Alizé Cornet

యూఎస్ ఓపెన్ కోర్టులోనే బట్టలు మార్చుకున్న అలైజ్ కార్నెట్!

Submitted by arun on Fri, 08/31/2018 - 11:12

యూఎస్‌ ఓపెన్‌లో ఫ్రాన్స్‌ క్రీడాకారిణి అలిజె కార్నెట్‌ అనుకోకుండా చేసిన ఓ పని వివాదాస్పదమైంది. ఫ్రెంచ్ క్రీడాకారిణి అలైజ్ కార్నెట్, మైదానంలో తన బట్టలు మార్చుకోవడం, లోదుస్తులు పైకి కనిపించడంతో చైర్ అంపైర్ తప్పుబట్టడంపై ఇప్పుడు పెను దుమారం చెలరేగుతోంది. డబ్ల్యూటీఏ నిబంధనల ప్రకారం, మహిళలు కోర్టులో దుస్తులు మార్చుకునేందుకు వీలు లేదు. పురుషులకు ఆ నిబంధన ఏమీ లేదు. తాజాగా, కార్నెట్ వ్యవహారం మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తేగా, పురుషులకు అడ్డురాని నిబంధనలు మహిళల విషయంలో ఎందుకని మాజీలు ప్రశ్నిస్తున్నారు.