congress

కుదేలైన కూటమి.. కకావికలం అయిన కాంగ్రెస్‌

Submitted by chandram on Tue, 12/11/2018 - 20:34

కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యమన్నారు ఆయన్ని ఫామ్‌ హౌజ్‌కే పరిమితం చేయడమే టార్గెట్‌ అన్నారు అందుకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధం అన్నారు. నాలుగు పార్టీలు కలిసి కూటమి కట్టారు. ముమ్మర ప్రచారం చేశారు కానీ ఫలితాల్లో ఆ కూటమి కుదేలయ్యింది. కనీసం చాలాచోట్ల పోటీ ఇవ్వలేక కకావికలం అయ్యింది. కారు జోరుకు కూటమి కూకటి వేళ్లతో సహా కూలిపోయింది. కూటమిలో పెద్దన్న పాత్ర పోషించిన కాంగ్రెస్‌ తిరుగులేని పరాజయం మూటగట్టుకుంది. కాంగ్రెస్‌, టీడీపీ, జనసమితి, సీపీఐ కలిసి ఏర్పడిన మహాకూటమికి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు. 80 కి పైగా స్థానాల్లో గెలుపు ఖాయం అనుకున్నా కనీసం ఆ దరిదాపుల్లోకి కూడా రాలేదు.

ఛత్తీస్ గఢ్ లో 15 ఏళ్ల తర్వాత హస్తం హవా

Submitted by chandram on Tue, 12/11/2018 - 20:24

వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు సన్నాహకంగా సెమీఫైనల్స్ పేరుతో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పుంజుకొంది. అధికార బీజెపీకి దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. కమలనాథులు అధికారంలో ఉన్న మూడురాష్ట్రాలలో పాగా వేసింది. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరుగులేని ఆధిక్యంతో అధికారాన్ని హస్తగతం చేసుకొంది.  దేశంలోని ఐదురాష్ట్రాల ఓటర్లతో పాటు కోట్లాదిమంది భారతీయులను గత కొద్దివారాలుగా కదిపి కుదిపేసిన ఎన్నికల ఫలితాలు విశ్లేషకులు ఊహించిన విధంగానే ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే వచ్చాయి.

అన్నలు వద్దట.. తమ్ముళ్లకే పట్టం కట్టిన ప్రజలు

Submitted by chandram on Tue, 12/11/2018 - 19:54

తెలంగాణ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి ఎంతమంది పోటీ చేసినా గెలుపు మాత్రం ఒకరికే కట్టబెడతామంటున్నారు తెలంగాణ ప్రజలు. ఒక్క కేసిఆర్ కుటుంబానికి మాత్రం ఈ రూల్ నుంచి మినహాయింపు ఉందని తేల్చారు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు బ్రహ్మరథం పట్టిన ఓటర్లు మిగిలిన నేతలకు మాత్రం గెలుపు ఒకరికేనని తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో ముగ్గురు అన్నదమ్ముల జంటలు పోటీ చేయగా అన్నలందరినీ ఓడించి తమ్ముళ్లను మాత్రం గెలిపించారు ఓటర్లు.

బండ్ల గణేష్ కనిపించటంలేదు! సోషల్ మీడియాలో ట్రోల్...

Submitted by chandram on Tue, 12/11/2018 - 16:49

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండ్ల గణేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ ఛానల్ ఇంటర్వులో మాట్లాడుతూ డిసెంబర్ 11 తేదినాడు మద్యాహ్నం రండి అని సవాల్ విసిరారు. మీడియా మిత్రులు బ్లేడులు, కత్తులు తీసుకురావాలని కోరారు. ఇక నేపథ్యంలో సోషల్ మీడియాలో బండ్ల గణేశ్ పై నెటిజన్లు ఓరేంజ్ ఆట ఆడుకుంటున్నారు. ఆరోజు సవాల్ విసిరిన బండ్ల గణేశ్ ఎక్కడ ఉన్నావ్ కత్తులు సిద్ధంగా ఉన్నాయ్ గొంతు కోసుకోవడానికి నువ్వు సిద్ధాంగా ఉన్నారా అని సెటైర్లతో సుక్కలు చూపిస్తారు నెటిజన్లు.

హంగ్ దిశగా మధ్యప్రదేశ్ !

