BJP Political Strategy

నేమ్‌ మారిస్తే.. ఫేమ్‌ మారుతుందా... కమలనాథుల ఈ కొత్త వ్యూహమేంటి?

Submitted by santosh on Mon, 11/12/2018 - 10:57

హైదరాబాద్ పేరు మార్చి కొత్త పేరు పెడతాం.. తెలంగాణలో కొన్ని పట్టణాల పేర్లు మార్చేస్తాం..  ఇది విన్నాక అవునా.. నిజమా అన్న సందేహం వస్తుందా..? అవును తమ పార్టీ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో పలు ప్రాంతాల పేర్లను మార్చి కొత్త పేర్లను పెడతామని రాజకీయ నాయకులు ప్రకటిస్తున్నారు.. తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు.. ప్రచారాల్లో చాలా బిజీ అయిపోయారు.. ఎవరికి నచ్చిన హామీలు వారిస్తూ ప్రజల మనసును గెలుచుకునే పనిలో పడ్డారు నేతలు. అయితే బీజేపీ నాయకులు స్వామిపరిపూర్ణానంద, గోషామల్ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇదే పనిలో పడ్డారు..

బీజేపీ సరికొత్త ప్రచారాస్త్రం...సర్వే ఫలితాలపై...

Submitted by arun on Wed, 09/05/2018 - 09:56

బీజేపీ ఈ పేరు చెబితే చాలు విపక్షాలు ఒంటి కాలి మీద లేస్తుంటాయి. మహాగఠ్ బంధన్ తో బీజేపీని ఓడిస్తామంటాయి. తాజా ఉపఎన్నికల్లో బీజేపీని ఓడిపోవడాన్ని గుర్తు చేస్తుంటాయి. పొత్తుల కోసం త్యాగాలకు సిద్ధమంటాయి. విపక్షాలు ఇంతగా ఆవేశపడుతున్నా బీజేపీ మాత్రం కూల్ గానే ఉంది. దాని లెక్కలు దానికి ఉన్నాయి. విపక్షాలు దండెత్తి వస్తున్నా బీజేపీ అంత కూల్ గా ఎలా ఉండగలుగుతోంది ? అంత ధీమా ప్రదర్శించడానికి కారణమేంటి ? విజయం పై అంత భరోసాను ఆ పార్టీ వ్యూహకర్తలు ఎలా ఇవ్వగలుగుతున్నారు అసలు ఆ పార్టీ వ్యూహం ఏంటి ఆ పార్టీ చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్ర్తం ఏంటి.