Rahul Gandhi

అధికారంలోకి రాగానే ఏపీకి హోదా ఇస్తాం: రాహుల్

Submitted by arun on Tue, 09/18/2018 - 15:59

కర్నూల్ బై రెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న రాహుల్ అనేక అంశాలపై స్పష్టత ఇచ్చారు. విద్యార్ధులు అడిగిన పలు ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు చెప్పారు. మోడీ ప్రభుత్వం కొంత మంది కార్పోరేట్ల కోసమే పని చేస్తోందని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని రాహుల్ గాంధీ అన్నారు. ఏపీకి కేంద్రం నుంచి ప్రత్యేక సాయం అందాలని అభిప్రాయపడ్డారు. చైనాలో రోజుకు 50 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుంటే భారత్‌లో కేవలం 450 ఉద్యోగాలు మాత్రమే లభిస్తున్నాయని రాహుల్ గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి

Submitted by arun on Fri, 09/14/2018 - 11:32

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలో వలసలు, చేరికలు ఊపందుకున్నాయి. పలువురు తెలంగాణ ప్రముఖులు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ లో చేరారు. అలాగే నిజామాబాద్ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కూడా రాహుల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఎమ్మెల్సీ భూపతిరెడ్డి తెలిపారు. ఉద్యోగాలు లేవని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని విమర్శించారు.

కాంగ్రెస్‌లో చేరిన బండ్ల గణేశ్‌...పవన్‌ కల్యాణ్‌ తనకు దేవుడితో సమానమనీ

Submitted by arun on Fri, 09/14/2018 - 11:23

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలో వలసలు, చేరికలు ఊపందుకున్నాయి. పలువురు తెలంగాణ ప్రముఖులు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ లో చేరారు. రాహుల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. త్యాగాలకు ప్రతిరూపం కాంగ్రెస్‌ పార్టీ అని సినీ నిర్మాత బండ్ల గణేష్‌ అన్నారు. కాంగ్రెస్‌ అంటే ఇష్టం కావడంవల్లే ఆ పార్టీలో చేరానని చెప్పారు. పార్టీ ఏదీ చెబితే అది చేస్తానన్న బండ్ల గణేష‌..ఎన్నికల్లో పోటీ చేయమంటే చేస్తానని అన్నారు.

కేవలం 20 సెకన్లు ఆలస్యమైతే...రాహుల్‌ విమానం గాల్లోనే పేలిపోయి ఉండేది

Submitted by arun on Sat, 09/01/2018 - 13:45

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పెద్ద గండం నుంచి తప్పించుకున్నారు. కేవలం ఇరవై అంటే 20 సెకన్ల తేడాతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్‌ 26న రాహుల్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌‌పై డీజీసీఏ షాకింగ్‌ నిజాలు బయటపెట్టింది. మరో 20 సెకన్లు ఫ్లైట్‌ గాల్లో ఉంటే జరగరానిది జరిగేదంటూ సంచలన విషయాలు పెద్ద బాంబు పేల్చింది.

నోట్ల రద్దు పెద్ద కుంభకోణం

Submitted by arun on Thu, 08/30/2018 - 18:05

నోట్ల రద్దు అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వాన్ని మరో సారి టార్గెట్ చేశారు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాలను ప్రస్తావించన రాహుల్ గాంధీ ప్రధాని మోడీని నిలదీశారు. దేశ ప్రజలకు మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దును ఓ పెద్ద కుంభకోణంగా అభివర్ణించిన రాహుల్ దేశంలో చిన్న, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 

పొత్తులు ఉంటాయ్‌...టీడీపీ లీడర్లు వదులుతున్న లీకులు...

