bjp

తెలంగాణ బిజెపికి అభ్యర్థుల ఎంపికలో సవాళ్లు

Submitted by arun on Mon, 10/29/2018 - 10:27

తెలంగాణ బిజెపికి అభ్యర్థుల కొరత ఏర్పడింది. ఆదిలాబాద్‌లో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ మిగితా 6 నియోజక వర్గాలలో అభ్యర్థులకోసం వేట  సాగిస్తోంది. ఆ ఆరు నియోజకవర్గాలలో  బిజెపి అభ్యర్థులెవరు ?  వేరే పార్టీల నుంచి వచ్చి చేరే అభ్యర్థుల కోసం పార్టీ  ఎదురుచూస్తుందా?  ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాలో  బిజెపి అభ్యర్థుల ఎంపిక  పై  హెచ్ ఎంటీవీ  ప్రత్యేక కథనం 

Tags

నేటి నుంచి బీజేవైఎం ‘విజయ్‌ లక్ష్య్‌ 2019’

Submitted by arun on Sat, 10/27/2018 - 11:25

తెలంగాణలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలో ప్రచార సభలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతుండగా బీజేపీ కూడా దూకుడు పెంచింది. ఎన్నికల కోసం యువతలో చైత్యన్యం నింపేందుకు.. యువ సమ్మేళనం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 

Tags

సీఎం కేసీఆర్‌ను ఢీ కొట్టె సత్తా డీఎస్‌ కొడుక్కు ఉందా?

Submitted by arun on Thu, 10/25/2018 - 11:06

సీఎం కేసీఆర్ పై పోటీకి బలమైన అభ్యర్థిని దింపేందుకు బీజేపీ యోచిస్తుంది. గజ్వేల్ లో టీఆర్ ఎస్ అధినేతకు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి  కోసం అన్వేషిస్తుంది. చివరకు ఒక క్యాండెట్ పేరును తీవ్రంగా పరిశీలిస్తుంది. కేసీఆర్ గట్టిపోటినిచ్చే ఆ బిజేపి నేత ఎవరు ? కేసీఆర్ ను ఓడించే సత్తా అతనికి ఉందా ? 

Tags

కరీంనగర్ లో టీఆర్ఎస్, బిజెపిలకు షాక్

Submitted by arun on Wed, 10/24/2018 - 12:31

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో టీఆర్ఎస్, బిజెపి పార్టీలకు షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు, బిజెపికి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాడిజెర్రి టీఆర్ఎస్ ఎంపీటీసీ కొత్తూరు మణెమ్మ, లక్ష్మీదేవిపల్లి బిజెపి ఎంపీటీసీ పొన్నం విజయ, నారాయణపూర్ టీఆర్ఎస్ ఎంపీటీసీ మల్లేశం, ర్యాలపల్లి బిజెపి ఎంపీటీసీ లక్ష్మీనారాయణ పార్టీలకు రాజీనామా చేశారు. నాలుగేళ్లుగా ఎంపీటీసీలుగా ఉత్సవ విగ్రహాలుగా ఉన్నామని తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ లో కొత్త జైపాల్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తామని వారు చెప్పారు. 

కేసీఆర్‌పై బీజేపీ అస్త్రం...పోటీకి యంగ్‌ లీడర్‌...

Submitted by arun on Wed, 10/24/2018 - 10:16

తెలంగాణలో బీజేపీ రూట్  మార్చిందా ? అధికారం కంటే సంచలన విజయాలపైనే దృష్టి సారించిందా ? ఏకంగా సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా కమలనాధులు పావులు కదుపుతున్నారా ?  గజ్వేల్‌ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా కొత్త వ్యూహాలకు పదును పెట్టారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం సీఎం కేసీఆర్‌కు నిన్న మొన్నటి వరకు నమ్మిన నేస్తంగా ఉన్న మాజీ పీసీసీ చీఫ్ డీఎస్ కుమారుడు ధర్మిపురి అరవింద్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు సమాచారం. 

రాజస్థాన్ లో కమలం వాడిపోతోందా?

Submitted by arun on Tue, 10/23/2018 - 14:41

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా ఉంది రాజస్థాన్ లో బిజెపి పరిస్థితి ఓటమి భయం వెన్నాడటంతో పోల్ షెడ్యూల్ ను చివరికి మార్చినా ప్రచారంలో పదును పెంచినా బిజెపికి అక్కడ కష్టకాలమేననే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం వసుంధర వ్యవహార శైలిపై బిజెపి పెద్దలే మండి పడుతున్నారు.

బీజేపీ నేత రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు...ఏపీలో త్వరలోనే కొత్త ప్రభుత్వం...

Submitted by arun on Mon, 10/22/2018 - 14:20

అగ్రిగోల్డ్‌ బాధితుల రిలే నిరాహార దీక్షలో బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడనుందని ఇందులో బీజేపీనే కీలక పాత్ర పోషింస్తుందిన ఆయన అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ఆయన ప్రకటించారు. టీడీపీ తెలుగు దోపిడీ పార్టీగా మారిందన్నారు బీజేపీ నేత రాం మాధవ్‌. అగ్రిగోల్డ్ బాధితులకు మద్ధతుగా విజయవాడలో రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టేందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు, వారి అనుచరులు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. అవినీతిలో దేశంలోనే నాల్గో స్ధానంలో ఏపీ ఉందన్నారు.

బీజేపీని వణికిస్తున్న కొత్త భవనం...బీజేపీకి టీడీపీ దూరం కావడానికి...

Submitted by arun on Mon, 10/22/2018 - 11:45

కొద్ది నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణమేంటి..? కర్ణాటకలో కమలనాథుల పరాజయానికి కారణమేంటి..? బీజేపీకి టీడీపీ దూరం కావడానికి..జమ్ములో పీడీపీతో సంకీర్ణం విచ్ఛిన్నం కావడానికి కారణమెవరు..? శివసేన - బీజేపీ శత్రువులు అవ్వడం వెనుకున్న రీజన్ ఏంటి..? కమలదళం మదిలో మెదులుతున్న సెంటిమెంట్ వింటే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే..! 
 

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి కీలక నేత

Submitted by arun on Sat, 10/13/2018 - 14:39

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి చత్తీస్‌గఢ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పాళి-తనఖర్‌ ఎమ్మెల్యే రామ్‌దయాళ్‌ యూకె నేడు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.

అవునా ఇది బీజేపీ స్కెచ్చా...? అసలేంటీ టికెట్‌ ఫార్ములా?

Submitted by santosh on Fri, 10/12/2018 - 15:35

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో ఇంటికో టికెట్ ఫార్ముల పార్టీ అధ్యక్షుడికి కొత్త టెన్షన్ తెచ్చిపెడుతోంది. మాజీ డిప్యూటీ సీఎం భార్య పద్మిని రెడ్డి కమలం పార్టీ గూటికి చేరారు. సంగారెడ్డి నియోజక వర్గం టికెట్ ఆశించిన ఆమె కాంగ్రెస్ పార్టీ ఇంటికో టికెట్ ఫార్ముల కారణంగా రూటు మార్చారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి.... సంగారెడ్డి అభ్యర్థిగా జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇదే సరైన సమయంలో అని భావించిన పద్మిని రెడ్డి పార్టీ మారారు.