bjp

నేను ఢిల్లీ నుంచి వచ్చా.. త్వరలో ఓ గొప్ప వార్త వినబోతున్నారు

Submitted by arun on Mon, 09/24/2018 - 11:29

తెలంగాణలో సీఎం అభ్యర్థిని ప్రకటించే యోచనలో ఉంది బీజేపీ. ముందుస్తు ఎన్నికల రేసులో స్పీడు పెంచుతున్న బీజేపీ.. సీఎం అభ్యర్థిని ప్రకటించే దిశగా అడుగులు వేస్తోంది. స్వామి పరిపూర్ణానంద లేక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నేతలతో చర్చించిన బీజేపీ అధిష్టానం చర్చించినట్టు వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు, స్వామి పరిపూర్ణానంద ఇప్పటికే ఢిల్లీ వెళ్లివచ్చారు. దీంతో స్వామీజినే సీఎం రేసులో ముందున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఛార్మినార్ లో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న పరిపూర్ణానంద స్వామి..

టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పనున్న తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ..?

Submitted by arun on Mon, 09/24/2018 - 10:02

అధికార టీఆర్ఎస్‌ లో అసమ్మతి కొనసాగుతూనే ఉంది. టిక్కెట్లు రాని వారు.. అధిష్టానంపై ఎదురుతిరుగుతున్నారు. తాజాగా చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కారు దిగేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్‌ కు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల కేసీఆర్‌ ప్రకటించిన 105 మంది లిస్టులో ఆమె పేరు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనిపై గత కొన్నిరోజులుగా కేసీఆర్‌, కేటీఆర్‌లను కలిసి వివరణ కోరాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఒకవేళ టిక్కెట్‌ రాదని కన్ఫర్మ్‌ అయితే కమలం తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. 
 

గులాబీతో వియ్యమా.. కయ్యమా? కనిపించని కమలం కథ!!

Submitted by santosh on Mon, 09/17/2018 - 12:23

గులాబీ-కమలం ఒకటేనన్నారు. కారెక్కకపోయినా, కారుకు ముందస్తు ఇంధనం పోస్తున్నది, కాషాయదళమేనన్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌ అప్రకటిత స్నేహతులని కాంగ్రెస్, టీడీపీలు ఆరోపణలు చేశాయి. తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించిన, ీబీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, ఈ ఆరోపణలన్నింటికీ ఆన్సర్ ఇచ్చేశారు. గులాబీతో వియ్యం కాదు, కయ్యమేనని ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు. కేసీఆర్ సర్కారుపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టి, స్నేహం లేదు సమరమేనని యుద్ధభేరి మోగించారు. అమిత్‌ షా టూర్‌లో తేలింది ఇదేనా....కనపడని వ్యూహం ఇంకేమైనా ఉందా?

సీఎం కేసీఆర్‌పై అమిత్‌ షా ఫైర్‌... అందుకే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు

Submitted by arun on Sat, 09/15/2018 - 17:19

ముందస్తు ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఆయన మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ ఉదయం 11 గంటలా 30 నిముషాలకు బేగంపేట్‌ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. ఆయనకు రాష్ట్రానికి చెందిన కాషాయ నాయకులు ఘన స్వాగతం పలికారు. 

తెలంగాణలో ముందస్తు ప్రచార వేడి ...మజ్లిస్ కంచుకోట నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

Submitted by arun on Sat, 09/15/2018 - 10:01

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి కాషాయదళం సిద్ధమయ్యింది. మజ్లిస్‌ కంచుకోట హైదరాబాద్‌ పాతబస్తీ నుంచే కమల దళపతి అమిత్‌షా శంఖారావం పూరించబోతున్నారు. లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని పాలమూరు నుంచి ఎన్నికల ప్రచారం షురూ చేయనున్నారు. ముందస్తు ఎన్నికలకు రంగంసిద్ధమయ్యాక తొలిసారి తెలంగాణకు వస్తుండటంతో అమిత్‌షా టూర్‌‌పై భారీ ఆశలే పెట్టుకున్నారు కమలనాథులు. 

అందుకే బాబుకు కోర్టు వారెంట్ జారీ చేసింది : కన్నా

Submitted by arun on Fri, 09/14/2018 - 13:50

సీఎం చంద్రబాబు నాయుడుకు నాన్‌బెయిలబుల్ వారెంట్‌ జారీలో తమ ప్రమేయం లేదంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ. వరుసగా 22 వాయిదాలకు వెళ్లకపోవడం వల్లే నోటీసులు జారీ అయ్యాయన్నారు. సాధారణంగా 3 సార్లు ముద్దాయిలు కోర్టుకు వెళ్లకపోతే నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ వస్తుందని వివరించారు. ఆపరేషన్ గరుడ గురించి అందరికి కంటే చంద్రబాబుకే ఎక్కువగా తెలుసన్నారు కన్నా. ఇప్పుడు కొత్తగా నోటీసుల వెనక మోదీ ఉన్నారని కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మీద కేసు కాంగ్రెస్‌ హయాంలో పెట్టిందని గుర్తు చేశారు. వాయిదాలకు వెళ్లకుండా చంద్రబాబు కోర్టులను అగౌరవపరిచేలా వ్యవహరించారని విమర్శించారు.

దూకుడు పెంచిన బీజేపీ...తెలంగాణకు యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌

Submitted by arun on Fri, 09/14/2018 - 13:06

ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తుండటంతో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంపై దృష్టి సారించిన ఢిల్లీ పెద్దలు తెలంగాణలో పర్యటించి ఎన్నికల వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రెండుసార్లు తెలంగాణలో పర్యటించి భారీ బహిరంగ నిర్వహించేందుకు అంగీకరించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. 

బీజేపీ, కేసీఆర్‌ లపై లోకేష్ ఫైర్..

Submitted by arun on Sat, 09/08/2018 - 13:10

ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్ బాబు బీజేపీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌  పై విమర్శలు చేశారు. శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం లో లోకేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే కెసిఆర్ అది చేస్తున్నాడని విమర్శించాడు. కేంద్రం ఆదేశాల అనుగుణంగానే కెసిఆర్ తన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. 

తెలంగాణ గట్టుపైన...బీజేపీ, టీజేఎస్...

Submitted by arun on Thu, 09/06/2018 - 09:58

తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరాటం చేస్తుందా..? మిత్రులను వెతుక్కొంటోందా..? అమిత్ షా చూపు ఏ పార్టీ వైపు ఉంది..? దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న అంచనాల నడుమ బీజేపీతో దోస్తీకి సిద్ధమైన పార్టీ ఏది..? 

ఏపీలో టీడీపీ గ్రాఫ్ పడిపోయింది...

Submitted by arun on Tue, 09/04/2018 - 12:22

ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పడిపోయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. విశాఖలో మీడియాలో మాట్లాడిన ఆయన ఏపీ గూండాల రాష్ట్రంగా మారిందని విమర్శించారు. ఏపీలో టీడీపీ గ్రాఫ్‌ పడిపోయిందని సీఎం చుట్టూ ఉన్న మంత్రుల వల్లే టీడీపీ గ్రాఫ్‌ పడిపోయిందని వ్యాఖ్యానించారు. రైల్వేజోన్‌ వస్తుందని తెలిసి కూడా మంత్రి గంటా అనవసరంగా నిరసనలు చేస్తున్నారని విష్ణుకుమార్‌రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు.