సుధాకర్ రెడ్డి

విజయవాడలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా

Submitted by lakshman on Fri, 12/15/2017 - 11:30

విజయవాడ పైడురుపాడు దగ్గర  రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది.  ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని బెజవాడ ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు 

సుధాకర్ రెడ్డి అంటే స్వాతికి ఎందుకు ఇష్టం లేదంటే

Submitted by lakshman on Fri, 12/15/2017 - 11:28

సుధాకర్ రెడ్డి హత్య కేసు విచారణలో స్పీడు పెంచారు పోలీసులు. రాజేష్ ను అరెస్టు చేసిన పోలీసులు, అతను ఇచ్చిన వివరాల ఆధారంగా సుధాకర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. మహబూబ్ నగర్ నుంచి ప్రత్యేక క్లూస్ టీంను రప్పించి.. రాజేష్ సమక్షంలోనే సుధాకర్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో కేసుకు సంబంధించి పలు కీలక ఆధారాలను సేకరించారు.  
మొదట జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రాజేష్ ను సుదీర్ఘంగా ప్రశ్నించిన పోలీసులు.. స్వాతితో ఎప్పటి నుంచి పరిచయం ఉంది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సుధాకర్ రెడ్డిని చంపడానికి వాడిన మత్తు ఇంజెక్షన్, తలపై కొట్టిన రాడ్డు కోసం గాలిస్తున్నారు.