Submitted by arun on Wed, 08/22/2018 - 10:30

టీడీపీ, కాంగ్రెస్‌ మధ్య వైరం చెరిగిపోనుందా? వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేయనున్నాయా? తెలుగుదేశం లీడర్లు వదులుతున్న లీకులు దేనికి సంకేతం? కాంగ్రెస్‌పై గతంలో ఉన్నంత వ్యతిరేకత ఇప్పుడు లేదని చంద్రబాబు ఎందుకన్నట్లు?. కర్నాటక సీఎం కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో సోనియా, రాహుల్‌తో వేదికను పంచుకున్న చంద్రబాబు కాంగ్రెస్‌‌కు దగ్గరయ్యారా? దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పాత్ర ఎలా ఉండబోతోంది?

రాష్ట్రానికి కొత్త బిచ్చగాళ్లు వచ్చారు: కేటీఆర్

Submitted by arun on Thu, 08/16/2018 - 08:39

రాష్ట్రానికి కొత్త బిచ్చగాళ్లు వచ్చారంటు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు మంత్రి కేటిఆర్. కరీంనగర్ లో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్దాపన చేశారు. అవినితి, కాంగ్రేస్ పార్టీ రెండు అవిభక్త కవలలన్నారు. రాహుల్ పర్యటనలో ఆయన వెంటన ఉన్న నేతలు బెయిల్ పై జైలు నుంచి వచ్చిన వారేనన్నారు. 

టార్గెట్‌ అంటూ.. పెళ్లికి టాటా చెప్పేసిన రాహుల్‌

Submitted by arun on Wed, 08/15/2018 - 11:06

సొట్టుబుగ్గల కుర్రాడి సొగసు తగ్గుతోంది. ఏజ్‌ బార్‌ అవుతోంది. లక్ష్యం సాధించిన తర్వాతే పెళ్లి గిల్లీ అంటూ జోకులేసిన రాహుల్‌ చివరకు పెళ్లి సంగతి తేల్చిచెప్పేశారు. 49 ఏళ్లు వస్తున్నాయి. అది కూడా వచ్చే ఏడాదికి దాటబోతోంది. మరి ఇంకెన్నాళ్లు.? మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ అసలు పెళ్లి చేసుకోరా? ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్‌ పునర్వైభవం కన్నా యువరాజా వారి పెళ్లే హాట్‌టాపిక్‌ మారింది. ఇంతలోనే రాహుల్‌ బాంబు పేల్చేశారు.

రాహుల్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే

Submitted by arun on Tue, 08/14/2018 - 17:32

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో  టీడీపీ ఎమ్మెల్యే, బీసీ నాయకుడు ఆర్‌.కృష్ణయ్య మంగళవారం నాడు సమావేశమయ్యారు.  ఈ సమావేశానికి రాజకీయ  ప్రాధాన్యత లేదని ఆర్. కృష్ణయ్య ప్రకటించారు. దాదాపు మూడు గంటల పాటు రాహుల్‌‌తోనే ఆర్‌.కృష్ణయ్య కలిసి తిరిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ప్రజా చైతన్య బస్సులోకి ఎక్కి వారితో ప్రయాణం చేశారు. ఆర్‌.కృష్ణయ్యను బస్సులోకి కుంతియా ఆహ్వానించారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం రాహుల్‌ను కలిశానని ఆర్‌.కృష్ణయ్య స్పష్టం చేశారు. తెలంగాణలోని ఎల్బీనగర్  నుండి టీడీపీ నుండి గత ఎన్నికల్లో ఆర్. కృష్ణయ్య  విజయం సాధించారు. 

రాహుల్‌కు తెలిస్తే ఉత్తమ్ ఉద్యోగం ఊడిపోతుంది

Submitted by arun on Tue, 08/14/2018 - 16:49

రాహుల్ గాంధీ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని టీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని తెలిపారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. కిరాయికి ప్రజలను తీసుకువచ్చి ర్యాలీలు తీశారని ఎద్దెవా చేశారు. కాంగ్రెస్ నేతల ముఖం చూసి ఎవరైనా ఓట్లు వేస్తారా? అని దానం ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో గ్రేటర్‌లో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతేనని జోస్యం చెప్పారు. ఇక సెటిలర్స్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. అసలు సెటిలర్స్‌ను ఆకర్షించే మొహాలు కాంగ్రెస్‌లో ఉన్నాయా?