uttar pradesh

యూపీ సీఎంగా రాజ్‌నాధ్?

Submitted by arun on Sat, 06/02/2018 - 13:32

ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో సీఎం పీఠం ఎక్కారు యోగి. కానీ అవన్నీ తాటాకుచప్పుళ్లేనని, ప్రభుత్వాసుపత్రుల్లో చిన్నపిల్లల మరణ మృదంగంతో తేలిపోయింది. గోరఖ్‌పూర్‌ ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక కొందరు, మెదడువాపు వ్యాధితో మరికొందరు పిల్లలు, పిట్టల్లా రాలిపోయారు. 42 గంటల్లో 42 మంది కన్నుమూశారు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే 323 మంది పిల్లలు చనిపోయారు. ఆక్సిజన్‌ సిలిండర్ల బకాయిలు  చెల్లించకపోవడంతో, చిన్నారులు ఊపిరందక చనిపోయారు. ఏదో చేస్తాడని భావించిన యోగి ఆదిత్యనాథ్‌‌, పాలన ఇంతేనా అని పిల్లలు పోగొట్టుకున్న తల్లులు రోదించారు.

భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త

Submitted by arun on Fri, 06/01/2018 - 14:56

భార్య మనసు తెలుసుకున్న ఓ భర్త ఆమె అభీష్టం ప్రకారమే ప్రియుడితో పెళ్లి జరిపించాడు. అచ్చం సినిమాను తలపించేలా జరిగిన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని చకేరి పరిధిలో చోటు చేసుకుంది. సుజిత్ అలియాస్ గోలు అనే వ్యక్తి ఫిబ్రవరి 19న శ్యామ్ నగర్‌లో శాంతి అనే యువతిని పెళ్లాడాడు. పెళ్లయిన కొద్ది రోజులకే శాంతి ఎవరికీ చెప్పకుండా అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. ఎన్ని రోజులైనా భార్య తిరిగి రాకపోవడంతో సుజిత్ ఆమెను కలిశాడు. ఇంటికి ఎందుకు రావడం లేదో చెప్పమని అడిగాడు. ముందుగా సమాధానం దాటవేసేందుకు శాంతి ప్రయత్నించింది. భర్త గుచ్చి గుచ్చి అడిగేసరికి అసలు విషయం బయటపెట్టింది.

బీజేపీకి కష్టకాలం మొదలైందా..ఉప ఎన్నికల్లో వరుస ఓటమికి కారణమేంటి..?

Submitted by arun on Fri, 06/01/2018 - 11:07

నాలుగేళ్ళ ఏడాది క్రితం వరకు తనకు ఎదురు లేదని భావించిన బీజేపీకి కష్టకాలం మొదలైందా..? ఉప ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడానికి కారణమేంటి..? మోడీ మేనియా తగ్గిందా..? అమిత్‌ షా మ్యాజిక్ పని చేయడం లేదా..? విపక్షాల ఐక్యతే కమల నాథుల కొంప ముంచుతోందా..? మొత్తంగా 2019 ఎన్నికల్లో మోడీకి డేంజర్ బెల్స్ మోగినట్లేనా..?

స్కూలు బస్సును ఢీకొన్న రైలు.. 13మంది మృతి

Submitted by arun on Thu, 04/26/2018 - 10:59

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుషీనగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు దాటుతున్న పాఠశాల బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 13మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. రైలు ఢీకొన్న వేగానికి బస్సు తునాతునకలైంది. డివైన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన బస్సును థావే-కపటన్‌గంజ్‌ ప్యాసింజర్‌ రైలు బెహ్‌పుర్వా రైల్వే క్రాసింగ్‌ వద్ద ఢీకొట్టిందని రైల్వే అధికార ప్రతినిధి వేద్‌ ప్రకాశ్‌ వెల్లడించారు. రైలు సివాన్‌ నుంచి గోరఖ్‌పూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ఉన్నారని, వారిలో ఎక్కువ మంది 10 సంవత్సరాల లోపు చిన్నారులే అని అధికారులు తెలిపారు.

మరో వివాదానికి తెరలేపిన యోగి ప్రభుత్వం

Submitted by arun on Tue, 04/10/2018 - 14:39

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుకు రాంజీని చేరుస్తూ వివాదం రేపిన యోగి ప్రభుత్వం కాషాయం కోటు ధరించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మరో వివాదానికి తెరలేపారు. బదౌన్‌లో దుండగులు కూలగొట్టిన అంబేద్కర్‌ విగ్రహాన్ని పున:ప్రతిష్టించిన అధికారులు రెగ్యులర్‌గా కనిపించే బ్లూకలర్‌ కోటు కాకుండా కాషాయ రంగు వేశారు. దాంతో దళితులు మళ్లీ ఆందోళన బాటపట్టారు. దళితవాదానికి సైతం బీజేపీ నేతలు కాషాయ రంగు పులిమారంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, బస్సులకు కాషాయరంగు వేసిన యోగి సర్కారు అంబేద్కర్ కు కూడా కాషాయ రంగు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

యోగిని సీఎం పీఠం నుంచి తప్పిస్తారా?

