటిష్టంగా ఉందని చెప్పారు. నిరంకుశ పాలనను అంతమొందించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. తెలంగాణ ఏర్పాటు చివరి మజిలీ కాదని, అది తొలిమెట్టని అన్నారు. తెలంగాణలో తాము ఆశించేది సామాజిక మార్పు అని కోదండరామ్‌ స్పష్టం చేశారు. ప్రజలకోసం పోరాడగలిగే కొత్తతరం నాయకత్వం అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థుల గెలుపుపై పూర్తి విశ్వాసం ఉందని కోదండరాం ఆశాభావం వ్యక్తం చేశారు.

అగ్రవర్ణాలకే ప్రాధాన్యమిచ్చిన రాజకీయ పార్టీలు

Submitted by arun on Mon, 11/19/2018 - 13:22

రాజకీయ పార్టీలన్నీ అగ్రవర్ణాలకే ప్రాధాన్యమిచ్చాయని ఇప్పటివరకు జరిగిన టికెట్ల కేటాయింపు లెక్కలు చెపుతున్నాయి. ఒక్క బహుజన లెఫ్ట్‌ పార్టీ, సీపీఎం కూటమి బీఎల్‌ఎఫ్‌ మినహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తాము ప్రకటించిన స్థానాల్లో అత్యధికం ఓసీలకే ఇచ్చాయి. అధికార టీఆర్‌ఎస్‌ 119 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, అందులో 58 అగ్రవర్ణాలకు కేటాయించారు. ఇక, మహాకూటమి పక్షాన ప్రకటించిన 118 స్థానాల్లో 49 సీట్లు ఓసీలకు ఇచ్చారు. బీజేపీ కూడా 118 స్థానాల్లో 46 ఓసీలకే కేటాయించింది.

నామినేషన్ల ఘట్టం.. నేటితో సమాప్తం..

Submitted by arun on Mon, 11/19/2018 - 12:36

ఉత్కంఠను అంతకుమించి ఆసక్తిని రేపిన తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం అయిన నామినేషన్ల పర్వం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నెల 12 న మొదలైన నామినేషన్ల పర్వం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. దీంతో ఇవాళ నామినేషన్లు దాఖలు చేయడానికి భారీగా అభ్యర్థులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

నిన్న రాత్రి వరకు అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రధాన పార్టీలన్నీ తలమునకలయ్యాయి. ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ఎవరిని దించాలన్న దానిపైనా ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. చివరి నిమిషంలో బీ ఫామ్స్‌ ఇచ్చే అవకాశాలుండటంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. 

నేటి నుంచి కేసీఆర్ తుది ప్రచారం..

Submitted by arun on Mon, 11/19/2018 - 12:03

అభ్యర్థుల ఎంపిక పూర్తైంది. ఇక మిగిలింది ప్రచారమే. ఇవాళ్టి నుంచి గులాబీ బాస్‌ కేసీఆర్‌ ప్రచార పర్వం షురూ కానుంది. ఇన్నాళ్లూ అభ్యర్థుల ఎంపిక, యాగ నిర్వహణలో బిజీగా ఉన్న కేసీఆర్‌ ఇక నుంచి ఎన్నికల కధన రంగంలోకి దూకనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచే ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మంలో జరిగే ప్రచార సభకు హాజరుకానున్నారు. ఖమ్మం మొదలు ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.