ruling-trs-in-telangana-discussed-pre-polls-decision-not-taken

సెప్టెంబరు 6వ తేదీన కేసీఆర్ సంచలన ప్రకటన..

Submitted by nanireddy on Mon, 09/03/2018 - 11:27

నిన్న(ఆదివారం) కొంగరకలాన్‌లో టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా  నిర్వహించతలపెట్టిన ప్రగతి నివేదన సభ విజయవంతమైంది. సభకు చీమల దండులా జనం పోటెత్తారు. దీంతో టీఆరెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ సభలో 49 నిమిషాల పాటుగా ప్రసంగించారు సీఎం కేసీఆర్‌. తన ప్రసంగంలో అనేక విషయాలు ప్రస్తావించారు. అందరూ ఊహించినదాని కంటే భిన్నంగా సీఎం ప్రసంగం సాగింది. ముందస్తు ఆలోచనపై ఆచి తూచి మాట్లాడిన కేసీఆర్‌ తన మనసులో మాటను ఎక్కడా బయటపెట్టలేదు. కానీ, కేసీఆర్‌ మాట్లాడిన తీరు ముందస్తుపై రకరకాల ఊహాగానాలకు తెరతీసింది. భవిశ్యత్ లో ముందస్తుపై నిర్ణయం తీసుకుంటామన్న కేసీఆర్. సెప్టెంబర్ ఆరోతేదీన సభను రద్దు చేసే అవకాశముంది.