Pre Elections

కారు దూకుడుకు బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్ నేతల వ్యూహాలు

Submitted by arun on Fri, 09/07/2018 - 11:02

ముందస్తు అసెంబ్లీ రద్దు, అభ్యర్ధుల ఎంపికతో రయ్‌మని దూసుకెళుతున్న కారుకు బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్‌కు ధీటుగా తాము కూడా అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తామన్న కాంగ్రెస్ అగ్ర నేతలు అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలపై దృష్టి సారించారు. సీనియర్ నేత జానారెడ్డి ఇంట్లో తాజా మాజీలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్‌లు కాసేపట్లో భేటి కానున్నారు. రాష్ట్రంలో సోనియా, రాహుల్ గాంధీ పర్యటనలు, టీఆర్ఎస్‌ను క్షేత్ర స్ధాయి నుంచి ఎదుర్కొనే వ్యూహాలపై చర్చించనున్నారు. ఇదే సమయంలో పీసీసీ కార్యవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

అసెంబ్లీ రద్దు ఆలోచనలకు ఎక్కడ బీజం పడింది...?

Submitted by arun on Fri, 09/07/2018 - 09:08

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమయ్యాయి. అయితే తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న కేసీఆర్ ఆలోచనలకు ఎక్కడ బీజం పడింది. గులాబీ బాస్‌ను ముందస్తుకి నడిపించిన పరిస్థితులు ఏంటి..? అసలు అసెంబ్లీని రద్దు చేసినంత మాత్రాన ముందస్తు ఎన్నికలు జరుగుతాయా..? ముందస్తుకు వెళితే గెలుపు ఖాయమనే నిర్ణయానికి టీఆర్ఎస్ అధినేత ఎలా వచ్చారు ప్రస్తుతం.. ఇవే అంశాలపై విస్తృత చర్చ జరుగుతోంది.

సభ రద్దు సంప్రదాయాలపై కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు...అనుకున్న సమయానికి కొత్త సర్కార్ ఏర్పడేలా వ్యూహ‍ం

Submitted by arun on Thu, 09/06/2018 - 09:32

అసెంబ్లీ రద్దుకు సమాయత్తమవుతున్న కేసీఆర్ ఆ ప్రక్రియపై సుదీర్ఘ కసరత్తు చేశారు. శాసన సభను ఏ పద్ధతిలో రద్దు చేయాలి..? అసెంబ్లీ రద్దుకు ఏయే కారణాలను చూపాలి..? అసెంబ్లీ రద్దుపై కోర్టు చిక్కులు ఎదురు కాకుండా ఏం చేయాలనే అంశాలపై ముఖ్యమంత్రి సుదీర్ఘ మంతనాలు జరిపారు.  

50 రోజులు.. 100 సభలు

Submitted by arun on Wed, 09/05/2018 - 14:01

తెలంగాణలో ముందస్తుపై ఎన్నికలపై టీఆర్ఎస్‌ వేగంగా  పావులు కదుపుతోంది. శాసనసభ రద్దుపై మంత్రివర్గం రేపు తుది నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించి రేపటికల్ల హైదరాబాద్ చేరుకోవాలంటూ మంత్రులను సీఎం ఆదేశించారు. దీంతో ఇప్పటికే పలువురు మంత్రులు  హైదరాబాద్ చేరుకున్నారు.  రేపు మధ్యాహ్నం 2 గంటలకు భేటి కానున్న  మంత్రి వర్గం అసెంబ్లీని  రద్దు చేస్తూ ఏక వాక్య తీర్మానాన్ని ఆమోదించనున్నట్టు సమాచారం. అనంతరం సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి ఇదే అంశాన్ని వివరించనున్నారు. ముందస్తు ఎన్నికలపై ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన టీఆర్ఎస్ ఎన్నికలు జరిగే లోపు  100 నియోజకవర్గాల్లో సభలకు సన్నాహాలు చేస్తున్నారు.

