bjp

బీజేపీ ఎమ్మెల్యేకు చెప్పుల దండతో స్వాగతం..

Submitted by arun on Tue, 11/20/2018 - 16:48

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థికి చేదు అనుభవనం ఎదురైంది. గ్రామస్థుల దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకునేందుకు వంగిన బీజేపీ అభ్యర్థి మెడలో ఓ వ్యక్తి చెప్పుల దండ వేసి అవమానపరిచాడు. దీంతో వెంటనే సదరు ఎమ్మెల్యేతోపాటు పక్కనే మరో కార్యకర్త కూడా ఆ వ్యక్తిపై దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నగాడాలో జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే దిలీప్ షెకావత్‌కు ఎదురైన ఈ చేదు అనుభవం ఆ పార్టీ నేతలను షాక్‌కు గురి చేసింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 28న ఎన్నికలు జరగనున్నాయి.

టీఆర్‌ఎస్‌కు పోటీగా బీజేపీ...

Submitted by arun on Mon, 11/19/2018 - 10:37

అభ్యర్ధుల ప్రకటనలో ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో పార్టీలన్నీ తుది జాబితాలను ప్రకటిస్తున్నాయి. ఇక అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు పోటీగా అభ్యర్ధులను ప్రకటిస్తూ వస్తోన్న బీజేపీ దాదాపు అన్ని స్థానాల్లోనూ పోటీకి దిగుతోంది. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో పార్టీలన్నీ ఫైనల్ లిస్టులను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు పోటీగా అభ్యర్ధులను ప్రకటిస్తూ వస్తోన్న బీజేపీ ఒకే రోజు ఐదు, ఆరు జాబితాలను అనౌన్స్ చేసింది. ఐదో జాబితాలో 19మందిని, ఆరో జాబితాలో ఆరుగురిని ప్రకటించింది.

కేంద్ర మంత్రి నడ్డాకు నిరసన సెగ

Submitted by chandram on Thu, 11/15/2018 - 19:32

కేంద్ర మంత్రి నడ్డాకు బీజేపీ కార్యకర్తల నుంచి నిరసన ఎదురైంది . టికెట్ల కేటాయింపుపై అసంతృప్తితో ఉన్న ఆశావహులు పార్టీ కార్యాలయంలోనే నడ్డాను అడ్డుకున్నారు. జూబ్లీహిల్స్‌ టికెట్‌ను స్థానికులకే కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. పార్టీ ఆఫీస్‌ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు కారులో ఎయిర్‌పోర్ట్‌ బయలుదేరుతుండగా నడ్డా కారును చుట్టుముట్టారు. దీంతో కారు దిగి నడుచుకుంటూ కొంత దూరం వెళ్లి అక్కడి నుంచి మరోకారులో ఎక్కి బయలుదేరారు. 


 

టీఆర్ఎస్ తాజా మాజీకి బీజేపీ టిక్కెట్..?

Submitted by arun on Wed, 11/14/2018 - 14:40

కరీంనగర్ జిల్లా చొప్పదండి లో టీఆర్ ఎస్ కు షాక్ తగిలింది. చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. బిజెపి మూడో లిస్టులో బొడిగె శోభ పేరు వస్తుందని సమాచారం. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇక తనకు టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చిన ఆమె సోమవారం కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారని సమాచారం. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు వ్యతిరేకించినా పలువురు బీజేపీలో చేరి పోటీ చేయాలని ఆమెను కోరారని తెలిసింది.
 

రాజస్ధాన్‌లో బీజేపీకి భారీ షాక్‌

Submitted by chandram on Wed, 11/14/2018 - 13:54

అసెంబ్లీ ఎన్నికల వేళా వరుసగా అధికార బీజేపీకి భారీ ఎదురుదెబ్బలు తగులుతూనేఉన్నాయి. తాజాగా సంజయ్‌సింగ్‌ మసానీ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్  తీర్థంపుచ్చుకున్న విషయం తెలిసిందే కాగా వసుంధర రాజె నేృత్వంలో బీజేపీ సర్కార్ పై తీవ్రవ్యతిరేకతతో బీజేపీయేతర శక్తుల్ని ఏకాతాటిపై వచ్చి కూటమి ఏర్పాటుచేసే ప్రయాత్నాలతో బీజీపీ నేతలను కలవరపెడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ నుంచి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. దౌసా ఎంపీ, మాజీ డీజీపీ హరీశ్ మీనా బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు.

