congress

తెలంగాణకు అడ్డుపడ్డ రెండు గడ్డాలు ఒక్కటవుతున్నాయి; కేటీఆర్

Submitted by arun on Thu, 09/13/2018 - 10:08

ఎన్నికల వేళ వలసలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్‌ సీనియర్ నేత సురేష్‌ రెడ్డి హస్తం వీడి, కారెక్కగా, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ సహా పలువురు నాయకులు హస్తం గూటికి చేరారు. సురేష్ రెడ్డి చేరిక సమయంలో, కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌ కాకరేపుతున్నాయి.

తెలంగాణలో కూడుకుంటున్న మహాకూటమి

Submitted by santosh on Wed, 09/12/2018 - 12:30

మహాకూటమి కోసం ఇంతవరకూ రహస్యంగా, వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు తొలిసారి కలిసికట్టుగా కన్పించాయి. హైదరాబాద్  పార్క్ హయత్ లో సమావేశమైన మూడు పార్టీల ముఖ్య నేతలు, మహాకూటమి దిశగా తొలి అడుగు వేశారు. ఇది కేవలం ప్రాథమిక సమావేశమేనని, మరిన్ని భేటీలు నిర్వహిస్తామని చెప్పారు. పొత్తులు-సీట్ల పంపకాలపై మరింతగా చర్చించాల్సి ఉందన్నారు. టీఆర్ఎస్ ను గద్దెదించాలంటే, అన్ని పార్టీలూ కలిసిరావాలని భావిస్తున్నామన్నారు టీపీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్ . రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి.

టీడీపీతో పొత్తుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Wed, 09/12/2018 - 11:32

టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు వద్దే వద్దన్నారు. తొలి నుంచి టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తున్న ఆమె.. మరింత ఘాటుగా స్పందించారు. టీడీపీతో పొత్తు కాంగ్రెస్‌కు అవసరమా ? కాదా అన్న విషయాన్ని అధిష్టానం మరోమారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆ పార్టీతో పొత్తుపై తెలంగాణ ప్రజల్లో అభ్యంతరం ఉందన్నారు. ఈ నెల 15 తర్వాత నుంచి రాజకీయాల్లో మళ్లీ చురుకైన పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు.  

గులాబీ గూటికి ‘బండారి’!

Submitted by arun on Tue, 09/11/2018 - 11:41

హైదరాబాద్ ఉప్పల్‌ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ చార్జి బండారి లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్‌ లో చేరాలని నిర్ణయించారు. ఉప్పల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైన అనంతరం బండారి లక్ష్మారెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించారు. టీడీపీతో అంటగాకి కాంగ్రెస్ రాష్ట్రానికి ద్రోహం చేస్తుందని ఆయన తెలిపారు.. అందుకే టీఆర్ఎస్ లో చేరనున్నట్టు ప్రకటించారు. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ముందస్తు ఎన్నికలవేళ తెలంగాణ కాంగ్రెస్‌‌కు భారీ షాక్‌....

Submitted by arun on Tue, 09/11/2018 - 09:02

ముందస్తు ఎన్నికలవేళ తెలంగాణ కాంగ్రెస్‌‌కు భారీ షాక్‌ తగిలింది. టీకాంగ్రెస్‌ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని హైదరాబాద్‌ నార్త్‌ జోన్‌ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలతో పాస్‌పోర్టు, వీసా తీసుకున్న కేసులో జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 13ఏళ్ల క్రితం నమోదైన కేసులో కీలక సమాచారం సేకరించిన పోలీసులు అర్ధరాత్రి పటాన్‌‍చెరు దగ్గర అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ ఆఫీస్‌కు తరలించినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం జగ్గారెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

పార్టీ వీడడంపై క్లారిటీ ఇచ్చిన దానం

Submitted by arun on Mon, 09/10/2018 - 14:43

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్నవార్తల్నిదానం నాగేందర్ ఖండించారు. తను ఏ హోటల్‌లో ఉత్తమ్‌ను కలువలేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు టిక్కెట్లు దొరక్క తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాట్సప్ మెసేజ్‌లు చూసి ఎమోషనల్ అయ్యే నేతను కానని అన్నారు. కెసిఆర్ తనకు ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తానని దానం తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండానే టీఆర్‌ఎస్ పార్టీలో చేరా. 105 మంది జాబితాలో నా పేరు లేకపోవడం పట్ల నాకుఎలాంటి బాధలేదు. ఇష్టం ఉన్నవారికే సీటు ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధిష్టానానికి చెప్పా. కాంగ్రెస్ పార్టీలో వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి ఆటలో కాయిన్‌లా తయారైంది.

