Teacher’s Day

గురు-శిష్య పరంపర

Submitted by arun on Wed, 09/05/2018 - 16:03

ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా,

మన వారసత్వమైన గురు-శిష్య పరంపరగా,

మన నాగరికత మరియు సంస్కృతి వివరించిరిగా,

మన రాష్టపతి శ్రీ రామ్ నాథ్ కోవిండ్ గారు. శ్రీ.కో. 


ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా, రాష్టపతి శ్రీ రామ్ నాథ్ కోవిండ్ దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులకి శుభాకాంక్షలు తెలిపారు, "ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంలో ఉపాధ్యాయులకు నా శుభాకాంక్షలు మరియు సత్ప్రవర్తనలను విస్తరించడంలో మీ పాత్ర, నాకు చాలా ఆనందం ఉంది. మన సంస్కృతి మరియు వారసత్వ లక్షణం గురు-శిష్య పరంపరగా ఉంది అన్నారు.

పుట్టినరోజు “ఉపాధ్యాయుల దినోత్సవం”

Submitted by arun on Wed, 09/05/2018 - 15:34

డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్టపతిగా ఉన్నప్పుడు, కొంతమంది విద్యార్ధులు మరియు మిత్రులు అతడిని తన పుట్టినరోజును సెప్టెంబర్ 5 వ తేదీలో జరుపుకునేందుకు అనుమతించమని కోరారు.  అప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, "నా పుట్టినరోజును జరుపుకునేందుకు బదులు, 5 సెప్టెంబర్ ఉపాధ్యాయుల దినోత్సవంగా చేసుకుంటే నాకు చాల సంతోషం అని చెప్పాడట.  శ్రీ.కో.

సర్వేపల్లి పెళ్లి విశేషాలు

Submitted by arun on Wed, 09/05/2018 - 12:58

సర్వేపల్లి రాధాకృష్ణనుడు బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన. అలాగే  సర్వేపల్లి రాధాకృష్ణనుకి  వివాహం చాల చిన్న వయస్సులోనే జరిగింది,1906 లోన 18 సంవత్సరాల చిరుప్రాయంలో శివకామమ్మతో వివాహము జరిగింది. వీరికి ఐదుగురు కూతుళ్ళు, ఒక కుమారుడు కలిగారు. శ్రీ.కో

భోజనం చేసేందుకు అరిటాకు కూడా కొనలేని స్థితి

Submitted by arun on Wed, 09/05/2018 - 12:45

సర్వేపల్లి రాధాకృష్ణన్ చిన్నపుడు వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితి  బాగా లేదట. ఉన్నత విద్య చదివించే స్తోమత లేదని తండ్రి వీరాస్వామి కొడుకును పూజారిగా చేయమన్నారు. కానీ రాధాకృష్ణన్‌కు చదువంటే ప్రాణం. అందుకే ఉన్నత పాఠశాల చదువుకోసం తిరుపతిలోని మిషనరీ పాఠశాలలో చేరారు. ఇక అప్పటినుంచీ ఈయన చదువంతా స్కాలర్షిప్ తోనే సాగిపోయింది. భోజనం చేసేందుకు అరిటాకు కూడా కొనలేని పరిస్థితుల్లో ఆయన నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.  శ్రీ.కో.