Kaushal Army

కౌశల్ ఆర్మీపై బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 08/31/2018 - 16:09

బిగ్ బాస్2 ఎంత రసవత్తరంగా సాగుతుందో అదేస్థాయిలో వివాదాలు కూడా మొదలవుతున్నాయి. కౌశల్ కు బయట కౌశల్ ఆర్మీ పేరుతో పెద్ద ఎత్తున మద్దత్తు లభిస్తోంది. దీనిపై బాబు గోగినేని తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. బిగ్ బాస్ జరుగుతున్న విధానంపై, కౌశలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించే విధంగా ఉన్నాయి. బిగ్ బాస్ లో కౌశల్ హాట్ ఫెవరెట్ గా కొనసాగుతున్నాడు. కౌశల్ ఫైనల్ చేరడం ఖాయం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఆర్మీ గురించి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆర్మీ... కౌశల్ పాపులారిటీతో పుట్టింది కాదని వ్యాఖ్యానించారు.