monkeys

కోతుల పాలిట ఆపద్బాంధవుడిగా మారిన స్వప్నిల్ సోని...ప్రతీ సోమవారం కోతులకు 1700 రొట్టెలు

Submitted by arun on Sat, 10/27/2018 - 13:28

అటవీ ప్రాంతంలో ఏమీ దొరక్క ఆకలి తీర్చుకునేందుకు జనావాసాల్లోకి వచ్చిన కోతులకు అహ్మదాబాద్‌కు చెందిన స్వప్నిల్ సోని ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు. స్వప్నిల్ సోని ప్రతీ సోమవారం పండ్లు, రొట్టెలను కోతులకు ఆహారంగా అందిస్తున్నాడు. స్వప్నిల్ సోని ప్రతీ సోమవారం 1700 రొట్టెలను కోతులకు ఆహారంగా అందిస్తున్నాడు. కోతులకు నేను గత పదేళ్లుగా ఆహారం అందిస్తున్నా. ఆరు నెలల క్రితం నా ఆర్థిక పరిస్థితి క్షీణదశకు చేరుకుంది. అయినా కానీ కోతులకు మాత్రం రొట్టెలు ఇవ్వడం మానలేదు. ప్రస్తుతం ఆర్థికంగా బాగానే ఉన్నా. నా కొడుకు కూడా ఈ పనిలో భాగస్వామ్యమవుతాడని స్వప్నిల్ సోని చెప్పాడు.

గుండెపోటుతో 12 కోతులు మృతి!?

Submitted by lakshman on Tue, 09/12/2017 - 19:55

యూపీః గుండెపోటుతో కోతులు చ‌నిపోవ‌డమేంట‌ని క్వ‌శ్చ‌న్ మార్క్ ఫేస్ పెట్ట‌కండి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కొత్వాలీ మ‌హమ్మాది ప్రాంతంలో 12 కోతులు ఒకేచోట చ‌నిపోయి క‌నిపించ‌డం స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. ఏ క్రూరమృగం వాటిని గాయ‌ప‌ర‌చ‌లేదు. ఒంటిపై ఒక్క గాయం కూడా లేదు. కానీ కోతులన్నీ ఒకేచోట శవాలుగా క‌నిపించ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఈ వ్య‌వ‌హారంపై వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ పులి ఆ ప్రాంతంలో ప‌దేప‌దే సంచ‌రిస్తున్న దృశ్యాలను కోతులు చూడ‌టం, పులి గాండ్రింపుల‌ను ప‌దేప‌దే విన‌డం వ‌ల్ల గానీ గుండెపోటు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న చెబుతున్నారు.