kamineni hospital

హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీ.. ఆ నలుగురినీ ఉద్యోగం నుంచి తొలగించిన కామినేని ఆసుపత్రి

Submitted by arun on Sat, 09/01/2018 - 10:14

నల్గొండ జిల్లాలోని కామినేని ఆస్పత్రిలో జరిగిన వ్యవహారంపై యాజమాన్యం స్పందించింది. తీవ్రంగా గాయపడిన నందమూరి హరికృష్ణతో సెల్ఫీలు దిగిన ఆస్పత్రి సిబ్బందిని సస్పెండ్ చేసింది. రెండురోజుల క్రితం రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణను కామినేని ఆస్పత్రికి తరలించినప్పుడు నలుగురు సిబ్బంది సెల్ఫీలు దిగారు. విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో యాజమాన్యం స్పందించి వారిపై వేటు వేసింది. మరోమారు ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీ...స్పందించిన యాజమాన్యం

Submitted by arun on Fri, 08/31/2018 - 16:56

నటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం సంభవించిన సమయంలో ఆయన్ని నార్కట్‌పల్లి కామెనేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అయితే అక్కడ పనిచేసి సిబ్బంది హరికృష్ణ పార్దీవదేహంతో  సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా సోషల్‌మీడియాలో షేర్‌ చేసి రాక్షసానందం పొందారు. హరికృష్ణ మృతదేహంతో ఇద్దరు డ్యూటీ నర్సులు, ఒక వార్డు బాయ్, మరో వార్డ్ గర్ల్ కలిసి స్మైలీతో సెల్ఫీ దిగటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హరికృష్ణ మృతదేహంతో ఆస్పత్రి సిబ్బంది సెల్ఫీ

Submitted by arun on Fri, 08/31/2018 - 14:43

సెల్ఫీ పిచ్చి సమాజంలో పడిపోతున్న మానవ విలువలకు అద్దం పడుతోంది. సందర్భంతో పని లేకుండా, మానవత్వం మరిచిపోయి సెల్ఫీల మత్తులో మునిగిపోతున్నారు కొందరు. ఈ పిచ్చితోనే కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండగా, మరికొందరు సెల్ఫీలతో వికృత ఆనందం పొందుతున్నారు. తాజాగా, నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురికావడం, నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో కన్నుమూయడం తెలిసింది. అయితే, ఈ ఘటనలో ఇప్పుడు బయటకు వచ్చిన ఓ సెల్ఫీ ఫోటో సభ్యసమాజానికి సిగ్గు చేటుగా అనిపిస్తోంది. హైదరాబాద్ కామినేని ఆస్పత్రిలో హరికృష్ణ మృతదేహం వద్ద కొందరు ఆస్పత్రి సిబ్బంది మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నారంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.