pawankalyan

పెళ్లి త‌ర్వాత కూడా ఆయనతో ట‌చ్‌లోనే ఉంటాను: రేణూ దేశాయ్‌

Submitted by arun on Thu, 06/28/2018 - 16:56

త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తితో త్వ‌ర‌లోనే ఏడ‌డుగులు వేయ‌బోతున్న న‌టి రేణూదేశాయ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో ముచ్చ‌టించారు. అభిమానుల బెదిరింపులు, విమ‌ర్శ‌ల‌కు దూరంగా ఉండాల‌నే ఉద్దేశంతో ఇటీవ‌లె రేణు ట్విటర్ నుంచి నిష్క్ర‌మించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మాత్రం అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు. తాజాగా లైవ్‌లోకి వ‌చ్చిన రేణు ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల గురించి మాట్లాడారు. అయితే ఓ అభిమాని పెళ్లి తర్వాత కూడా మీరు పవన్ తో టచ్ లో ఉంటారా అని ప్రశ్నించాడు. దీనికి మరో మాట ఆలోచించకూడా తప్పక ఉంటానని చెప్పింది. ఆయన అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలకి తండ్రి.

మేం గెలుపొందే మొట్టమొదటి సీటు అదే....

Submitted by arun on Sat, 06/09/2018 - 11:57

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన పార్టీ గెలుపొందే మొట్టమొదటి సీటు పాయకరావుపేటేనని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 2014 ఎన్నికల్లోనే పాయకరావుపేట నుంచి పోటీ చేయాలనుకున్నా టీడీపీకి మద్దతు ఇవ్వడంతో మిన్నకుండిపోయామన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని పవన్‌ జోస్యం చెప్పారు. శుక్రవారం ఆ ప్రాంతంలో పర్యటించిన పవన్, ఫ్లెక్సీలు కడుతూ ఇటీవల చనిపోయిన శివ-నాగరాజు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ర్యాలీలో ఆవేశంగా ప్రసంగించాడు. ఇంతకీ.. పాయకరావుపేట జనసేన అభ్యర్థి ఎవరు? అన్న క్లారిటీ అయితే లేదు. ఫలానా వ్యక్తికి టిక్కెట్ ఇస్తున్నానన్న స్పష్టత ఇవ్వకుండానే ప్రసంగాన్ని ముగించారు పవన్.

పవన్ దీక్షలో బీజేపీ ఎమ్మెల్యే భార్య !

Submitted by arun on Mon, 05/28/2018 - 11:31

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని నిరసిస్తూ పవన్ తన బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చి మరీ  ఒక్కరోజు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న దీక్షకు సంఘీభావంగా జనసేన కార్యకర్తలు సైతం ఆయా ప్రాంతాల్లో ఒక్క రోజు దీక్ష చేపట్టారు. అయితే రాజమండ్రిలో జనసేన ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య ఆకుల లక్ష్మీ పద్మావతి పాల్గొనడం ఆసక్తిని రేపుతుంది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ భార్య ఆకుల లక్ష్మీపద్మావతి.. పవన్ కళ్యాణ్ కి సంపూర్ణ మద్దతు పలికారు. ఉద్దానం బాధితుల కోసం పవన్ చేసిన దీక్షకు సంఘీభావంగా ఆమె కూడా ఒకరోజు దీక్ష చేశారు.

‘బట్టలు విప్పి మాట్లాడుకుందాం’..సంచలన ట్వీట్స్‌తో బెంబేలెత్తిస్తున్న పవన్

Submitted by arun on Sat, 04/21/2018 - 11:35

టాలీవుడ్‌లో ట్వీట్‌ల సెగను మరోసారి రాజేశారు జనసేనాని. శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మ వివాదంలో తనను లాగడం వెనక పెద్ద కుట్ర ఉందని ఆరోపించిన పవన్ .. దీనికి సంబంధించి పలు ట్వీట్‌లు చేశారు.  ఇది అనుకోకుండా జరిగిన వ్యవహారం కాదని  పక్కా ప్లాన్ ద్వారా ముందే రచించిన స్క్రిప్ట్  ప్రకారం జరిగిన వ్యవహారమంటూ ట్వీట్ చేశారు. మొత్తం ఎపిసోడ్‌లో కనబడుతున్న పాత్రధారుల కంటే వెనకున్న బడాబాబులే కీలకపాత్ర పోషించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ట్వీట్లతో  పవన్ కల్యాణ్ బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పటి వరకూ పవన్ ఏ విషయంపైనా స్పందించడం లేదని బాధ పడుతున్న ఫ్యాన్స్‌కు తన ట్వీట్స్‌తో ఉత్సాహం నింపుతున్నారు.

