ms dhoni

వికెట్ కీపర్గా ధోనీ ప్రపంచ రికార్డు

Submitted by arun on Thu, 10/04/2018 - 13:56

వికెట్ కీపర్గా ధోనీ ప్రపంచ రికార్డు సృష్టించాడు అని మీకు తెలుసా! ఒక వికెట్ కీపర్గా ఆరుగురు బాట్స్మన్ని డిస్మిస్ చేయడంలో ఈ రికార్డు. అతను వన్ డే మ్యాచ్ ల్లో 2007 లో ఇంగ్లడ్తో ఆడుతునాపుడు.. అలాగే 2018  టి 20 మ్యాచ్ల్లో వికెట్ కీపర్గా ఇది కూడా ఇంగ్లాండుతో ఆడుతూనే సాధించాడు. శ్రీ.కో.
 

ధోనీ ఆ బాల్ ఎందుకు తీసుకున్నాడు...రిటైర్‌ కాబోతున్నాడా..?

Submitted by arun on Wed, 07/18/2018 - 12:59

ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ను టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన వెంటనే జరిగిన ఒక ఘటన క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. మ్యాచ్ ను భారత్ కోల్పోయిన అనంతరం... అంపైర్ల వద్దకు వచ్చిని ధోనీ, వారి వద్ద నుంచి బాల్ ను తీసుకుని, పెవిలియన్ కు వెళ్లిపోయాడు. సాధార‌ణంగా ఏదైనా ఒక మ్యాచ్‌లో గుర్తుండిపోయే ప్ర‌ద‌ర్శ‌న చేసిన‌పుడు లేదా విజ‌యం సాధించిన‌పుడు ఆట‌గాళ్లు ఆ మ్యాచ్‌కు సంబంధించిన గుర్తుగా బాల్, వికెట్ లేదా బెయిల్స్ వంటి వాటిని తీసుకుంటుంటారు.

ప్రాణ హాని ఉంది, గన్ లైసెన్స్ ఇప్పించండి: ధోనీ భార్య సాక్షి

Submitted by arun on Wed, 06/20/2018 - 13:02

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ భార్య సాక్షి గన్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకుంది. తనకు ప్రాణహాని భయం ఉందని ఈ సందర్భంగా ఆమె తెలిపింది. పిస్టల్ లేదా .32 రివాల్వర్ ను తీసుకోవాలని భావిస్తోంది. జాతీయ, అంత‌ర్జాతీయ ప‌ర్య‌ట‌న‌ల దృష్ట్యా ధోనీ ఇంటిలో ఉండే స‌మ‌యం చాలా త‌క్కువ‌. అధిక స‌మ‌యాలు నేను నా కూతురితోపాటు ఇంట్లో ఒంట‌రిగానే ఉంటాను. వ్యక్తిగత పనుల మీద ప్రయాణిస్తూ ఉంటానని ఆమె తెలిపింది. ఈ నేపథ్యంలో, తాను ఎవరికైనా టార్గెట్ అయ్యే అవకాశం ఉందని, అందుకే ఆయుధం ఉండాలని కోరుకుంటున్నానని చెప్పింది. రాంఛీ మేజిస్ట్రేట్ కార్యాలయంలో ఆమె లైసెన్సై కోసం దరఖాస్తు చేసుకోగా... ప్రస్తుతం పోలీస్ వెరిఫికేషన్ జరుగుతోంది.

ప్రతిభకు వయసు అడ్డుకాదు..!

Submitted by arun on Mon, 05/28/2018 - 17:08

ఇరవై ఓవర్లో అరవై థ్రిల్స్ గా సాగిపోయే ఐపీఎల్ ను...ఉరకలేసే కుర్రాళ్ల ఆట అనుకొంటే అంతకు మించిన పొరపాటు మరొకటి లేదని....మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ నిరూపించింది. హైదరాబాద్ సన్ రైజర్స్ తో ముగిసిన ఫైనల్లో పాల్గొన్న సూపర్ కింగ్స్ జట్టులోని మొత్తం 12 మందిలో తొమ్మిది మంది ఆటగాళ్లు 30 ఏళ్లకు పైబడినవారే. కెప్టెన్ ధోనీ, ఓపెనర్లు వాట్సన్, డూప్లెసిస్, అంబటి రాయుడు, డ్వయన్ బ్రావో, హర్భజన్ సింగ్, సురేశ్ రైనాతో సహా ప్రధాన ఆటగాళ్లంతా మూడుపదులు పైబడినవారే.

ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డ్ అందుకున్న‌ధోని

Submitted by lakshman on Mon, 04/02/2018 - 22:45

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బిలియర్డ్స్ ప్లేయర్ పంకజ్ అద్వానీలు పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ధోనితో పాటు బిలియర్డ్స్‌ చాంపియన్‌ పంకజ్‌ అద్వానీ ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు.
ఈ కార్యక్రమానికి ధోని కుటుంబ సమేతంగా హాజరయ్యారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా కలిగిన ధోని ఆర్మీ దుస్తుల్లోనే కవాతు చేస్తూ రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి మరీ అవార్డు స్వీకరించారు. ఇక ధోని అవార్డు అందుకుంటుండగా అతని భార్య సాక్షిసింగ్‌ నవ్వుతూ సంతోషం వ్యక్తం చేసారు.

