Rahul Gandhi

రాహుల్‌కు తెలిస్తే ఉత్తమ్ ఉద్యోగం ఊడిపోతుంది

Submitted by arun on Tue, 08/14/2018 - 16:49

రాహుల్ గాంధీ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని టీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని తెలిపారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. కిరాయికి ప్రజలను తీసుకువచ్చి ర్యాలీలు తీశారని ఎద్దెవా చేశారు. కాంగ్రెస్ నేతల ముఖం చూసి ఎవరైనా ఓట్లు వేస్తారా? అని దానం ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో గ్రేటర్‌లో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతేనని జోస్యం చెప్పారు. ఇక సెటిలర్స్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. అసలు సెటిలర్స్‌ను ఆకర్షించే మొహాలు కాంగ్రెస్‌లో ఉన్నాయా?

రాహుల్‌ టూర్‌: తన్నుకున్న ఓయూ స్టూడెంట్స్‌

Submitted by arun on Tue, 08/14/2018 - 14:47

తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు అనుమతి లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. హరితప్లాజాలో రాహుల్ గాంధీ భేటీ ఆగమాగమైంది. ముఖ్యనేతల జాబితాలో సీనియర్‌ నేత జానారెడ్డి పేరు లేకపోవడంతో ఆయన షబ్బీర్‌ అలీలు అలిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. దీంతో గూడూరు నారయణ రెడ్డి బుజ్జగించి లోపలికి పంపించారు. ఇక రేవంత్‌ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు సైతం చేదుఅనుభవం ఎదురైంది.

ఇందిరమ్మ మనవడు

Submitted by arun on Tue, 08/14/2018 - 13:14

ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ను సిద్ధం చేస్తూ,

రాహుల్ గాంధీ ద్విముఖ వ్యూహం నడుపుతూ,

కలిసొచ్చే పార్టీలతో సై అని దోస్తీ కడుతూ,

సొంత పార్టీని మరింత బలోపేతం చేస్తూ,

సాగిపోతున్న ...ఇందిరమ్మ మనవడు. శ్రీ.కో. 

రాహుల్‌తో భేటీకి హాజరైన నారా బ్రాహ్మణి

Submitted by arun on Tue, 08/14/2018 - 12:38

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హోటల్ తాజ్ కృష్ణలో పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి దాదాపు 245 మంది ఇండస్ట్రియలిస్టులను ఆహ్వానించగా..దాదాపు వంద మందికి పైగా హాజరయ్యారు. హెరిటేజ్ గ్రూప్‌కు చెందిన నారా బ్రాహ్మణి, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, యువ పారిశ్రామిక వేత్తలు టీజీ భరత్, జేసీ పవన్ హాజరయ్యారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న GST , నోట్లరద్దు తదనంతర పరిణామాలపై రాహుల్ చర్చిస్తున్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్ర విభజర తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ది కోసం తీసుకున్న చర్యలు గురించి ఆరా తీస్తున్నారు.

చెయ్యి అధికారంలోకి

Submitted by arun on Tue, 08/14/2018 - 12:23

తెలంగాణలో, కేంద్రంలో తమ చేయి వస్తోందట, 

అధికారంలోకి ఇక వచ్చేది తామేనట,

ప్రదాని మోదీలా వారు అబద్ధాలు చెప్పరట,

వారు ఏది చెబుతారో అదే చేసి చూపిస్తారట. శ్రీ.కో 

నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది: రాహుల్ గాంధీ

Submitted by arun on Tue, 08/14/2018 - 12:16

కొద్దిసేపటి క్రితం రాహుల్ గాంధీ.. హోటల్ హరిత ప్లాజాలో మీడియా సంపాదకులతో సమావేశమ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై రాహుల్ ఎడిటర్లతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. 2019 ఎన్నికల తర్వాత మోడీ చాప్టర్ ముగుస్తుందని వ్యాఖ్యానించిన రాహల్..లోక్‌సభలో తన కౌగిలింత ప్రధానికి నచ్చలేదని అన్నారు. ఇక  జమిలి ఎన్నికలు సమాఖ్య స్పూర్తికి విరుద్ధమన్నారు...కాంగ్రెస్ అధినేత. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని రాహుల్ స్పష్టం చేశారు. మీడియాపైనా, జర్నలిస్టులపైనా దాడులు జరుగుతున్నాయన్నాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ రకమైన హిందూత్వను నమ్మనని  అన్నారు.

ఇద్దరిదీ మోసమే..

Submitted by arun on Tue, 08/14/2018 - 10:38

తెలంగాణ టూర్ లో రాహుల్ అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని కడిగేశారు. అటు మోడీ, కేసిఆర్  వ్యవహార శైలిపై చురకలేశారు. మహిళలు లేనిదే పురోగతి సాధ్యం కాదన్న రాహుల్ డబల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్ మోసం చేశాడన్నారు. 

రాహుల్ కామెంట్స్ కు కేసీఆర్ కౌంటర్...మా కుటుంబ పాలన మంచిదే

Submitted by arun on Tue, 08/14/2018 - 10:17

రాహుల్ తెలంగాణ టూర్ సందర్భంగా ఫ్యామిలీ పాలిటిక్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందంటూ రాహుల్ చేసిన కామెంట్స్ పై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ కుటుంబ పాలనతో పోల్చితే, తమ పాలన బెటర్ అన్నారు. కుటుంబపాలన అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఆరోపణలు చేసే క్రమంలో తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ పాలన సాగుతోందని ఆరోపించారు. 
  

కాంగ్రెస్‌తోనే మహిళాభివృద్ధి: రాహుల్

Submitted by arun on Mon, 08/13/2018 - 16:54

నరేంద్ర మోదీ ప్రభుత్వం సామన్య ప్రజలకు చేసిందేమీ లేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పర్యటనలో భాగంగా సోమవారం హైదరాబాద్ చేరుకున్న ఆయన.. రాజేంద్రనగర్‌లోని క్లాసిక్ కన్వెన్షన్ హాల్‌‌లో మహిళా స్వయం సహాయక బృందాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ...‘ మహిళలు ఎదగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేయడమే కాంగ్రెస్ లక్ష్యం.  ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు వెళితేనే అభివృద్ధి జరుగుతుంది.

రాహుల్‌కు...స్పెషల్ బిర్యానీ

Submitted by arun on Mon, 08/06/2018 - 13:57

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 13, 14న తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాయ్. పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ హైదరాబాద్‌ బిర్యానీ రుచులను టేస్ట్ చేయనున్నారు. మరోవైపు రాహుల్ పర్యటనను అడ్డుకుంటామని టీఆర్ఎస్‌వీ హెచ్చరించింది.