car

తీరంలో ఇరుక్కుపోయిన మంత్రి గంటా కారు

Submitted by arun on Mon, 12/17/2018 - 13:50

పెథాయ్ తుపాను తీరం తాకింది. తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లరేవు - కాట్రేనికోన మధ్యలో సరిగ్గా మధ్యాహ్నం 12.15గంటలకు తీరం తాకింది. దీంతో తీరంలో గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షణకు వెళ్లిన మంత్రి గంటా శ్రీనివాసరావు కారు తీరంలో ఇసుకలో ఇరుక్కుపోయింది. భీమిలి బీచ్ దగ్గర్లోని మంగమర్రిపేట వద్ద తీరంలో గంటా కారు ఇసుకలో ఇరుక్కుపోయింది. దీంతో ఆయన రక్షణ సిబ్బంది కారును బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు.

నెల్లూరులో కారు బీభత్సం.. పలువురికి తీవ్ర గాయాలు

Submitted by arun on Sat, 12/08/2018 - 16:19

నెల్లూరులో ఓ కారు బీభత్సం సృష్టించింది. బొల్లినేని హాస్పిటల్స్ సమీపంలో ఓ కారు పాదాచారులపై దూసుకెళ్లి  పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన చుట్టుపక్కలవారు గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.  ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది.  కారు సృష్టించిన భీతావాహా దృశ్యాలు సిసిటీవీల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags

నెల్లూరులో కారు బీభత్సం

Submitted by arun on Mon, 09/10/2018 - 14:27

నెల్లూరులో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ షాపింగ్ మాల్ సెల్లూర్ పార్కింగ్ నుంచి వేగంగా వచ్చింది.  తండ్రి వెంట వస్తున్న ఇద్దరు పిల్లలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసంమయ్యాయి. రాత్రి వేళ నెల్లూరులోని  MGB మాల్ ఆవరణలో ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలతో వస్తున్నారు. ఈ మాల్  సెల్లార్ పార్కింగ్ నుంచి ఓ కార్ స్పీడ్ గా దూసుకొచ్చింది. ఇద్దరు చిన్నారులతో పాటు అక్కడ ఆగి వున్న వాహనాలపై దూసుకెళ్లింది. అక్కడే ఉన్న కొందరు కారు బీభత్సం చూసి షాక్ తిన్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

Tags

ప్ర‌దీప్ కారులో ఉన్న ఆ అమ్మాయి ఎవ‌రంటే

Submitted by arun on Sun, 01/07/2018 - 16:21

న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాంక‌ర్ ప్ర‌దీప్ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌మ‌యంలో కారులో ప్ర‌దీప్ తో పాటు మ‌రో ముగ్గురు ప్ర‌యాణించారు. అందులో ఇద్ద‌రు అమ్మాయిలు. ఒక అబ్బాయి  ప్ర‌దీప్. మ‌రి  ప‌క్క‌నే ఉన్న ఆ  అమ్మాయిలు ఎవ‌రు అని నెటిజ‌న్లు ఒక‌టే చ‌ర్చించుకుంటున్నారు. అయితే వారిలో స‌గం క‌వ‌ర్ అయిన ఫోటోని చూసి  శ్రీముఖి అని కొంద‌రు గెస్ చేశారు.  ఆఫోటో పై వ‌స్తున్న రూమ‌ర్ల‌ను ఖండించిన శ్రీముఖి తాను కాద‌ని తేల్చేసింది. ఒక‌రు అప్ క‌మింగ్  హీరోయిన్ అని, మ‌రికొంద‌రు ప్ర‌దీప్ డీప్ ల‌వ్ లో ఉన్నాడ‌ని ఊహాగానాలు చేశారు. దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు.

జూబ్లీహిల్స్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనూష బ్రెయిన్ డెడ్

Submitted by arun on Sun, 01/07/2018 - 11:03

జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 యాక్సిడెంట్‌లో మరో యువతికి బ్రెయిన్‌డెడ్ అయ్యింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనూషకు.. బ్రెయిన్ డెడ్ అయినట్లు అపోలో హాస్పిటల్ డాక్టర్లు నిర్ధారించారు. మరో యువతి ప్రియకు.. కాలు విరిగిపోయింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ప్రమాదంలో మస్తానీ అనే యువతి.. స్పాట్‌లోనే మృతి చెందింది.

డైమండ్ హౌస్ దగ్గర జరిగిన ఈ యాక్సిడెంట్‌.. హిట్ అండ్ రన్ కేసుగా పోలీసులు గుర్తించారు. యువతి స్కూటీని ఢీకొట్టిన తర్వాత.. నిందితుడు విష్ణువర్ధన్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. భయంతో.. వేగంగా కారు నడపడంతో కిలోమీటర్ దూరంలోనే డివైడర్‌కు ఢీకొట్టాడు. 

సురేష్ రైనాకు తప్పిన ప్రమాదం

Submitted by lakshman on Tue, 09/12/2017 - 18:53
భారత క్రికెటర్ సురేష్ రైనాకు త్రుటిలో ప్రమాదం తప్పింది. దులీప్ ట్రోఫీలో తన టీం తరపున ఆడేందుకు ఘజియాబాద్ నుంచి కాన్పూర్‌కు వెళుతుండగా రైనా ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కార్ టైర్ పేలింది. కారు తక్కువ వేగంతో వెళుతుండటంతో...