swathi

మరోసారి తెరమీదకు వచ్చిన స్వాతి కేసు

Submitted by arun on Mon, 07/30/2018 - 14:57

మానవత్వాన్ని మంటగలుపుతూ కట్టుకున్న భర్తనే దారుణంగా హతమార్చిన స్వాతి ఉదంతం మరోసారి సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ఈ కేసులో ఏ2గా ఉన్న స్వాతికి మూడు రోజుల క్రితం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వివాహా సంబంధాన్ని అపహాస్యం చేస్తూ విశ్వాస ఘాతుకానికి పాల్పడిన స్వాతి తరపున వాదించేందుకు ఏ ఒక్క న్యాయవాది ముందుకు రాలేదు. దీంతో న్యాయసేవా సంస్ధ తరపున ఆమె బెయిల్ కోసం పోరాడారు. రెండు సార్లు బెయిల్ తిరస్కరణకు గురైన తరువాత మూడో సారి స్వాతికి బెయిల్ లభించింది. జైలు నుంచి బయటకు వచ్చిన స్వాతిని ఆదరించి అక్కున చేర్చుకునే వారు ఒక్కరూ కూడా రాకపోవడంతో కన్నీరు పెట్టుకుంది.

కామా తురాణం న భయం న లజ్జ

Submitted by arun on Sat, 07/28/2018 - 11:47

ప్రియుడి మోజులో అప్పుడు,

ఆలోచించేను ఎన్నో తప్పుడు,

అంతా అయిపోయి ఇక ఇప్పుడు,

ఎంత ఏడ్చినా ఆపైవాడు ఒప్పడు.శ్రీ.కో

ప్రియుడి కోసం భర్తను చంపిన నాగర్ కర్నూల్ స్వాతి: ఏ దిక్కూ లేక చివరికిలా...

Submitted by arun on Fri, 07/27/2018 - 13:14

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడి సాయంతో హత్యచేసిన నాగర్ కర్నూల్ మహిళ స్వాతి గురించి తెలిసిందే. భర్త సుధాకర్ రెడ్డిని హతమార్చడమే కాకుండా ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి భర్త స్థానంలోకి అతడిని తీసుకురావాలని పథకం వేసింది. కానీ అనూహ్యంగా గుట్టు బయటపడటంతో అడ్డంగా దొరికిపోయింది. చివరకు ఇద్దరూ కటకటాల పాలయ్యారు. 2017 డిసెంబర్‌ 11న స్వాతిని పాలమూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే ఆమెకు ఎనిమిది నెలల తర్వాత బైయిల్ వచ్చినా బైటికి రాలూని పరిస్థితి ఏర్పడింది.

స్వాతి నుంచి ప్రాణహాని ఉంది

Submitted by arun on Thu, 12/28/2017 - 10:39

స్వాతి నుండి పిల్లలు వర్షిణి, దర్శిత్ రెడ్డిలకు ప్రాణహని ఉందని సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌కు వినతి పత్రం సమర్పించారు. నాగర్‌కర్నూల్‌లో భార్య, ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురైన కాంట్రాక్టర్‌ సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు, బంధువులు బుధవారం జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌ను కలిశారు. సుధాకర్‌రెడ్డి హత్యతో తాము వీధినపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజేశ్‌ వైద్య ఖర్చులు పెట్టించడంతో ఆర్థికంగా చితికిపోయామని తెలిపారు. నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.

భర్త కోసం పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకున్న స్వాతి

Submitted by arun on Sun, 12/24/2017 - 11:46

సంచలనం సృష‌్టించిన సుధాకర్ రెడ్డి హత్య కేసును నాగర్ కర్నూలు పోలీసులు వేగవంతం చేశారు. హత్యకేసులో రెండో నిందితురాలు, మృతుని భార్య స్వాతిని నాగర్‌కర్నూల్‌ జిల్లా పోలీసులు మరోమారు విచారించారు. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా జైలు నుంచి ఉదయం 10.30 గంటలకు అదుపులోకి తీసుకొన్న పోలీసులు 11.30 గంటలకు నాగర్‌కర్నూల్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఠాణాలో పోలీసులు సుమారు 5 గంటల పాటు ప్రత్యేక గదిలో విచారించారు. హత్యకు సంబంధించి పోలీసులు స్వాతిపై ప్రశ్నలు సంధించగా ఆమె కొన్నింటికి జవాబిచ్చినట్లు తెలిసింది.
 

విజయవాడలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా

Submitted by lakshman on Fri, 12/15/2017 - 11:30

విజయవాడ పైడురుపాడు దగ్గర  రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది.  ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని బెజవాడ ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు 

సుధాకర్ రెడ్డి అంటే స్వాతికి ఎందుకు ఇష్టం లేదంటే

Submitted by lakshman on Fri, 12/15/2017 - 11:28

సుధాకర్ రెడ్డి హత్య కేసు విచారణలో స్పీడు పెంచారు పోలీసులు. రాజేష్ ను అరెస్టు చేసిన పోలీసులు, అతను ఇచ్చిన వివరాల ఆధారంగా సుధాకర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. మహబూబ్ నగర్ నుంచి ప్రత్యేక క్లూస్ టీంను రప్పించి.. రాజేష్ సమక్షంలోనే సుధాకర్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో కేసుకు సంబంధించి పలు కీలక ఆధారాలను సేకరించారు.  
మొదట జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రాజేష్ ను సుదీర్ఘంగా ప్రశ్నించిన పోలీసులు.. స్వాతితో ఎప్పటి నుంచి పరిచయం ఉంది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సుధాకర్ రెడ్డిని చంపడానికి వాడిన మత్తు ఇంజెక్షన్, తలపై కొట్టిన రాడ్డు కోసం గాలిస్తున్నారు. 

స్వాతి బతికుండగానే కర్మకాండలు

Submitted by lakshman on Fri, 12/15/2017 - 11:27

వివాహేతర సంబంధాలు జీవితాల్ని ఎలా నాశనం చేస్తాయో..? కుటుంబాల పరువును ఎలా బజారుకీడుస్తాయో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్రషర్‌ వ్యాపారి సుధాకర్‌రెడ్డి హత్య కేసును చూస్తే తెలుస్తోంది. భర్త తనని పట్టించుకోవడంలేదని ఆవేదనో..?రాజేష్ పై ఉన్న వ్యామోహమో వెరసీ పిల్లలు దర్శిత్‌ (7), హర్షిత(4) అమ్మానాన్నల ప్రేమకు దూరమయ్యేలా చేసింది. భర్తను వదిలించుకోవాలని..ప్రియుడు రాజేష్ కు దగ్గర అవ్వాలని వేసిన  పన్నాగంలో  నవంబరు 27న  కొడుకు దర్శిత్‌ (7) పుట్టిన రోజే తండ్రి సుధాకర్ రెడ్డి హత్యకు గురికావడం ప్రతీ ఒక్కరిని కలిచి వేస్తుంది.