rajesh

బెయిల్‌పై విడుదలైన స్వాతి

Submitted by arun on Sat, 07/28/2018 - 08:41

ప్రియుడి మోజులో పడి భర్తను కిరాతకంగా హతమార్చిన నాగర్ కర్నూల్ స్వాతి బెయిల్‌పై విడుదలయ్యింది. 8 నెలల తర్వాత ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. మహబూబ్‌నగర్ జైలు నుంచి విడుదల చేశారు. అయితే ఆమెను తీసుకెళ్లడానికి కుటుంబసభ్యులు నిరాకరించడంతో.. ఆమెను స్టేట్ హోంకు తరలించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈనెల 16నే ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. ఇద్దరు వ్యక్తుల జామీను (పూచీకత్తు) అవసరం ఉండగా.. ఎవరూ ముందుకు రాక ఆమె జైలులోనే ఉండాల్సి వచ్చింది.

Tags

ప్రియుడి కోసం భర్తను చంపిన నాగర్ కర్నూల్ స్వాతి: ఏ దిక్కూ లేక చివరికిలా...

Submitted by arun on Fri, 07/27/2018 - 13:14

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడి సాయంతో హత్యచేసిన నాగర్ కర్నూల్ మహిళ స్వాతి గురించి తెలిసిందే. భర్త సుధాకర్ రెడ్డిని హతమార్చడమే కాకుండా ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి భర్త స్థానంలోకి అతడిని తీసుకురావాలని పథకం వేసింది. కానీ అనూహ్యంగా గుట్టు బయటపడటంతో అడ్డంగా దొరికిపోయింది. చివరకు ఇద్దరూ కటకటాల పాలయ్యారు. 2017 డిసెంబర్‌ 11న స్వాతిని పాలమూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే ఆమెకు ఎనిమిది నెలల తర్వాత బైయిల్ వచ్చినా బైటికి రాలూని పరిస్థితి ఏర్పడింది.

‘సావిత్రి పెళ్లి చేసుకుని తప్పుచేశారు’

Submitted by arun on Thu, 05/24/2018 - 17:33

దిగ్గజ నటి సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’ ఇటు తెలుగులో, ‘నడిగయర్‌ తిలకం’ పేరుతో అటు తమిళ్‌లో సూపర్‌ హిట్‌ టాక్‌తో ప్రదర్శితమౌతోంది. అయితే సావిత్రి ఎదుగుదల.. పతనాన్ని కూలంకశంగా చూపించిన ఈ చిత్రంపై పలువురు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. తన తండ్రిని చిత్రంలో తప్పుడుగా చూపించారంటూ కమల సెల్వరాజ్‌(జెమినీ మొదటి భార్య అలమేలు కుమార్తె) మహానటిపై పెదవి విరిచారు. ఇప్పుడు ఈ చిత్రంపై జెమినీ గణేషన్‌ సన్నిహితుడు, సీనియర్‌ నటుడు రాజేష్‌ కూడా స్పందించారు. జెమిని గణేశన్‌ను సావిత్రి పెళ్లి చేసుకోవడం ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయమని అంటున్నారు గణేశన్‌ సన్నిహితుడు రాజేశ్‌.

విజయవాడలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా

Submitted by lakshman on Fri, 12/15/2017 - 11:30

విజయవాడ పైడురుపాడు దగ్గర  రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది.  ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని బెజవాడ ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు 

సుధాకర్ రెడ్డి అంటే స్వాతికి ఎందుకు ఇష్టం లేదంటే

Submitted by lakshman on Fri, 12/15/2017 - 11:28

సుధాకర్ రెడ్డి హత్య కేసు విచారణలో స్పీడు పెంచారు పోలీసులు. రాజేష్ ను అరెస్టు చేసిన పోలీసులు, అతను ఇచ్చిన వివరాల ఆధారంగా సుధాకర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. మహబూబ్ నగర్ నుంచి ప్రత్యేక క్లూస్ టీంను రప్పించి.. రాజేష్ సమక్షంలోనే సుధాకర్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో కేసుకు సంబంధించి పలు కీలక ఆధారాలను సేకరించారు.  
మొదట జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రాజేష్ ను సుదీర్ఘంగా ప్రశ్నించిన పోలీసులు.. స్వాతితో ఎప్పటి నుంచి పరిచయం ఉంది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సుధాకర్ రెడ్డిని చంపడానికి వాడిన మత్తు ఇంజెక్షన్, తలపై కొట్టిన రాడ్డు కోసం గాలిస్తున్నారు. 

స్వాతి బతికుండగానే కర్మకాండలు

Submitted by lakshman on Fri, 12/15/2017 - 11:27

వివాహేతర సంబంధాలు జీవితాల్ని ఎలా నాశనం చేస్తాయో..? కుటుంబాల పరువును ఎలా బజారుకీడుస్తాయో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్రషర్‌ వ్యాపారి సుధాకర్‌రెడ్డి హత్య కేసును చూస్తే తెలుస్తోంది. భర్త తనని పట్టించుకోవడంలేదని ఆవేదనో..?రాజేష్ పై ఉన్న వ్యామోహమో వెరసీ పిల్లలు దర్శిత్‌ (7), హర్షిత(4) అమ్మానాన్నల ప్రేమకు దూరమయ్యేలా చేసింది. భర్తను వదిలించుకోవాలని..ప్రియుడు రాజేష్ కు దగ్గర అవ్వాలని వేసిన  పన్నాగంలో  నవంబరు 27న  కొడుకు దర్శిత్‌ (7) పుట్టిన రోజే తండ్రి సుధాకర్ రెడ్డి హత్యకు గురికావడం ప్రతీ ఒక్కరిని కలిచి వేస్తుంది.