congress

మజ్లిస్‌పై కృష్ణసాగర్‌ సంచలన వ్యాఖ్యలు

Submitted by chandram on Wed, 11/21/2018 - 15:17

ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను నిర్మల్‌ సభకు హాజరవకుండా ఉంటే పాతిక లక్షలు ఇస్తామన్న విషయంపై తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ రూ. 25 లక్షలు ఇవ్వజూపితే మరి టీఆర్ఎస్ నుంచి ఆయన ఎంత గుత్త మాట్లాడుకున్నాడో తెలియజేయాలని డిమాండ్ చేశారు.  

రాహుల్‌ గాంధీతో ముగిసిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భేటీ

Submitted by arun on Wed, 11/21/2018 - 12:50

ఎల్లుండి మేడ్చల్‌ లో నిర్వహించనున్న సభలో సోనియా, రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో కుంతియాతో కలిసి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయిన విశ్వేశ్వర్‌రెడ్డి తెలంగాణతో పాటు నియోజకవర్గంలోని సమస్యలన్నీ రాహుల్‌కు వివరించినట్లు వెల్లడించారు. పార్టీ పరమైన నిర్ణయాలు నచ్చకే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానన్న విశ్వేశ్వర్‌రెడ్డి రెండేళ్లుగా పార్టీలోనే ఉంటూ అంతర్గతంగా పోరాటం చేసినట్లు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. 

రేవంత్ రెడ్డికి మరో కీలక బాధ్యత అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్

Submitted by arun on Wed, 11/21/2018 - 10:18

కాంగ్రెస్ హై కమాండ్ రేవంత్ రెడ్డికి మరో కీలక బాధ్యత అప్పగించింది. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పగించిన అధిష్టానం ఇప్పుడు సోనియా సభ ఏర్పాట్ల బాధ్యతను రేవంత్ రెడ్డికి కట్టబెట్టింది. మేడ్చల్ లో జరిగే సోనియా సభ ఏర్పాట్లను పరిశీలించిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈ నెల 23న తెలంగాణకు రానున్నారు. మేడ్చల్‌లో కాంగ్రెస్ నిర్వహించే భారీ బహిరంగ సభలో సోనియా ప్రసంగించనున్నారు.

రెండు కాదు.. మూడు వికెట్లు: రేవంత్‌

Submitted by chandram on Tue, 11/20/2018 - 19:55

అధికార పార్టీ టీఆర్ఎస్ నుండి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ గూటికి రానున్నరని ఇటివల చేసిన ప్రకటన ఇప్పుడు చూస్తే అర్థంమైతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి పంగా నామాలు పెట్టి రాజీనామా లేఖ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పంపించారు. అయితే విశ్వేశ్వేర్ రెడ్డి రాజీనామాపై కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ త్వరలో ముచ్చటగా మరో ఇద్దరు రాజీనామా చేసే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి స్ఫష్టంచేశారు. వచ్చే నెల డిసెంబర్ 7లోపు రెండు వికెట్లు పడటం ఖాయామని చెప్పిను ఇప్పుడు మూడు వికెట్లు పడుతాయని తెలిపారు.

ఎన్నికల వేళ ఆడియో టేపులు కలకలం

Submitted by chandram on Tue, 11/20/2018 - 19:13

ఎన్నికల వేళ ఆడియో టేపులు కలకలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్, ఎం.ఐ.ఎం నేతల మధ్య సాగిన ఫోన్ సంభాషణలు హాట్ టాపిక్ గా మారాయి. నిర్మల్ లో ఎం.ఐ.ఎం సభ జరుగకుండా ఉండేందుకు కాంగ్రెస్ 25 లక్షలు ఆఫర్ చేసినట్లు ఆడియో టేపుల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని అసదుద్దీన్ సభలో బహిరంగ పరిచారు. నామినేషన్లు ముగిసి ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ రాజకీయ దుమారం రేగుతోంది. ఒక పార్టీపై మరో పార్టీ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. సోమవారం నిర్మల్ లో ఎం.ఐ.ఎం. బహిరంగ సభ నిర్వహించింది. అయితే ఈ సభకు ముఖ్యఅతిథిగా ఎం.ఐ.ఎం. అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు.

