murder case

జగిత్యాలలో మళ్లీ దారుణం

Submitted by arun on Tue, 10/16/2018 - 10:37

జగిత్యాల జిల్లా తాటిపెల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు డిగ్రీ విద్యార్ధులు కత్తులతో  పరస్పరం  దాడి చేసుకున్నారు. స్ధానికంగా ఉన్న ఓ ప్రయివేటు కళాశాలలో డిగ్రీ చదవుతున్న నవీన్‌, శ్రవణ్‌లు నిన్న రాత్రి మద్యం సేవించారు. తరువాత మాట మాట పెరగడంతో  ఇరువురు కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో నవీన్ చనిపోగా ..శ్రవణ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. సరిగ్గా నెల రోజుల క్రితం ఇద్దరు పదోతరగతి విద్యార్ధులు మద్యం మత్తులో ప్రాణాలు తీసుకున్న ఘటన మరువక ముందే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది. 
 

మాచర్లలో.. అత్తాపూర్‌ లాంటి ఘటన

Submitted by arun on Mon, 10/01/2018 - 18:02

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో నడిరోడ్డుపై జరిగిన ఘోర హత్య మరువకముందే అలాంటి మరో ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో చోటుచేసుకుంది. మాచర్లలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఓ యువకుడిని కొందరు దుండగులు కత్తులతో నరికి చంపారు. బార్ లో మద్యం సేవించి బయటకు వస్తున్న యువకుడిని బయట కాపుకాసి ఉన్న నలుగురు వ్యక్తులు, ఒక్కసారిగా ఎటాక్ చేసి కత్తులతో నరికి చంపారు. మృతుడు చెరుకుపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ గా గుర్తించారు. ఓ మర్డర్ కేసులో జైలుశిక్ష అనుభవించి బయటకు వచ్చిన ప్రేమ్ కుమార్ తన భార్యను కలిసేందుకు వచ్చాడు. ఈ విషయం తెలియడంతో బులెట్ పై వెళ్తున్న వ్యక్తిని కారుతో వెంబడించిన దుండగులు దాడి చేసి చంపారు. 

బాబాయిని పెళ్లి చేసుకుందని..

Submitted by arun on Thu, 08/23/2018 - 09:55

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మేట్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను గొంతు కోసి హత్య చేశారు. వరుసకు బాబాయ్ అయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో సొంత తండ్రే కన్నకూతురిని గొంతు కోసి చంపాడు.  నాలుగేళ్ల క్రితం వరసకు బాబాయి అయ్యే వ్యక్తిని విజయ అనే యువతి ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె అత్త చనిపోవడంతో ఈ నడుమ తిరిగి ఇంటికి వచ్చింది. తన పరువు పోయిందనే కోపంతో తండ్రి కూతురుని కడతేర్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.

సొంత అల్లుడితో అత్త అఫైర్...కన్న కొడుకు అడ్డొస్తున్నాడని...

Submitted by arun on Mon, 08/13/2018 - 12:04

మానవతా విలువలు మాయమైపోతున్నాయనడానికి ఈ ఉదంతం ఒక గట్టి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అల్లుడు(కూతురు భర్త)తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తమ రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే కిరాయి హంతకులచేత హత్య చేయించింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకొంది. కిరాయి హంతకులకు ఇచ్చే డబ్బుల విషయంలో  తేడాలు రావడంతో  ఈ విషయం వెలుగు చూసింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 

శ్రీగౌతమి యాక్సిడెంట్‌ కేసులో కొత్త మలుపు

Submitted by arun on Tue, 06/26/2018 - 13:11

ఏడాదిన్నర క్రితం ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన దంగేటి శ్రీగౌతమి యాక్సిడెంట్‌ కేసు కొత్త మలుపు తిరిగింది. రోడ్డుప్రమాదంగా ఆనాడు కేసును క్లోజ్‌ చేసినా.... సీఐడీ రంగప్రవేశంతో అసలు నిజం బయటపడింది. శ్రీగౌతమిని పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు సీఐడీ గుర్తించింది. కొన్ని నెలలుగా దర్యాప్తు చేస్తోన్న సీఐడీ అధికారులు శ్రీగౌతమిది హత్యేనని తేల్చారు. శ్రీగౌతమి హత్యలో మొత్తం ఏడుగురి పాత్ర ఉన్నట్లు గుర్తించిన సీఐడీ వైజాగ్‌కి చెందిన ఇద్దర్ని నరసాపురానికి చెందిన ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఆర్మీ మేజర్ దారుణం: పెళ్లి చేసుకోలేదని మరో మేజర్ భార్య హత్య...

Submitted by arun on Mon, 06/25/2018 - 11:12

ఓ సైనిక మేజర్ భార్య హత్య కేసులో మరో సైనిక మేజర్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో శనివారం సాయంత్రం మేజర్ అమిత్ ద్వివేది భార్య శైలజ ద్వివేది మృతదేహం లభ్యమైంది. ఆమెను మేజర్ నిఘిల్ హండా గొంతు కోసి చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. శైలజ, నిఖిల్‌ హండాను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతోనే నిఖిల్‌ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆర్మీ మేజర్‌గా పనిచేస్తున్న నిఖిల్‌ హండాకు 2015లో నాగలాండ్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు.

షాకింగ్... కుటుంబంతో సహా బీజేపీ నేత దారుణ హత్య...

Submitted by arun on Mon, 06/11/2018 - 14:09

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పట్టణం ఆరాధనా నగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మృతులు బీజేపీ కార్యకర్త కమలాకర్ పవన్‌కర్‌తో సహా అతని కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి గొడవలే ఈ హత్యకు కారణం కావచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

హ‌స్తిన‌కు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసు

Submitted by arun on Thu, 02/08/2018 - 11:06

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును ఢిల్లీకి తీసుకెళ్లింది కాంగ్రెస్. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆ సంస్థ డైరెక్టర్ ను కోమటిరెడ్డి బ్రదర్స్ డిమాండ్ చేయనున్నారు. అలాగే, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఈ వ్యవహారాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాలని పార్టీ అధినేత రాహుల్ గాంధీని కోరనున్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యలో కేసులో అధికార టీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బద్నాం చేయనుంది. 

కాంగ్రెస్ విష సంస్కృతికే బొడ్డుపల్లి బలయ్యాడు: జగదీష్‌రెడ్డి

Submitted by arun on Tue, 02/06/2018 - 11:49

కాంగ్రెస్ అంతర్గత గొడవలతోనే నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ చరిత్ర హత్యలు, దాడుల రాజకీయాలమయమని విమర్శించారు. వారిలో వారే గ్రూపులు కడుతూ ఆధిపత్య రాజకీయాలతో ఏనాడూ అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. శ్రీనివాస్ హత్య విషయంలో కాంగ్రెస్ నేతల దుష్ప్రచారాన్ని ఖండించారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేలతో కలిసి విలేకరులతో మంత్రి మాట్లాడుతూ..

అనూష కేసులో వీడిన మిస్టరీ

Submitted by arun on Sat, 02/03/2018 - 13:44

హైదరాబాద్‌ నగరంలో సంచలం సృష్టించిన అనూష హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె ప్రియుడు మోతిలాలే హత్య చేశాడని నిర్ధారించారు. ఆధారాలతో సహా నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా సర్వారెడ్డిపల్లి తండా నివాసి మోతీలాల్ ఓ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అతనికి నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన అనూషతో ఆరేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించడంతో 9 నెలల క్రితం పెళ్లి నిశ్చయమైంది.