ముందస్తు ఎన్నికలు....ప్రకటించిన మంత్రి హరీష్‌రావు

Submitted by arun on Wed, 09/05/2018 - 13:50

అసెంబ్లీ రద్దు ముహూర్తం ఖాయమంటూ ఊహగానాలు జోరుగా వినిపిస్తున్న సమయంలో ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ మంత్రి హరీష్‌ రావు పరోక్షంగా ప్రకటించారు. ఎల్లుండి హుస్నాబాద్ నిర్వహిస్తున్న బహిరంగ సభను సీఎం కేసీఆర్ సెంటి మెంట్‌తోనే చేపట్టారన్నారు. గతంలో కూడా ఇక్కడి నుంచే ప్రచారం చేపట్టి విజయం సాధించామన్న ఆయన ఎన్నికల్లో వంద నియోజకవర్గాల్లో తామే విజయం సాధిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు నూటికి నూరు శాతం టీఆర్ఎస్‌ ఆశీర్వదిస్తారని ఆ‍యన అన్నారు. హుస్నాబాద్‌లో బహిరంగ సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 

అలర్ట్ అయిన కాంగ్రెస్... ముఖేష్ గౌడ్ ఇంట్లో నేతల భేటీ, జానారెడ్డి గైర్హాజరు!

Submitted by arun on Wed, 09/05/2018 - 10:55

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారైందనే ఊహగానాల నేపధ్యంలో  కాంగ్రెస్ నేతలు భవిష్యత్ పరిణామాలపై దృష్టి సారించారు. ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దుపై అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ నివాసంలో సాయంత్రం ఐదు గంటలకు కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు సీనియర్ నేతలు డీకే అరుణ, కోమటిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరుకానున్నారు.  ముఖేష్ గౌడ్  పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో  ఆయన నివాసంలోనే చర్చ జరగడం ఆసక్తిగా మారింది.

అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారు...

Submitted by arun on Wed, 09/05/2018 - 09:34

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారైందా..? ముందస్తు ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు సడుతున్నాయా..? వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. రేపు ఉదయం ఆరున్నరకి జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సీఎం సడన్‌ డెసీషన్‌తో...జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలకు...

Submitted by arun on Fri, 08/31/2018 - 10:12

ఆ మంత్రులకు ముందస్తు పేరు చెబితేనే ముచ్చెమటలు పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నా త్వరితగతిన ఎన్నికలకు వెళ్లాలంటేనే వణుకుతున్నారు. పార్టీ పెద్దలు ముందస్తు మూడ్‌తో అలర్ట్‌ అవుతుండగా ఆ మంత్రులకు అదే టెన్షన్‌ పుట్టిస్తోంది. ఎవరా మంత్రులు..? ఎన్నికలకు వెళ్లేందుకు భయమెందుకు..? 

తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు...అభ్యర్ధులను ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌...?

Submitted by arun on Fri, 08/24/2018 - 14:16

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌కు వేర్వేరుగా ఎన్నికలు జరపాలని భావిస్తున్నారు.  ఈ వాదనను మంత్రులతో పాటు సీనియర్లు కూడా  సమర్ధిస్తున్నట్టు సమాచారం.  ప్రస్తుతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా ఉంది ఇదే సమయంలో బీజేపీపై జాతీయ స్ధాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని  కేసీఆర్ భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో  ఏకకాలంలో రెండు ఎన్నికలు జరిగితే ఆ ప్రభావం ఎమ్మెల్యే ఎన్నికలపై పడుతుందని నిర్ధారణకు వచ్చిన  కేసీఆర్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించడమే మంచిదని నిర్ణయించుకున్నారు. షెడ్యూల్ ప్రకారమయితే  వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌ లలో ఎన్నికలు జరుగుతాయి.

ముందస్తుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతున్నట్టు సమాచారం...ఢిల్లీ వెళ్లిన కేటీఆర్, రాజీవ్‌శర్మ

Submitted by arun on Thu, 08/23/2018 - 13:49

ముందస్తుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయిపోతున్నట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి మంత్రులతో ఇదే అంశంపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం కేసీఆర్ అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ముందస్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మెజార్టీ మంత్రులు ముందస్తు అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే, ఇవాళ తెల్లవారుజామునే మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వ ము‌ఖ్య సలహాదారు రాజీవ్‌శర్మతో కలిసి ఢిల్లీ వెళ్లారు. అక్కడ కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ముందస్తుపై చర్చించారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని అడిగి తెలుసుకున్నారు.