congress

ఈసీ నిర్ణయంపై టీ కాంగ్రెస్ ఆగ్రహం

Submitted by arun on Mon, 09/10/2018 - 10:30

తెలంగాణ శాసన సభ రద్దు తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అక్టోబరు రెండో వారం తర్వాత ఎప్పుడైనా తెలంగాణలో ఎన్నికలు జరిపేందుకు ఈసీ సన్నాహాలు వేగవంతం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం 2018 ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కుదించడంపై కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ఱయించింది.

Tags

కేసీఆర్‌కు జానారెడ్డి సవాల్...ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం...

Submitted by arun on Sat, 09/08/2018 - 11:59

టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్‌ సినీయర్‌ నేత జానారెడ్డి ఫైరయ్యారు. రైతులకు 24గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తే గులాబీ జెండా పట్టుకుంటానని తాను చెప్పలేదని, కావాలంటే రికార్డులు పరిశీలించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. తాను టీఆర్‌ఎస్‌ జెండా పట్టుకుంటానని ఎప్పుడు చెప్పలేదని స్పష్టం చేశారు. నిజంగా ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి అబద్దాలు ఎలా చెబుతారని నిలదీశారు. ఇష్టానుసారంగా  మాట్లాడుతున్న కేసీఆర్‌ ఆత్మ విమర్శన చేసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘అందుకే సురేశ్‌ రెడ్డి పార్టీ వీడారు’

Submitted by arun on Sat, 09/08/2018 - 10:06

మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి వెళ్తే తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు మధుయాష్కి తెలిపారు. సిట్టింగ్ స్పీకర్‌గా ఉండి కూడా తర్వాతి ఎన్నికల్లో గెలవలేని వ్యక్తిని టీఆర్ఎస్‌ స్వాగతించిందంటే ఆ పార్టీ గెలుపోటములు సూచిస్తున్నాయని.. మదుయాష్కి ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే సురేశ్‌ రెడ్డి పార్టీ ఎందుకు మారాల్సి వచ‍్చిందో మధుయాష్కీ స్పష్టం చేశారు. సురేష్‌ రెడ్డికి టికెట్‌ ఇ‍వ్వకూడదని ఆలోచిస్తున్నామని, అందుకే ఆయన పార్టీ మారాడన్నారు.  మురికి నీరు కొట్టుకుపోతే, కొత్త నీరు వస్తుందంటూ సురేష్‌ రెడ్డి పార్టీ మారడాన్ని ఎద్దేవా చేశారు.

కౌంటర్‌ ఆపరేషన్‌కు దిగిన కాంగ్రెస్‌...కాంగ్రెస్‌లోకి డీఎస్‌, కొండా సురేఖ‌, బాబు మోహన్‌?

Submitted by arun on Sat, 09/08/2018 - 09:25

తెలంగాణలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ జోరందుకుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్‌ రెండో దశ ఆపరేషన్‌ మొదలు పెట్టగా కాంగ్రెస్‌ కౌంటర్‌ ఆపరేషన్‌కు దిగింది. టీఆర్ఎస్‌లో అసంతృప్తులకు కాంగ్రెస్‌ గాలం వేస్తోంది. ఈ నెల 12న కాంగ్రెస్‌లోకి భారీగా వలసలుంటాయని టీ.కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీఎస్‌తో పాటు కొండా సురేఖ దంపతులు, నందీశ్వర్‌గౌడ్‌, టీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్‌ రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. 

Tags

12న కాంగ్రెస్ లోకి కొండా సురేఖ...మధ్యాహ్నం టీఆర్ఎస్ కు రాజీనామా చేసే అవకాశం

Submitted by arun on Sat, 09/08/2018 - 08:53

కొండా దంపతుల రాజకీయ భవిష్యత్‌పై మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. కేసీఆర్ ప్రకటించిన లిస్ట్‌లో కొండాసురేఖ లేకపోవడం హాట్ టాపిక్ అయింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన కొండా సురేఖ విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అసలేం జరుగుతోంది.? ఎవరికి టికెట్ ఇస్తారన్న దానిపై ఓరుగల్లులో చర్చనీయాంశమైంది. ఇంతకూ కొండా పరిస్థితేంటి.. కేసీఆర్ నిర్ణయం వెనక జరిగిందేమిటి.? ఇప్పుడు కొండా దంపతుల దారెటు.? 

