delhi

ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన వైసీపీ బృందం

Submitted by chandram on Tue, 11/13/2018 - 19:50

జగన్‌ పై హత్యాయత్నం కేసును కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని వైసీపీ నాయకులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కోరారు. ఇవాళ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్‌ కోవింద్‌తో వైసీపీ బృందం భేటీ అయ్యింది. సుమారు అరగంట పాటు జరిగిన భేటీలో జగన్‌పై జరిగిన దాడిని రాష్ట్రపతికి వివరించారు.  హత్యాయత్నంలో నిష్పపాక్షిక విచారణ జరగాలంటే థర్డ్‌ పార్టీతో కేసు దర్యాప్తు చేయించాలని రాష్ట్రపతికి విన్నవించామని వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాకు వెల్లడించారు. కుట‌్రదారులు బయటపడాలంటే దర్యాప్తు ఏపీ ప్రభుత్వం పరిధిలో ఉండకూడదని వైసీపీ నాయకులు చెప్పుకొచ్చారు. 

ఢిల్లీలో కాంగ్రెస్‌ ఆశావహుల ఆందోళన

Submitted by chandram on Sun, 11/11/2018 - 17:19

ఢిల్లీలో కాంగ్రెస్‌ ఆశావహుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. టికెట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ తెలంగాణభవన్‌వద్ద అంబేద్కర్‌ విగ్రహం ఎదుట దళిత నేతలు ఆందోళన చేపట్టారు. ప్యారాచూట్‌ నేతలకు సీట్లు కేటాయించొద్దని, పార్టీని నమ్ముకుని ఎన్నోఏళ్లుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామని అన్నారు. నిన్నమొన్న పార్టీలోకి వచ్చినవారికి టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారని, అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత పాటించడంలేదని దళిత నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీకి అసమ్మతి సెగలు

Submitted by arun on Sat, 11/10/2018 - 13:08

కాంగ్రెస్‌ నేతల నిరసనలతో ఢిల్లీ మార్మోగుతోంది.తెలంగాణ భవన్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ ఆశావహులు ఆందోళనకు దిగారు.  సీట్ల కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని  నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో నల్గొండ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌యాదవ్‌,  ఓబీసీ సెల్‌ కన్వీనర్‌ అశోక్‌గౌడ్‌, పీసీసీ మాజీ కార్యదర్శి రాపోలు జయప్రకాశ్‌, యూత్‌ కాంగ్రెస్‌ స్టేట్‌ జనరల్‌ సెక్రటరీ సతీష్‌గౌడ్‌ పాల్గొన్నారు. బీసీలకు 40 సీట్లు, బీసీ నేతలకే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మహాకూటమిలో బుజ్జగింపుల పర్వం

Submitted by arun on Thu, 11/08/2018 - 14:05

కాంగ్రెస్‌లో టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు, అసంతృప్తులను బుజ్జగించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. అసంతృప్తులను వార్ రూం సమావేశానికి ఆహ్వానించిన స్క్రీనింగ్ కమిటీ సభ్యులు నియోజకవర్గంలో పార్టీ పరిస్ధితి, సామాజిక సమీకరణాలను వివరిస్తూ బుజ్జగిస్తున్నారు. రాష్ట్రంలో 2004 తరహా పరిస్ధితులు ఉన్నాయని  నాటి తరహాలోనే ఇప్పుడు కూడా పొత్తులతో ఎన్నికలకు వెళుతున్నందున అంతా సహకరించాలంటూ కోరుతున్నారు. టికెట్ ఎవరికి ఇచ్చినా అంతా సహకరించాలని కోరుతున్న నేతలు అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే, కార్పోరేషన్ పదవులు ఇస్తామంటూ నచ్చజెబుతున్నారు.

