Telangana elections

మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావాలి: మోహన్‌బాబు

Submitted by chandram on Sun, 11/11/2018 - 15:46

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలని సినీ నటుడు, ఫిల్మ్ నగర్ దైవసన్నిధానం ఆలయ కమిటీ అధ్యక్షుడు మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిలింనగర్ దైవసన్నిధానంలో ఆలయ అర్చకులు, సిబ్బందికి ఆయన వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తమ్ముడూ అని సంబోధిస్తూ మోహన్‌బాబు ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు.
 

ఆ ముగ్గురిని ఓడించాలి..

Submitted by arun on Mon, 11/05/2018 - 11:53

తెలంగాణ ఎన్నికల కోసం ఏర్పాటైంది మహాకూటమి కాదని అది ఈస్ట్‌ ఇండియా కంపెనీ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. సంగారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన మోడీ, రాహుల్‌, చంద్రబాబు కలిసే పనిచేస్తున్నారని వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్‌ సర్కారు ముస్లీంలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలంగాణలో మత సామరస్యం ఉందన్నారు. గంగా జమునా తెహిజిమ్‌ సంస్కృతి మన ప్రాంతానికి సొంతమన్నారు. 

మహాకూటమిలో సీట్ల పంపకాలు ఖరారు ?

Submitted by arun on Sat, 11/03/2018 - 17:00

ప్రతిపక్ష మహాకూటమికి సంబంధించి సీట్ల పంపకాల విషయంలో ఎట్టకేలకు కొలిక్కివచ్చినట్లే తెలుస్తోంది. కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ కలిసి ప్రజాకూటమిగా ఏర్పడి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతుందని తెలిసిన విషయమే అయితే కూటమిలోని పార్టీలకు సీట్ల పంపకాల వ్యవహారం కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద సమ్యసగా ఏర్పడింది. ఇదే క్రమంలో మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన సీట్లపై మొత్తానికి కాంగ్రెస్‌ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉండగా, 95 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. మిగతా 24 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించనుంది.

తెలంగాణలో పోటీకి సిద్ధమైన జనసేన...24 స్థానాలకు పోటీ...

Submitted by arun on Sat, 10/13/2018 - 12:26

తెలంగాణపై జనసేన అధినేత పవన్‌ దృష్టి పెట్టారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్‌ నిర్ణయించారు. 24 స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీలో నిలపాలని పవన్‌ భావిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ, అభ్యర్థులకు సంబంధించి నాలుగైదు రోజుల్లోగా ఫుల్‌ క్లారిటీ రానుంది.

దారి మార్చిన జగన్‌...తెలంగాణ ఎన్నికలు...

Submitted by arun on Sat, 10/13/2018 - 10:15

తెలంగాణ ఎన్నికలు ముగిసేవరకు ఏపీలో జగన్ పాదయాత్ర కొనసాగనుందా? మరికొద్ది రోజుల్లో ముగియాల్సిన జగన్‌ పాదయాత్రను పొడిగించబోతున్నారా? తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో ప్రభావం చూపుతాయని జగన్ భావిస్తున్నారా? అసలు జగన్‌ వ్యూహం ఏంటి? 

ఓటమి భయంతోనే ముందస్తు- అమిత్‌షా

Submitted by santosh on Wed, 10/10/2018 - 17:29

మోడీ హవాలో కొట్టుకుపోతామనే భయంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. కొడుకునో, కూతురునో సీఎం చేయాలని కేసీఆర్ తహతహలాడుతున్నారని విమర్శించారు.  ఆయన ఆశలు నెరవేరవన్నారు అమిత్ షా. బీసీలకు ఇబ్బందిగా మారే ముస్లింల 12 శాతం రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందన్నారు. 
 

నోటాకు ఎందుకు టాటా? అసలు ఏముంది ఆ మూవీలో!?

Submitted by arun on Thu, 10/04/2018 - 16:27

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నోటా మూవీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు మరో వైపు నోటా మూవీని అడ్డుకునేందుకు అడుగడుగునా ప్రయత్నాలు చేస్తున్నాయి. అసలు నోటాకు ఎందుకు నో చెబుతున్నారు ? నిజంగానే ఓ పార్టీకి అనుకూలంగానే ఈ చిత్రాన్ని నిర్మించారా ? మూవీ విడుదలయితే శాంతి భద్రతలు తలెత్తే ప్రమాదముందా ? లేక ఈ చిత్రం నిజంగానే ప్రేక్షకులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయా ? 

గెలుపు గుర్రాలకే టికెట్లిస్తాం: ఉత్తమ్

Submitted by arun on Sat, 09/22/2018 - 17:33

ఆశావహుల నుంచి ధరఖాస్తులకు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ విధించిన గడువు ఇవాళ్టితో ముగిసింది. ఇవాళ్టి వరకు మొత్తం వెయ్యీ 76 ధరఖాస్తులు వచ్చాయి. ఇవాళ్టినుంచి వాటిని పరిశీలించనున్నారు. ఆశావహుల సామాజిక, ఆర్థిక, స్థానిక బలాబలాలపై అంచనా వేస్తున్నారు. నేటి నుంచి అభ్యర్థుల స్క్రూటినీ చేయనున్నారు. నియోజకవర్గానికి ముగ్గురిని ఎంపిక చేసి.. స్క్రీనింగ్ కమిటీకి పంపనున్నట్లు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ స్పష్టం చేశారు. సర్వే ఫలితాల ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సీట్ల సర్దుబాటు తర్వాత అభ్యర్థులను ప్రకటించనున్నామని ఉత్తమ్ తెలిపారు.
 

సీఎం కేసీఆర్‌పై అమిత్‌ షా ఫైర్‌... అందుకే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు

Submitted by arun on Sat, 09/15/2018 - 17:19

ముందస్తు ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఆయన మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ ఉదయం 11 గంటలా 30 నిముషాలకు బేగంపేట్‌ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. ఆయనకు రాష్ట్రానికి చెందిన కాషాయ నాయకులు ఘన స్వాగతం పలికారు. 

శ్రీరస్తు.. శుభమస్తు... ముందస్తు!! గెలుపు ధీమాపై ఇదీ అసలు లెక్క!

Submitted by santosh on Sat, 09/15/2018 - 11:54

ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలో కేసీఆర్‌కు తనదైన వ్యూహముంది. తప్పనపరిస్థితుల్లో కాంగ్రెస్సూ సిద్దమైంది. మిగతా రాజకీయ పార్టీలూ సై అంటున్నాయి. కానీ ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలకూ, ఈ ఎన్నికలపై పక్కాగా ఓ లెక్కుంది. ఏంటది? మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌‌లో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. అయితే అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఓ రేంజ్‌లో వెల్లువెత్తుతోంది. ఉప ఎన్నికల ఫలితాలే కాదు, తాజా సర్వేలు కూడా కమలానాథులకు టెన్షన్‌ పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌ పెద్దల్లో జోష్‌ నింపుతున్నాయి. త్వరలో జరగనున్న ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించి, లోక్‌సభ పోరుకు సమరోత్సాహంతో వెళ్లాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.