Submitted by arun on Tue, 04/10/2018 - 12:00

యూపీ జంగిల్‌ రాజ్‌కు పాతరేసి, రామరాజ్యానికి పునరుద్దిస్తానన్నాడు. కానీ అరాచక రాజ్యం సాగుతోంది. యూపీ రూపురేఖలు మారుస్తానన్నాడు. కులంమతం గొడవలతో రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతోంది. గోరఖ్‌పూర్‌ను ఏలినట్టే, రాష్ట్రాన్ని పాలిస్తాడని ఆశించారు. కానీ అవన్నీ అడియాశలేనని, పిల్లల మరణమృదంగం సాక్షిగా అర్థమైంది. వివక్షపై దళిత ఎంపీలు తిరగబడుతున్నారు. అగ్రకులాలకేనా ప్రాధాన్యత, కనీస మర్యాద ఇవ్వరా అని, భాగస్వామ్య పార్టీలు కన్నెర్రజేస్తున్నాయి. యూపీ బైపోల్ సాక్షిగా, బీజేపీకి బీపీ పెరుగుతోంది. యోగి ఆదిత్యనాథ్‌, పాలనపై ఒక్క ఏడాదిలో ఎందుకింత వ్యతిరేకత పెరుగుతోంది?

మోదీకి మరో బీజేపీ ఎంపీ షాక్‌

Submitted by arun on Sat, 04/07/2018 - 15:40

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మరో దళిత ఎంపీ యశ్వంత్ సింగ్ ఊహించని షాక్ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో దళితుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపిందంటూ నిలదీశారు. నాగిన నియోజవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్న యశ్వంత్.. కేవలం రిజర్వేషన్ కారణంగానే తాను ఎంపీనయ్యానన్నారు. ‘‘ఒక దళితుడిగా నా సామర్ధ్యాన్ని ఏమాత్రం ఉపయోగించుకోవడం లేదు. నేను కేవలం రిజర్వేషన్ కారణంగానే పార్లమెంటు సభ్యుడిని కాగలిగాను. దేశంలోని 30 కోట్ల మంది దళితులకు గత నాలుగేళ్లలో కేంద్రప్రభుత్వం చేసింది శూన్యం...’’ అంటూ తన లేఖలో ధ్వజమెత్తారు.

అంబేడ్కర్ విగ్రహం విధ్వంసం

Submitted by arun on Sat, 03/31/2018 - 17:46

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో రెండు చోట్ల అంబేద్కర్‌ విగ్రహాల ధ్వంసం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..యూపీలోని అలహాబాద్‌ పట్టణంలోని త్రివేణిపురంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిని గుర్తించిన స్థానికులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు (ఎస్‌ఎస్‌పీ) ఆకాష్‌ కులరి పేర్కొన్నారు.

అప్పుతీర్చమన్నందుకు యువకుడిని చావగొట్టిన వ్యక్తి

Submitted by arun on Fri, 03/30/2018 - 11:30

అప్పు తీర్చమన్నందుకు ఒక యువకుడిని చావగొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని దేవరియాలో జరిగింది. ఓ యువకుడు నాసిర్ అన్సారీ అనే వ్యక్తికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. అయితే కొన్నాళ్లుగా అప్పు తీర్చకుండా లేట్ చేయడంతో ఆ యువకుడు నాసిర్ అన్సారీని నిలదీశాడు. గొడవ పెరగడంతో నాసిర్ పై చేయి చేసుకున్నాడు సదరు యువకుడు. దీంతో కోపం పెంచుకున్న నాసిర్ అన్సారీ తన స్నేహితులతో కలసి ప్లాన్ చేసి ఆ యువకుడిని చితక్కొట్టారు. 

ఉపఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన బీజేపీ

Submitted by lakshman on Wed, 03/14/2018 - 20:25

ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లోని మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పుర్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్‌ నిషాద్‌ భారీ ఆధిక్యతతో దూసుకెళ్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్య ప్రాతినిధ్యం వహించిన ఫుల్పూర్‌లో సమాజ్‌వాదీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్‌ సింగ్‌ పటేల్‌ తన సమీప బీజేపీ అభ్యర్థి కౌశలేంద్ర సింగ్‌ పటేల్‌పై 59,460 ఓట్ల భారీ తేడాతో విజయభేరి మోగించారు. బీజేపీ  ఘోర పరాభవాన్ని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అంగీకరించారు.