TRS Pragati Nivedana Sabha

ఇక జన సమీకరణనే జపం!

Submitted by arun on Sat, 09/01/2018 - 17:17

ఇక జన సమీకరణనే మహా జపం,

వచ్చే టిక్కట్ల కోసమె వారి తపం,

సిట్టింగ్లకు వచ్చే గొప్ప ఫిట్టింగు,

సక్సెస్ చెయ్యాలి సార్లు ఆ సెట్టింగు. శ్రీ.కో. 

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్షలా మారిన ప్రగతి నివేదన సభ

Submitted by arun on Fri, 08/31/2018 - 11:00

అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఓ పరీక్షలా మారింది. అధినేత దృష్టిని ఆకర్షించేలా ప్రజాప్రతినిధులు జనసమీకరణకు తంటాలు పడుతున్నారు. సభ అనంతరం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండటంతో జనసమీకరణపై ప్రత్యేక దృష్టిసారించారు నేతలు. ఒకరిని మించి మరొకరు జనాలను సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

కేసీఆర్‌ ప్రగతి నివేదన సభలో ఎన్నికల రణభేరి మోగిస్తారా...ప్రగతి నివేదనతో ఏం తేల్చబోతున్నారు?

Submitted by arun on Fri, 08/24/2018 - 11:15

ముందస్తు వ్యూహమైనా.... ఎన్నికల రణతంత్రమైనా... సందర్భం ఏదైనా సరే. గమ్యం మాత్రం ఒక్కటే. గమనాన్ని చూపెడుతూ లక్ష్యం వైపు పరిగెత్తే పాలనే ప్రగతి నివేదన అంటూ సర్కార్ సంకల్పించిన సభపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నాలుగేళ్లలో తాను సాధించి పెట్టిన ప్రగతి పరుగులు పెడుతుంటే.. తాను కలలు గన్న బంగారు తెలంగాణ లక్ష్యం కనుచూపు మేరలో కనిపిస్తుందన్న భరోసా ముఖ్యమంత్రిని సభా ప్రాంగణం వైపు నడిపిస్తోందిప్పుడు. మరి ప్రగతి నివేదన సభ నుంచి ముఖ్యమంత్రి ఎన్నికల రణభేరి మోగిస్తారా? లేక యుద్ధ తంత్రాన్ని బోధిస్తారా? అడ్డుతగిలే అంశాలకు అంటుకున్న గులాబీ ముళ్లను... కేసీఆర్‌ ఏ పంటి వ్యూహంతో బయటకు తీస్తారు?