bjp

హైదరాబాద్ ఇక భాగ్యనగరంగా మారబోతుందా?

Submitted by arun on Fri, 11/09/2018 - 15:25

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ ను భాగ్యానగర్ గా మార్చేస్తామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హైదరాబాద్ తో పాటు సికింద్రాబాద్, కరీంనగర్ ల పేర్లను కూడా మారుస్తామని వెల్లడించారు. మొదట్లో హైదరాబాద్ భాగ్యనగరంగా పిలువబడేది. కూలీ కుతుబ్ షాహీల పాలన మొదలైందో భాగ్యనగర్ ను కాస్తా హైదరాబాద్ గా మార్చేసారని రాజాసింగ్ అన్నారు. మొగల్స్, నిజాంలు పెట్టిన పేర్లను దేశం కోసం పనిచేసిన వీరయోధుల పేర్లతో తిరిగి మార్చాల్సిన అవసరం ఎంతైన ఉందని స్పష్టంచేశారు.

నాకు సీఎం కావాలనే కోరిక లేదు: కేటీఆర్‌

Submitted by arun on Tue, 11/06/2018 - 16:40

తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభద్రతాభావంతో ఉన్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వందసీట్లతో అధికారంలోకి వస్తామని ఆయన పునరుద్ఘాటించారు. మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం కావాలనే ఆలోచన లేదన్నారు. మంత్రి హరీశ్‌తోనూ, పార్టీలోని ఇతర నేతలతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తామంతా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాజకీయాలు, అధికారం కంటే కుటుంబసభ్యుల మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పదని, దాన్ని ఎప్పుడూ వీడబోమని కేటీఆర్‌ అన్నారు.

ఆప్‌, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ

Submitted by arun on Mon, 11/05/2018 - 15:44

ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. ఢిల్లీలోని సిగ్నేచర్‌ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ భాజపా చీఫ్‌ మనోజ్‌ తివారీ, ఆయన అనుచరులు సిగ్నేచర్‌ బ్రిడ్జిపైకి వచ్చారు. దీంతో అక్కడే ఉన్న ఆప్‌ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదంతో ఘర్షణకు దారితీసింది. దింతో  హుటాహుటినా ఘటనస్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితి చక్కబెట్టేందుకు యత్నించారు. ఎన్నో వాయిదాలు, పనులు ఆపేసిన తర్వాత ఎట్టకేలకు ఢిల్లీలో సిగ్నేచర్‌ వంతెన పూర్తయ్యింది. 

బీజేపీలో చెలరేగిన అసమ్మతి

Submitted by arun on Fri, 11/02/2018 - 14:28

బీజేపీలో అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. సెకండ్‌ లిస్ట్‌లోనూ అవకాశం దక్కని ఆశావహులు పార్టీ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. టికెట్లు అమ్ముకుంటున్నారంటూ అధిష్టానంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అభ్యర్థుల దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన నిరసన తెలిపారు.

Tags

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

Submitted by arun on Fri, 11/02/2018 - 11:53

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యింది. రెండో జాబితాలో 28 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది.

Tags

ఇప్పుడున్నది నందమూరి టీడీపీ కాదు.. నారావారి టీడీపీ : కిషన్‌రెడ్డి

Submitted by arun on Thu, 11/01/2018 - 14:12

చంద్రబాబు కాంగ్రెస్ తో జతకట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆత్మగౌరవం నినాదంతో టీడీపీ ఆవిర్భవించిందన్నారు. కాంగ్రెస్ తో కలవడం ఎన్టీఆర్ ఆలోచనను తాకట్టుపెట్టడమేనన్నారు. తెలంగాణలో మహాకూటమి మొత్తం చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తోందని విమర్శించారు. ఇప్పుడున్నది నందమూరి టీడీపీ కాదు నారావారి టీడీపీ అన్నారు. 

తెలంగాణ బీజేపీకి అసంతృప్తి నేతల సెగ

Submitted by arun on Thu, 11/01/2018 - 12:30

తెలంగాణ బీజేపీకి నేతల సెగ రాజుకుంది. స్థానికేతరులకు సీట్లు కేటాయించవద్దని శేరిలింగంపల్లికి చెందిన నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయం దగ్గర అసమ్మతి నేతలు నిరసన చేపట్టారు. శేరిలింగంపల్లి బీజేపీ టిక్కెట్ యోగనంద్ కు కేటాయించారని ప్రచారం జరగడంతో ఆ సీటు తనకే కేటాయించాలని బీజేపీ అధికార ప్రతినిధి నరేష్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో  బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర అసమ్మతి నేతలు ఆందోళనకు దిగారు. 
 

Tags

తెలంగాణ బీజేపీ రెండో జాబితా రెడీ...ఈ సాయంత్రమే...

Submitted by arun on Thu, 11/01/2018 - 10:21

తెలంగాణ బీజేపీ రెండో జాబితా రెడీ అయ్యింది. 25 మంది అభ్యర్థుల పేర్లతో రూపొందిన లిస్టును అధిష్టానం ఆమోదం కోసం టీబీజేపీ నేతలు ఢిల్లీ తీసుకెళ్తున్నారు. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ పడితే ఈ సాయంత్రమే అదృష్టవంతుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. అయితే రెండో జాబితా రెడీ అయ్యిందన్న వార్తలతో హైదరాబాద్ కమలంలో కల్లోలం మొదలైంది.

Tags

మోడీ ప్రభంజనానికి భయపడే ముందస్తు...

Submitted by arun on Wed, 10/31/2018 - 16:42

మోదీ ప్రభంజనంలో కొట్టుకుపోతాననే భయంతో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని బీజేపీ నేత రాంమాధవ్ అన్నారు. అవినీతిలో తెలుగు రాష్ట్రాలు రికార్డు సాధించాయన్నారు రాంమాధవ్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశానికి హాజరైన ఆయన కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. దేశంలో అవినీతిలో తెలంగాణ 2వ స్థానంలో, ఏపీ 4వ స్థానంలో ఉన్నాయని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో తెలంగాణలో అసమర్ధపాలన సాగిందని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం లక్షా 20వేల కోట్లు ఇచ్చిందన్న ఆయన..ఆ నిధులు ఎటు పోయాయని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ పాలన వల్ల బంగారు తెలంగాణ కాదు..

తెలంగాణ బిజెపికి అభ్యర్థుల ఎంపికలో సవాళ్లు

Submitted by arun on Mon, 10/29/2018 - 10:27

తెలంగాణ బిజెపికి అభ్యర్థుల కొరత ఏర్పడింది. ఆదిలాబాద్‌లో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ మిగితా 6 నియోజక వర్గాలలో అభ్యర్థులకోసం వేట  సాగిస్తోంది. ఆ ఆరు నియోజకవర్గాలలో  బిజెపి అభ్యర్థులెవరు ?  వేరే పార్టీల నుంచి వచ్చి చేరే అభ్యర్థుల కోసం పార్టీ  ఎదురుచూస్తుందా?  ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాలో  బిజెపి అభ్యర్థుల ఎంపిక  పై  హెచ్ ఎంటీవీ  ప్రత్యేక కథనం 

Tags