మధ్యాహ్నం తెలంగాణ బీజేపీ మూడో లిస్ట్..

Submitted by arun on Wed, 11/14/2018 - 10:29

బిజెపి మూడో జాబితా ప్రకటించేందుకు సిద్ధమైంది. ఢిల్లీ వెళ్లిన బిజెపి నేతలు అమిత్ షా, నడ్డాలతో భేటీ కానున్నారు. మిగతా స్థానాల అభ్యర్థులపై వారితో చర్చిస్తారు. 30 పైగా స్థానాలకు అభ్యర్థులను బిజెపి ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. బిజెపి మూడో జాబితాలో మహబూబ్ నగర్ పద్మాజా రెడ్డి, కొడంగల్ నాగురావు నామోజీ, కొల్హాపూర్ సుధాకర్, జడ్చర్ల మాదిని శ్రీనివాస్, నల్గొండ షణ్ముఖ, ఇబ్రహీంపట్నం అశోక్ గౌడ్, చేవెళ్ల ప్రకాష్,  పరిగి ప్రహ్లాద్ లేదా కాసాని, చొప్పదండి బొడిగే శోభ, మంచిర్యాల అరవింద్ రెడ్డి, జుక్కల్ నాయుడు ప్రకాష్, ఎల్లారెడ్డి బాణాల లక్ష్మారెడ్డి పేర్లు ఉండే అవకాశం ఉంది. 

Tags

బీజేపీ ప్రమాదకరమైన పార్టీ.......:రజినీ

Submitted by chandram on Tue, 11/13/2018 - 12:51

బీజేపీ పార్టీపై తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడు, సానుకూలంగా ఉండే రజినీ ఇప్పుడు బిన్న వ్యాఖ్యలు చేయడంతో అందరిలోనూ చర్చనీయాంశమైంది. చెన్నై ఎయిర్ పోర్టులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విపక్షాలన్నీ అన్ని బీజేపీపై తీవ్రవ్యతిరేకతో కూటమి ఏర్పడుతున్నాయి, అంటే బీజేపీ ఎంత ప్రమాదకరమైన పార్టీయో అర్థమౌతుంది. ఇటివల పెద్దనోట్ల రద్దుపై ప్రధానిమోడీ సంచలన నిర్ణయానికి రజినీకాంత్ సానుకూలంగా స్పందించిన ఆయన ఇప్పుడు పెద్దనోట్లుపై ఘాటువ్యాఖ్యలు చేశారు. పెద్దనోట్ల రద్దును సరిగా అమలు కాకపోవడం వల్ల ప్రజలు నానాపాట్లు పడుతున్నారని తెలిపారు.

తెలంగాణలో మొదలైన నామినేషన్ల పర్వం

Submitted by chandram on Mon, 11/12/2018 - 16:51

తెలంగాణలో నోటిఫికేషన్‌ వెలువడిన తొలి రోజే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇందిరాపార్క్ సమీపంలోని  గణపతి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన అనంతరం నామినేషన్‌కు బయలుదేరారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, సీనియర్ నేతలు, ఎంపీల నడుమ ర్యాలీకి వెళ్లి ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణలో గడచిన నాలుగున్నరేళ్లలో బీజేపీయే ప్రతిపక్ష పాత్ర పోషించిందని ప్రజలు తమ వైపే ఉన్నారని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్...

Submitted by chandram on Mon, 11/12/2018 - 11:17

ఓపక్క మహాకూటమిలో తేలని లెక్కలతో రాహుల్ గాంధీ అసంతృప్తిగా ఉన్నవిషయం తెలిసిందే. కాగా తాజాగా ఛత్తీస్‌గఢ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌కు పార్టీకు ఉహించని ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గనారామ్ సాహూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థంపుచ్చుకున్నారు. తొలి దశ ఎన్నికలకు ముందే సాహూ పార్టీ వీడడంతో

స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Mon, 11/12/2018 - 10:45

హైదరాబాద్ పేరు మార్చి కొత్త పేరు పెడతాం తెలంగాణలో కొన్ని పట్టణాల పేర్లు మార్చేస్తాం..  ఇది విన్నాక అవునా.. నిజమా అన్న సందేహం వస్తుందా..? అవును తమ పార్టీ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో పలు ప్రాంతాల పేర్లను మార్చి కొత్త పేర్లను పెడతామని రాజకీయ నాయకులు ప్రకటిస్తున్నారు.. ఇంతకీ ఎవరా నేతలు.. ఏంటా కథ.. తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..