కీలక కాంగ్రెస్‌ నాయకులపై గులాబీ అభ్యర్థులు

Submitted by arun on Fri, 09/07/2018 - 09:48

తెలంగాణ రాజకీయాల్లో ఉద్దండ విపక్ష నాయకులపై, గులాబీదళాధిపతి పోటీగా ఎవరిని నిలబెట్టారు...కీలక నేతలను ఓడించడానికి బరిలోకి దింపిన అభ్యర్థులెవరు?

Tags

పొత్తులపై ఇప్పటి వరకు చర్చ జరగలేదన్న ఉత్తమ్

Submitted by arun on Thu, 09/06/2018 - 09:25

ఇవాళ శాసన సభ రద్దవుతుందన్న అంచనాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అలెర్ట్ అయ్యారు. ఇప్పటికే ఏకంగా ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించిన టీ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలు, గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కువ సీట్లు గెలవడంతో పటు సోనియా టూర్ వంటి అంశాలపై కసరత్తు చేస్తోంది. అంతేకాదు ఇక శాసనసభ రద్దయిన కొద్ది సేపట్లోనే అత్యవసర మీటింగ్ కి టీపీసీసీ పిలుపునిచ్చింది. సీనియర్  నేతలంతా అందుబాటులో ఉండాంటూ టీపీసీసీ కోరింది.  

2019 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన టీ కాంగ్రెస్

Submitted by arun on Wed, 09/05/2018 - 15:52

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.... టీకాంగ్రెస్‌ మేనిఫెస్టో అంశాలను ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలను వివరించారు. ముఖ్యంగా హౌసింగ్‌ స్కీమ్‌‌కి అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్న ఉత్తమ్‌ ఇంటి నిర్మాణానికి 5లక్షల రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించారు. అదే ఎస్సీఎస్టీలకైతే 6లక్షలు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్‌ బిల్లులు క్లియర్ చేస్తామన్న ఉత్తమ్‌ ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నవారికి మరమ్మతుల కోసం 3లక్షల రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించారు. అన్ని రకాల పెన్షన్లు రెట్టింపు చేస్తామని ఉత్తమ్‌ ప్రకటించారు.

సొంత గూటికి డీఎస్...ఈనెల 11న...

Submitted by arun on Wed, 09/05/2018 - 11:24

బహిరంగ లేఖతో  టీఆర్ఎస్ అధిష్టానానికి సవాల్ విసిరిన రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ నేతలతో  మంతనాలు జరుపుతున్నట్టు ఊహగానాలు వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం మానససరోవర్ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ..  ఈ నెల 11న తిరిగి రానున్నారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు సమాచారం.  ఇదే సమయంలో టీఆర్ఎస్‌లో తనకు అవమానం జరిగిందని భావిస్తున్న డీఎస్ ... తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసిన తరువాత ప్రెస్‌ మీట్‌ నిర్వహించాలని భావిస్తున్నారు.  డీఎస్‌ రాకను సీనియర్లతో పాటు జిల్లా నేతలు కూడా స్వాగతిస్తున్నట్టు సమాచారం. 
 

చేయి జారుతుంది...చంద్రబాబును కలిసిన...

Submitted by arun on Sat, 09/01/2018 - 11:05

కేంద్రంలో అధికారంలోకొస్తే ప్రత్యేక హోదా ఇస్తామంటున్న కాంగ్రెస్‌ ఏపీలో ఎలాంటి పరిస్థితిలో ఉంది..? పునర్‌ వైభవం కోసం పాకులాడుతున్న ఆ పార్టీ అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తోందా..? ఎన్నికల నాటికి రేసులో ఉండాలనుకున్న హస్తం పార్టీ ప్రధాన పార్టీలకు కనీసం పోటీ అయినా ఇస్తుందా..? త్వరలోనే భారీగా వలసలు ఉంటాయంటున్న ఆ పార్టీ నుంచి జారిపోతున్నవారిని నిలువరిస్తుందా..? 

Tags