కాంగ్రెస్ వినూత్న నిరసన...దెయ్యాల గెటప్‌లు వేసి....

Submitted by arun on Mon, 09/10/2018 - 14:18

పెట్రో ధరల పెంపునకు నిరసనగా ఇవాళ భారత్‌ బంద్‌ జరుగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు నిర్వహిస్తున్న ఈ బంద్‌కు టీడీపీ, ఎన్సీపీ, డీఎంకే, ఎండీఎంకే, ఎస్పీతో పాటు వివిధ ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. భారత్‌ బంద్‌కు ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఛత్తీస్ ఘడ్ లోని రాయిపూర్ లో కాంగ్రెస్ వినూత్న నిరసన తెలిపింది. ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు దెయ్యాల గెటప్ లలో జనాలను కొరుక్కు తింటున్నట్లు నటించారు. అధిక ధరలతో మోడీ ప్రభుత్వం సామాన్యుల బతుకులను నాశనం చేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 

ఈసీ నిర్ణయంపై టీ కాంగ్రెస్ ఆగ్రహం

Submitted by arun on Mon, 09/10/2018 - 10:30

తెలంగాణ శాసన సభ రద్దు తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అక్టోబరు రెండో వారం తర్వాత ఎప్పుడైనా తెలంగాణలో ఎన్నికలు జరిపేందుకు ఈసీ సన్నాహాలు వేగవంతం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం 2018 ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కుదించడంపై కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ఱయించింది.

Tags

కేసీఆర్‌కు జానారెడ్డి సవాల్...ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం...

Submitted by arun on Sat, 09/08/2018 - 11:59

టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్‌ సినీయర్‌ నేత జానారెడ్డి ఫైరయ్యారు. రైతులకు 24గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తే గులాబీ జెండా పట్టుకుంటానని తాను చెప్పలేదని, కావాలంటే రికార్డులు పరిశీలించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. తాను టీఆర్‌ఎస్‌ జెండా పట్టుకుంటానని ఎప్పుడు చెప్పలేదని స్పష్టం చేశారు. నిజంగా ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి అబద్దాలు ఎలా చెబుతారని నిలదీశారు. ఇష్టానుసారంగా  మాట్లాడుతున్న కేసీఆర్‌ ఆత్మ విమర్శన చేసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘అందుకే సురేశ్‌ రెడ్డి పార్టీ వీడారు’

Submitted by arun on Sat, 09/08/2018 - 10:06

మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి వెళ్తే తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు మధుయాష్కి తెలిపారు. సిట్టింగ్ స్పీకర్‌గా ఉండి కూడా తర్వాతి ఎన్నికల్లో గెలవలేని వ్యక్తిని టీఆర్ఎస్‌ స్వాగతించిందంటే ఆ పార్టీ గెలుపోటములు సూచిస్తున్నాయని.. మదుయాష్కి ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే సురేశ్‌ రెడ్డి పార్టీ ఎందుకు మారాల్సి వచ‍్చిందో మధుయాష్కీ స్పష్టం చేశారు. సురేష్‌ రెడ్డికి టికెట్‌ ఇ‍వ్వకూడదని ఆలోచిస్తున్నామని, అందుకే ఆయన పార్టీ మారాడన్నారు.  మురికి నీరు కొట్టుకుపోతే, కొత్త నీరు వస్తుందంటూ సురేష్‌ రెడ్డి పార్టీ మారడాన్ని ఎద్దేవా చేశారు.