స్వాతి

విజయవాడలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా

Submitted by lakshman on Fri, 12/15/2017 - 11:30

విజయవాడ పైడురుపాడు దగ్గర  రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది.  ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని బెజవాడ ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు 

సుధాకర్ రెడ్డి అంటే స్వాతికి ఎందుకు ఇష్టం లేదంటే

Submitted by lakshman on Fri, 12/15/2017 - 11:28

సుధాకర్ రెడ్డి హత్య కేసు విచారణలో స్పీడు పెంచారు పోలీసులు. రాజేష్ ను అరెస్టు చేసిన పోలీసులు, అతను ఇచ్చిన వివరాల ఆధారంగా సుధాకర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. మహబూబ్ నగర్ నుంచి ప్రత్యేక క్లూస్ టీంను రప్పించి.. రాజేష్ సమక్షంలోనే సుధాకర్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో కేసుకు సంబంధించి పలు కీలక ఆధారాలను సేకరించారు.  
మొదట జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రాజేష్ ను సుదీర్ఘంగా ప్రశ్నించిన పోలీసులు.. స్వాతితో ఎప్పటి నుంచి పరిచయం ఉంది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సుధాకర్ రెడ్డిని చంపడానికి వాడిన మత్తు ఇంజెక్షన్, తలపై కొట్టిన రాడ్డు కోసం గాలిస్తున్నారు. 

స్వాతి బతికుండగానే కర్మకాండలు

Submitted by lakshman on Fri, 12/15/2017 - 11:27

వివాహేతర సంబంధాలు జీవితాల్ని ఎలా నాశనం చేస్తాయో..? కుటుంబాల పరువును ఎలా బజారుకీడుస్తాయో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్రషర్‌ వ్యాపారి సుధాకర్‌రెడ్డి హత్య కేసును చూస్తే తెలుస్తోంది. భర్త తనని పట్టించుకోవడంలేదని ఆవేదనో..?రాజేష్ పై ఉన్న వ్యామోహమో వెరసీ పిల్లలు దర్శిత్‌ (7), హర్షిత(4) అమ్మానాన్నల ప్రేమకు దూరమయ్యేలా చేసింది. భర్తను వదిలించుకోవాలని..ప్రియుడు రాజేష్ కు దగ్గర అవ్వాలని వేసిన  పన్నాగంలో  నవంబరు 27న  కొడుకు దర్శిత్‌ (7) పుట్టిన రోజే తండ్రి సుధాకర్ రెడ్డి హత్యకు గురికావడం ప్రతీ ఒక్కరిని కలిచి వేస్తుంది.