flipkart-superr-sale-discounts-best-selling-smartphones-tvs

ఫ్లిప్‌కార్ట్‌ 'సూపర్ సేల్‌' ఊహించని తగ్గింపు

Submitted by nanireddy on Thu, 08/23/2018 - 19:05

ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ ఫ్రీడం సేల్‌ ముగిసింది. ఈ సేల్ ముగిసిన రెండు వారాల్లోనే మరో ఆఫర్ ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ‘సూపర్ర్‌ సేల్‌’ పేరుతో  దీన్ని ప్రకటించింది. ఈ సేల్‌లో పాపులర్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లపై, టీవీలపై, ల్యాప్‌టాప్‌లపై, రిఫ్రిజిరేటర్లపై ఆకర్షణీయమైన డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది.  ఆగస్టు 25 నుంచి ఈ సేల్‌ లైవ్‌లోకి  వస్తుంది.  ఆసుస్‌, డెల్‌, ఏసర్‌ వంటి ల్యాప్‌టాప్‌ బ్రాండ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. అలాగే ఈ సేల్ లో ల్యాప్‌టాప్‌లపై కొనుగోలుదారుడు అదనంగా 2వేల రూపాయల తగ్గింపును పొందవచ్చు.