పవన్ మ్యాటర్ డిఫరెంట్.. నా గురించి మాట్లాడితే తాట తీస్తా: శ్రీరెడ్డి

Submitted by arun on Sat, 04/21/2018 - 11:09

పవన్ పై శ్రీరెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. పవన్ ను తిట్టమని శ్రీరెడ్డికి తానే సలహా ఇచ్చానని వర్మ స్వయంగా స్టేట్ మెంట్ ఇవ్వడం....దానిపై పవన్ ఈ రోజు తీవ్రస్థాయిలో రియాక్ట్ కావడం వంటి పరిణామాల గురించి విదితమే. అయితే తనకు సంబంధించిన అంశంపై ఇంత జరుగుతోన్నప్పటికీ...శ్రీరెడ్డి పెదవి విప్పలదు. దాదాపు 20 గంటల నుంచి ఇటు ఫేస్ బుక్ లో కానీ అటు మీడియా చానెళ్లతో కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాజాగా శ్రీరెడ్డి తన మౌన ముద్రను వీడింది. తన ఫేస్ బుక్ ఖాతాలో  వరుస పోస్టులతో విరుచుకుపడింది. పవన్ కల్యాణ్ మ్యాటర్ డిఫరెంట్ అని..

పవన్ కల్యాణ్ కు మళ్లీ కౌంటర్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

Submitted by arun on Fri, 04/20/2018 - 16:47

పవన్‌ కల్యాణ్‌ ట్వీట్లకు దర్శకుడు వర్మ కౌంటర్‌ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ గారిని నెగటివ్‌గా కామెంట్‌ చేయనని మా మదర్‌ మీద ఒట్టేశాను. కానీ ఆయన పెట్టిన ట్వీట్ల మూలాన ఇక్కడ నేను నెగటివ్‌గా కాకుండా లాజికల్‌గా సమాధానాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ప్రసిద్ద రచయిత ఆగథా క్రిష్టీ నవలల్లో కూడా ఇంత క్లిష్టమైన థియరీ చదవలేదని రాంగోపాల్‌ వర్మ ట్వీట్ చేశారు. ఇంత అర్జెంట్‌గా మీటింగ్‌ పెట్టడానికి కారణం చంద్రబాబు చేపట్టిన స్పెషల్ స్టేటస్‌ దీక్షను డైవర్ట్ చేయడానికి, భరత్ అను నేను సినిమా కలెక్షన్లు తగ్గించడానికేనని అనగలను కానీ అనను. 

ఎర్రటి ఎండలో ఎర్ర కండువా కట్టిన జనసేనాని

Submitted by arun on Fri, 04/06/2018 - 16:39

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మరోసారి జనం మధ్యకొచ్చారు. తలపై ఎర్రటి కండువా కట్టుకుని ఎర్రటి ఎండలో మూడు కిలోమీటర్లు నడిచారు. వామపక్షాలతో కలిసి పవన్‌ చేపట్టిన ఈ పాదయాత్రలో జనసేన, సీపీఎం, సీపీఐ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నమ్మకం ద్రోహం చేశాయన్న పవన్ త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.

పవన్-లెఫ్ట్...కీలక భేటీ

Submitted by arun on Tue, 04/03/2018 - 17:07

ప్రత్యేకహోదాపై పోరాటానికి సిద్ధమవుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు లెఫ్ట్ పార్టీ నేతలతో కీలక సమావేశం జరపనున్నారు. హోదా సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై విజయవాడలోని తన పార్టీ కార్యాలయంలో చర్చించనున్నారు. విభజన హామీలపై వామపక్ష నేతలతో చర్చించిన అనంతరం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. 

మా బాబు బంగారం

Submitted by lakshman on Thu, 03/29/2018 - 05:11

న‌టుడు శివాజీ ఏపీ ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేసేందుకు ప‌లు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కేంద్రం ఏపీ పై ఆప‌రేష‌న్ గ‌రుడ తో టార్గెట్ చేసింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఏపీ ప్ర‌జ‌ల‌కోసం ఏడాదిగా డేటాను సేక‌రించిన‌ట్లు, ఆ డేటా ఆధారంగా ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్త‌మ‌వ్వాల‌ని సూచించిన‌ట్లు చెప్పుకొచ్చారు.