కాంగ్రెస్ సీనియర్‌ నేతలకు అధిష్టానం నుంచి పిలుపు

Submitted by arun on Thu, 11/08/2018 - 12:11

అనుకున్న సమయానికి కాంగ్రెస్ తుది జాబితాను విడుదల చేయాలని భావిస్తున్న స్క్రీనింగ్ కమిటీ కసరత్తు ముమ్మరం చేసింది. వరుసగా రెండు రోజుల నుంచి సమావేశమవుతున్న కమిటీ సభ్యులు నియోజకవర్గాల వారిగా సమీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 29 సీట్లు మిత్రపక్షాలకు కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం. మిగిలిన 90 నియోజకవర్గాలకు గాను 57 చోట్ల ఎలాంటి ఇబ్బందులు లేవని  తుది జాబితాలోని అభ్యర్ధులకు వ్యతిరేకంగా ఎవరూ లేరంటూ నిర్ధారణకు వచ్చారు

ఢిల్లీలో బిజీబిజీగా కాంగ్రెస్ రాజకీయాలు

Submitted by arun on Thu, 11/08/2018 - 12:05

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బిజీబిజీగా మారారు. టికెట్లు దక్కుతాయని భావిస్తున్న సీనియర్ నేతలు, తమ వర్గం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వరుసగా మూడో రోజు సమావేశమయిన స్క్రీనింగ్ కమిటీ ఈ రోజు సాయంత్రానికి తుది జాబితాను ఖరారు చేస్తామని చెబుతోంది. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 29 సీట్లు మిత్రపక్షాలకు కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం. మిగిలిన 90 నియోజకవర్గాలకు గాను 57 చోట్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేశారు. 57 స్థానాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభ్యర్థులను ఎంపిక చేసిన స్క్రీనింగ్ కమిటీ 20 చోట్ల ఇద్దరి కంటే ఎక్కువగా పోటీ ఉండడంతో వడపోత కష్టంగా మారింది.

ఏకాభిప్రాయం కుదరని సీట్లపై కొనసాగుతున్న చర్చలు

Submitted by arun on Thu, 11/08/2018 - 11:02

కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. గత రెండు రోజులుగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తోన్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఎటూ తేల్చలేకపోయింది. దాదాపు 20 అసెంబ్లీ స్ధానాల విషయంలో అభ్యర్ధుల పేర్లను సీనియర్‌ నేతలు పోటాపోటీగా ప్రతిపాదిస్తుండటంతో అభ్యర్ధుల ఎంపికలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ సోనియా నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. సోనియాతో భేటీ తర్వాత రేపు అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అసంతృప్త నేతలను బుజ్జగించడంతో ఈ ప్రక్రియ తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. 

మహిళను కత్తితో బెదిరించి...

Submitted by arun on Sat, 11/03/2018 - 12:20

దేశ రాజధాని ఢిల్లీలో చైన్‌స్నాచర్స్‌ రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను బెదిరించి బంగారు ఆభరణాలను అపహరిస్తున్నారు. ఢిల్లీలోని దయాల్‌పుర్‌ ప్రాంతంలో ఓ బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు దుండగులు రోడ్డుపై వెళ్తున్న ఓ మ‌హిళ నుంచి బంగారు గొలుసును కాజేశారు. త‌న కొడుకుతో క‌లిసి రోడ్డుపై వెళ్తున్న ఆమెను బైక్ మీద వ‌చ్చిన చైన్ స్నాచ‌ర్స్ ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కునే ప్రయత్నం చేశారు. మెడలో నుంచి గొలుసు రాకపోవడంతో బైక్‌ నుంచి కిందికి దిగి క‌త్తితో బెదిరించి లాక్కెళ్లారు. ఈ ఘ‌ట‌న మొత్తం సీసీటీవీలో రికార్డయింది. ఆ ఇద్ద‌ర్నీ పోలీసులు అరెస్టు చేశారు.

రాహుల్‌తో చంద్రబాబు భేటీ

Submitted by arun on Thu, 11/01/2018 - 16:26

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటుపై వివిధ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే ఎన్సీపీ నేత శరద్‌పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ అజాద్‌తో భేటీ అయిన చంద్రబాబు కొద్ది సేపటి క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లారు. మోడీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఆయన రాహుల్‌తో చర్చలు జరుపుతున్నారు. అనంతరం ఆయన సీతారాం ఏచూరి, ములాయంసింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, తేజశ్వితో భేటీ అయ్యే అవకాశం కనిప్తోంది.