Nandamuri Harikrishna

హరికృష్ణ విగ్రహం సిద్ధం.. రేపు ఎన్టీయార్‌కు అందజేత

Submitted by arun on Sat, 09/01/2018 - 15:34

తెలుగుదేశం సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో కన్నుముూసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం హరికృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. కాగా, సెప్టెంబర్ 2న హరికృష్ణ జయంతి సందర్భంగా ఇద్దరు నందమూరి అభిమానులు ఆయన విగ్రహాన్ని రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరానికి చెందిన ఏకేఆర్ట్స్ శిల్పులు డాక్టర్ పెనుగొండ అరుణ్ ప్రసాద్ ఉడయార్, కరుణాకర్ ఉడయార్‌లు హరికృష్ణ మీద అభిమానంతో ఆయన విగ్రహాన్ని రూపొందించారు.

హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీ.. ఆ నలుగురినీ ఉద్యోగం నుంచి తొలగించిన కామినేని ఆసుపత్రి

Submitted by arun on Sat, 09/01/2018 - 10:14

నల్గొండ జిల్లాలోని కామినేని ఆస్పత్రిలో జరిగిన వ్యవహారంపై యాజమాన్యం స్పందించింది. తీవ్రంగా గాయపడిన నందమూరి హరికృష్ణతో సెల్ఫీలు దిగిన ఆస్పత్రి సిబ్బందిని సస్పెండ్ చేసింది. రెండురోజుల క్రితం రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణను కామినేని ఆస్పత్రికి తరలించినప్పుడు నలుగురు సిబ్బంది సెల్ఫీలు దిగారు. విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో యాజమాన్యం స్పందించి వారిపై వేటు వేసింది. మరోమారు ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

ఇష్టమైనదే ప్రాణం తీసింది..

Submitted by nanireddy on Wed, 08/29/2018 - 11:09

నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. 1956 సెప్టెంబర్ 2 న కృష్ణా జిల్లా నిమ్మకూరులో నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతులకు హరికృష్ణ జన్మించారు. హరికృష్ణ బాల్యం, విద్యాబ్యాసం, వివాహం అన్నీ నిమ్మకూరులోనే జరిగాయి.  బాల నటుడిగా రంగప్రవేశం చేసిన హరికృష్ణ  హీరోగా, నిర్మాతగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలు పోషించారు. బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నందిఅవార్ట్‌ కూడా అందుకున్నారు. మొదటగా ‘శ్రీకృష్ణావతారం’ సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఈ చిత్రం1964లో విడుదలైంది.