dental treatment

మరో వివాదంలో ఏపీ ప్రభుత్వం

Submitted by arun on Fri, 08/24/2018 - 08:50

ఏపీ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది.  ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి పంటి చికత్స కోసం రెండు లక్షల 88 వేల రూపాయలు విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సింగపూర్‌లోని ఎజూర్ డెంటల్ ఆసుపత్రిలో రూట్ కెనాల్ చికిత్స కోసం ఈ మొత్తాన్ని విడుదల చేశారు. అయితే రాష్ట్రంలోని ఏ కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా వేలల్లో బిల్లు అయ్యే  చిన్న సమస్యకు లక్షలు వెచ్చిస్తారా అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.  సోషల్ మీడియా వేదికగా జీవో ప్రతులను పెడుతూ యనమల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.