కేసీఆర్‌ సర్కార్‌పై సినీ నటి ఖుష్బూ విమర్శలు

Submitted by arun on Tue, 11/20/2018 - 17:41

టీఆర్ఎస్ పాలనంతా అక్రమాలపుట్టగా మారిందని సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ అన్నారు. అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ నాలుగున్నరేళ్ళకు కూడా మాట నిలబెట్టుకోలేదని తప్పు పట్టారు. కేసీఆర్‌కు అధికారం దక్కగానే ఆయనలో దుర్బుద్ధి ప్రారంభమై ఒక్క మంచి పనీ చేయలేదని తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీ భవన్‌‌కు వచ్చిన ఖుష్బూ అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ కుటుంబానికి తప్ప మరెవకీ మేలు జరగలేదని ఖుష్బూ విమర్శించారు. రూ.300 కోట్లతో ప్రగతిభవన్‌ కట్టుకున్న కేసీఆర్‌కు సొంత కారులేదట! అని ఖుష్బూ ఆశ్చర్యంవ్యక్తం చేశారు.

అసదుద్దీన్ ఆరోపణలపై స్పందించిన మహేశ్వర్‌రెడ్డి

Submitted by arun on Tue, 11/20/2018 - 16:32

నిర్మల్‌లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన‌ అరోపణలను డిసీసీ అధ్యక్షుడు మహెశ్వర్ రెడ్డి ఖండించారు. నిర్మల్  ఎన్నికల ప్రచారానికి రావద్దని ఇరవై ఐదు లక్షల రూపాయల ఆఫర్‌ చేశానని అసదుద్దీన్ చేసిన‌ వ్యాఖ్యలపై మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఆఫర్ చేసినట్లు ఆధారాలు బయట పెట్టాలని సవాల్ చేశారు‌. ఆరోపణలు నిజమైతే ఎన్నికల నుండి తప్పుకోవడమే కాదు, రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. అసదుద్దీన్ సభకు జనం రాకపోవడం వల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేశారని  విమర్శించారు. అసదుద్దీన్ స్థాయి రూ.25లక్షలు అని తాము భావించడం లేదని అన్నారు. అసద్‌కు డబ్బు ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.

హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్‌

Submitted by chandram on Tue, 11/20/2018 - 14:54

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉహించని షాక్ తగిలింది. టికెట్ దక్కలేదని నిరాశతో అధికార ప్రతినిధి తుమ్మేటి సమ్మిరెడ్డి, సీనియర్ నాయకుడు పరిపాటి రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గూలాబీ తీర్ధంపుచ్చుకున్నారు. ఈటల రాజేందర్ సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ పాడి కౌశిక్‌రెడ్డికి ఇవ్వడంతోనే అసంతృప్తితోనే తాము గూలాబీ తీర్ధం పుచ్చుకున్నామని నేతలు తెలిపారు.

కాంగ్రెస్‌పై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు...ఆ సభకు వెళ్లకుంటే రూ.25 లక్షలు...

Submitted by arun on Tue, 11/20/2018 - 13:41

ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్‌లో నిన్న అర్ధరాత్రి నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించిన ఒవైసీ కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను నిర్మల్‌ సభకు హాజరవకుండా ఉంటే పాతిక లక్షలు ఇస్తామని ఆఫర్‌ చేశారని చెప్పారు. దానికి సంబంధించిన ఫోన్‌ రికార్డులు కూడా తన దగ్గరున్నాయని వివరించారు. తనను ఎవరూ కొనలేరని మీరు కూడా మోసపోకండని చెప్పుకొచ్చారు. అందరూ స్వచ్ఛంధంగా టీఆర్ఎస్‌కు ఓటెయ్యాలంటూ అసదుద్దీన్‌ ఒవైసీ పిలుపునిచ్చారు. 

టీకాంగ్రెస్‌‌కు దడ పుట్టిస్తున్న రెబల్స్‌

Submitted by arun on Tue, 11/20/2018 - 11:13

నిన్నమొన్నటి వరకు మహా కూటమి సీట్ల సర్దుబాటుతో సతమతమైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త  తలనొప్పి వచ్చిపడింది. నామినేషన్ల గడువు ముగియడంతో పార్టీ రెబల్స్ బెడద ఆందోళన కల్గిస్తోంది. టిక్కెట్టు ఆశించి భంగపడ్డ నేతలు తిరుబాటు అభ్యర్దులుగా రంగంలోకి దిగడంతో వాళ్లందరినీ బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ.