delhi

నిషేధం రేపే..!

Submitted by arun on Wed, 10/31/2018 - 14:43

దేశ రాజధానిలో కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఢిల్లీలో 15 ఏళ్ల కిందటి పెట్రోల్‌ వాహనాలు, పదేళ్ల కిందటి డీజిల్‌ వాహనాల రాకపోకలను సుప్రీంకోర్టు నిషేధించడంతో ఆ తీర్పు అమలు దిశగా ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కాలుష్య తీవ్రత పెరిగితే రేపటి నుంచే ఢిల్లీలో అన్ని ప్రైవేటు కార్లును నిషేధించాలని యోచిస్తోంది. ఢిల్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది దేశ రాజధానిలో పీల్చేందుకు కనీసం గాలి లేక జనం అల్లాడిపోతున్నారు క్షణం క్షణం ఊపిరి నిలబెట్టుకోడానికి నానా అగచాట్లూ పడుతున్నారు. పులి మీద పుట్రలా మరో వారంలో వస్తున్న దీపావళి పండుగ వారిని భయపెడుతోంది.

Tags

రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు ..

Submitted by arun on Wed, 10/31/2018 - 10:33

సీఎం చంద్రబాబు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారా..? వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మోడీ మరోసారి ప్రధాని పీఠం ఎక్కకుండా చేయాలనే పట్టుదలతో ఉన్నారా..? బీజేపీ యేతర పార్టీలను ఏక తాటిపైకి తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశారా..? బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే అజెండాగా చంద్రబాబు రేపటి ఢిల్లీ పర్యటన జరగబోతోందా..? 

రేపు ఢిల్లీకి చంద్రబాబు.. ఏం జరగబోతోంది?

Submitted by arun on Fri, 10/26/2018 - 17:26

ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. విశాఖ ఎయిర్‌ పోర్టులో ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి, ఆపరేషన్ గరుడ అంశాలను ఆయన దేశం దృష్టికి తీసుకురానున్నారు. గవర్నర్ వ్యవస్థను కేంద్రం వాడుకుంటుందని సీరియస్‌గా ఉన్న చంద్రబాబు కేంద్రం ఏపీకి మొండిచేయి, విభజన హామీలు నెరవేర్చకపోవడం, తిత్లీ తుపానుపై స్పందించకపోవడం లాంటి అంశాలపై మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. 

ఢిల్లీ లోని ఎర్రకోట మొదట్లో ఎర్ర కాదట!

Submitted by arun on Tue, 10/23/2018 - 12:38

ఢిల్లీ లోని ఎర్రకోట మొదటి నుండి ఎర్ర కోట కాదట.. 1648 లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ కోటను నిర్మించినప్పుడు, అది తెల్ల రంగులో ఉంది, అది ఇసుక రాళ్ళతో నిర్మించబడింది. అయితే దాని యొక్క వైట్ రాయి పైన మెరుగు పోయినప్పుడు బ్రిటీష్ వారు దానికి ఎరుపు రంగు వేయించారట.. అలాగే  పేరు కూడా మార్చారట. ఇదంతా  బ్రిటిష్ వారి ఆదేశాల మేరకు జరిగిందట. శ్రీ.కో
 

తుపాకీతో మాజీ ఎంపీ కొడుకు హల్‌చల్‌!

Submitted by nanireddy on Tue, 10/16/2018 - 14:40

ప్రజాప్రతినిధుల పుత్రరత్నాలు రెచ్చిపోతున్నారు. సమాజంలో పది మందికి మార్గదర్శకంగా నిలవాల్సిన వారు గాడి తప్పుతున్నారు. తమను ఎవరూ ఏమి చేయలేరనే ధీమాతో తప్పులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఢిల్లీలోని హోటల్లో బిఎస్పికి చెందిన మాజీ ఎంపి కుమారుడు ఆశిష్ పాండే వీరంగం సృష్టించాడు. తుపాకీని చేతిలో పట్టుకొని ఓ యువతిని బెదిరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఢిల్లీలోని ఓ పైవ్ స్టార్‌ హోటల్లో జరిగిన పార్టీకి హాజరైన ఆశిష్ ఉన్నట్టుండి మహిళల వాష్ రూమ్‌ వైపు నడుస్తూ వెళ్ళాడు. అతన్ని గమనించిన ఓ మహిళ ఆపేందుకు ప్రయత్నించింది. దీంతో ఆశిష్ తిరిగి వెనిక్కి వేళ్ళిపోయాడు.

Tags

తన ప్రియురాలు మరో యువకుడితో స్నేహం చేస్తుందని...

Submitted by arun on Wed, 09/26/2018 - 10:53

తన ప్రియురాలు వేరే యువకుడితో స్నేహం చేస్తోందని ఓ యువకుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని హజ్రత్‌ నిజాముద్దీన్‌ ప్రాంత పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. నిజాంనగర్ ప్రాంత వాసి రిజ్వాన్‌ఖాన్ (20) అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో గత 11 నెలలుగా ప్రేమిస్తున్నాడు. తన ప్రేయసి మరో యువకుడితో స్నేహంగా ఉంటుందని తెలిసిన రిజ్వాన్ ఖాన్ ప్రేయసితో గొడవపడ్డాడు. అనంతరం కత్తి తీసుకొని ప్రియురాలి మెడ కోసి రెండు ముక్కలు చేశాడు. ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి రెండు బ్యాగుల్లో పెట్టాడు. ప్యాక్‌ చేసి సమీపంలోని బారాపుల్లా ఫ్లైఓవర్‌ కిందగల మురికి కాలువలో పడేశాడు.

ముఖ్యమంత్రి ముఖ్య పనులపై...

Submitted by arun on Fri, 08/03/2018 - 14:49

ఢిల్లీకి బయలుదేరే ముఖ్యమంత్రి గారు,

మూడు రోజులు అక్కడే పనులు జోరు,

జోనల్ విధానాలు కోసమడిగే మంజూరు,

ఇక చెయ్యండి అనే విభజన హామీల షురు.శ్రీ.కో

ఢిల్లీలో టవరెక్కిన హోదా

Submitted by arun on Fri, 07/27/2018 - 14:51

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఓ యువకుడు టవరెక్కాడు. ఢిల్లీ మెట్రో భవన్ సమీపంలోని ఓ సెల్ టవర్‌పై ఎక్కిన నిరసనకు దిగాడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ చేతిలో బ్యానర్‌ పట్టుకుని నినాదాలు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని కిందికి దించే ప్రయత్నం చేశారు.

దేశ రాజధానిలో మరో దారుణం

Submitted by arun on Tue, 07/24/2018 - 12:37

దేశ రాజధాని సమీపంలో మరో కీచక పర్వం వెలుగు చూసింది. ఝాన్సీలో ఓ ప్రేమ జంట‌ను చుట్టుముట్టిన  పోకిరీలు వెకిలి చేష్టలతో వేధించారు. యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు. ఓ పోకిరీ యువతితో బలవంతంగా సెల్పీ కూడా దిగాడు. ప్రేమ జంటపై పోకిరీల వేధింపుల వీడియో వైరల్  కావడంతో పోలీసులు స్పందించారు. ప్రేమ జంటను వేధించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags