lovers-suicide-attempt-rajampet-kadapa-district

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రాణాలతో పోరాడుతున్న ప్రియురాలు

Submitted by nanireddy on Sun, 09/02/2018 - 20:29

కడప జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది.  కుటుంబసభ్యులు తమ పెళ్ళికి ఒప్పుకోలేదన్న కారణంగా రైలు కింద పడ్డారు. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా. ప్రియురాలు ప్రాణాలతో పోరాడుతోంది. కడపకు చెందిన ఖాసింబీ, విజయవాడకు చెందిన సిద్దయ్య కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఇరుకుటుంబాల పెద్దలకు తెలిసి మందలించారు. ఈ క్రమంలో పెళ్ళికి కూడా నిరాకరించారు. దాంతో మనస్థాపం చెందిన సిద్దయ్య , ఖాసింబీ.. రాజంపేట రైల్వే స్టేషన్ స్సమీపంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ సిద్దయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. గాయపడిన ఖాసింబీని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.