Submitted by chandram on Tue, 12/11/2018 - 14:37

మధ్యప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలను చూస్తుంటే హంగ్ దిశగా పయనం చేస్తున్నాయి. అక్కడ బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ కు మధ్య ‍హోరాహోరా మధ్య తీవ్ర ఉత్కంఠత పోటీ సాగుతోంది. అక్కడి ఫలితాలను బట్టి తప్పకుండ హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. మధ్యప్రదేశ్ లో ఇద్దరు మంత్రులు వెనకంజలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ మాత్రం నెమ్మదిగా పుంజుకుంటున్నట్లు ఫలితాలు తెలుపుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కమల్ నాథ్ ఇంటి వద్ద సంబురాలు అంబరాన్ని అంటేలా టపాసులతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై ఉత్తమ్ అనుమానాలు

Submitted by arun on Tue, 12/11/2018 - 11:54

తెలంగాణ ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్‌ జరిగినట్లు టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఫలితాలను చూస్తే  టాంపరింగ్‌ చేసినట్లు అర్థం అవుతుందన్నారు. వీవీప్యాట్‌ల్లో స్లిప్‌లను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. కూటమి అభ్యర్థులంతా రిటర్నింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. వీవీప్యాట్‌లను లెక్కించే వరకు పట్టుబట్టాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. ఎవరు ఓడిపోతారో టీఆర్‌ఎస్‌ నేతలు ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇదంతా ట్యాంపరింగ్‌ను బలపరుస్తున్నాయని ఉత్తమ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.

జగిత్యాలలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఘోరపరాజయం!

Submitted by arun on Tue, 12/11/2018 - 10:19

జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి షాక్ తగిలింది. టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ ‌కుమార్‌ చేతిలో జీవన్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో జగిత్యాల మహాకూటమి అభ్యర్థి జీవన్ రెడ్డి టీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. టీఆర్ఎస్ నేత సంజయ్ చేతిలో 40,000 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. కాగా, ఫలితాలు వెలువడకముందే జీవన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెనుదిగిగారు.

నరాలు తెగే ఉత్కంఠకు తెరపడాలంటే...మరి కొన్ని గంటలు

Submitted by chandram on Mon, 12/10/2018 - 19:02

తెలంగాణ అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈనెల 11న 31 జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి వరుసగా నియోజకవర్గాల ఫలితాలు వెల్లడికానున్నాయి. మధ్నాహ్నం 2.15 గంటలకు అన్నింటి లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. మొదట్లో చార్మినార్ ఫలితం, చివర్లో యాకుత్ పుర ఫలితాలు రానున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ  ఓట్ల లెక్కింపుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈనెల 11న 31 జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం 44 కేంద్రాలను సిద్ధం చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన 44 లెక్కింపు కేంద్రాల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 13 ఉన్నాయి.

కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్ సంచలన ఆరోపణలు...తమ అభ్యర్ధులను అప్పుడే...

Submitted by arun on Mon, 12/10/2018 - 17:36

కౌంటింగ్‌కి ముందే తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనుండగా, అప్పుడే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. కౌంటింగ్‌కి ముందే కాంగ్రెస్‌ పార్టీ ప్రలోభాలకు తెరలేపిందంటూ టీఆర్‌ఎస్‌ సంచలన ఆరోపణలు చేసింది. ‎ఓడిపోతామని ముందే పసిగట్టిన కాంగ్రెస్‌ నేతలు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు అప్పుడే బేరాలు మొదలుపెట్టారని ఆరోపించారు. లగడపాటి సర్వేతో గందరగోళానికి గురిచేసి ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

నాగర్‌ కర్నూలు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి సంచలన వ్యాఖ్యలు...టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు ...

Submitted by arun on Mon, 12/10/2018 - 16:08

నాగర్‌ కర్నూలు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి మర్రి జనార్దన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు అప్పుడే బేరాలు మొదలుపెట్టారని ఆరోపించారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తనకు ఫోన్ చేశారన్న మర్రి జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారన్నారు. జానారెడ్డి ఇంట్లో మీటింగ్‌ పెట్టిన విశ్వేశ్వర్‌రెడ్డి తనను రమ్మని పిలిచారని  మర్రి జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో కాంగ్రెస్‌ నేతలు పనిచేస్తున్నారన్న మర్రి జనార్దన్‌రెడ్డి ఓటుకు నోటు తరహాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెరలేపారని సంచలన ఆరోపణలు చేశారు.