ధోనీ ఎందుకిలా?

Submitted by arun on Tue, 02/20/2018 - 16:49

టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి విమర్శకులకు టార్గెట్ గా మారాడు. ఏడాది ఏడాదికీ పడిపోతున్న స్ట్రయిక్ రేట్ పసలేని బ్యాటింగ్ తో ధోనీ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కే అలంకరణగా మారాడంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. గత 15 సంవత్సరాలుగా భారత క్రికెట్ కు అసాధారణ సేవలు అందించిన మహేంద్రసింగ్ ధోనీలో మహిమ తగ్గిందా? అసలు ఎందుకిలా?

ప్రపంచ రికార్డు నమోదు చేసిన ధోని

Submitted by arun on Mon, 02/19/2018 - 13:55

టీమిండియా మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోని మరో అరుదైన ఘనతను సాధించాడు. దక్షిణాఫ్రికాతో​జరిగిన తొలి టీ20లో అత్యధిక క్యాచ్‌లందుకన్న వికెట్‌ కీపర్‌గా రికార్డు నమోదు చేశాడు. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో హెన్‌డ్రీక్స్‌ క్యాచ్‌తో ఈ ఘనతను సొంతం చేసుకున్నా డు. ఓవరాల్‌గా 275 టీ20ల్లో ధోని 134 క్యాచ్‌లందుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు  అగ్రస్థానంలో కొనసాగిన శ్రీలంక మాజీ వికెట్‌ కీపర్‌ సంగక్కర(133) ను అధిగమించాడు. టీ20ల్లో ధోనీ ఇప్పటి వరకు మొత్తం 139 క్యాచ్‌లు అందుకున్నాడు. దినేశ్‌ కార్తీక్‌(123), కమ్రాన్‌ అక్మల్‌(115), రామ్‌దిన్‌(108), ఓజా(106) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

మహేంద్ర సింగ్ ధోనీకి రవిశాస్త్రి హ్యాట్సాఫ్

Submitted by arun on Mon, 12/25/2017 - 18:13

టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీపైన చీఫ్ కోచ్ రవి శాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. 2019 ప్రపంచకప్ వరకూ ధోనీ భారత వన్డే, టీ-20 జట్లలో కొనసాగుతాడని చెప్పకనే చెప్పాడు. ప్రస్తుత భారత క్రికెటర్లలో 26 ఏళ్ల వయసున్న నవతరం క్రికెటర్లలో చాలామంది కంటే 36 ఏళ్ల ధోనీ చాలా చురుకుగా, ఫిట్ గా ఉన్నాడని ప్రశంసించాడు. ప్రస్తుత భారత క్రికెట్లో మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ క్రికెటర్లో ధోనీ ఒకడని అందరూ గమనించాలని భారత ప్రధాన శిక్షకుడు రవి శాస్త్రి కోరాడు.

టీ-20ల్లో ధోనీ రికార్డుల మోత

Submitted by arun on Thu, 12/21/2017 - 17:40

శ్రీలంకతో భువనేశ్వర్ బారాబటీ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ-20 మ్యాచ్ మహేంద్రసింగ్ ధోనీ షోగా ముగిసింది. ధోనీ బ్యాట్స్ మన్ గా మాత్రమే కాదు వికెట్ కీపర్ గా సైతం రికార్డుల మోత మోగించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు. రెండోడౌన్లో బ్యాటింగ్ కు దిగిన ధోనీ 39 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ గా రెండు క్యాచ్ లు, రెండు స్టంపింగ్స్ సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు. టీ-20 క్రికెట్లో అత్యధికంగా 74 మందిని క్యాచ్ లు లేదా స్టంపౌట్లు సాధించిన తొలివికెట్ కీపర్ గౌరవాన్ని సైతం ధోనీ సొంతం చేసుకొన్నాడు.

2019 వరల్డ్‌కప్ ఫిక్స్‌డ్ : వివాదంలో ధోనీ

Submitted by lakshman on Fri, 12/15/2017 - 11:33

మహేంద్రసింగ్ ధోనీ వివాదంలో చిక్కుకున్నాడు. ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన ఎనిమిదేళ్లలో కేవలం మూడు సార్లే ట్వీట్స్ కు లైక్ చేశాడు. వాటిలో 2013 రాజ్ దీప్ సర్దేశాయ్ ట్వీట్, 2014 డిసెంబర్ 31 బీసీసీఐ ట్వీట్ లైక్ కొట్టాడు. అవి ఎలా ఉన్నా దాదాపు మూడేళ్ల తర్వాత  ఓ ట్వీట్ కు ధోనీ లైక్ చేయడం వివాదాస్పదమైంది.  ఇన్‌ఖబర్ అనే న్యూస్ ఛానల్ '2019 వరల్డ్‌కప్ ఫిక్సయింది.. ఈసారి అది పక్కాగా ఇండియాకే' అని తన అకౌంట్ లో ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ కు ధోనీ లైక్ కొట్టడం చర్చాంశనీయంగా మారింది.