woman-kills-ex-boy-friend-and-dumps-body-yamuna

మాజీ ప్రియుడిని నదిలో తోసేసిన మహిళ..

Submitted by nanireddy on Sun, 09/02/2018 - 18:50

మాజీ ప్రియుడు తన న్యూడ్ ఫోటోలను సామజిక మధ్యమాల్లో పెడతానని బెదిరించడంతో అతన్ని నదిలోకి నెట్టి ప్రాణాలు తీసిందో మహిళ. ఈ ఘటన గ్రేటర్‌ నోయిడాలో జరిగింది. నొయిడాకు చెందిన డాలీ చౌదరీ(21), సుశీల్‌ కుమార్‌(23)లు కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే కొంతకాలం క్రితం వారిద్దరికీ మనస్పర్థలు వచ్చాయి. దాంతో వారిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో మోహిత్‌ మావి(28) అనే వ్యక్తితో గ్రేటర్‌ నోయిడాలో డాలీ చౌదరీ సహజీవనం చేస్తోంది. అయితే తన భర్త డాలీ చౌదరీతో సహజీవనం చేస్తున్నాడని తెలిసి మోహిత్‌ భార్య ఆగస్టు 7న ఆత్మహత్య చేసుకుంది. దాంతో భార్య తరపు బంధువులు ఏమైనా చేస్తారేమోనన్న భయంతో మోహిత్‌ బెంగుళూరుకు పారిపోయాడు.