telangana cabinet meet

ప్రారంభమైన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం

Submitted by arun on Thu, 09/06/2018 - 13:07

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులంతా హాజరయ్యారు. అసెంబ్లీ రద్దుపై కాసేపట్లో మంత్రి వర్గం నిర్ణయం తీసుకోనుంది. శాసనసభను రద్దు చేస్తున్నట్టు ఏక వాక్య తీర్మానం చేసిన అనంతరం మంత్రులతో కలిసి సీఎం కేసీఆర్ రాజ్‌భవన్ వెళ్లనున్నారు.  గవర్నర్‌తో భేటి అయి అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని తెలియజేయనున్నారు. అనంతరం మంత్రులతో కలిసి గన్ పార్క్ చేరుకోనున్న ఆ‍యన అమర వీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించనున్నారు. అక్కడి తెలంగాణ భవన్‌కు చేరుకుని తాజా రాజకీయ పరిణామాలపై మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 

ప్రగతిభవన్‌కు రావాలంటూ మంత్రులకు సీఎం ఆదేశం

Submitted by arun on Thu, 09/06/2018 - 12:25

అసెంబ్లీ రద్దుకు రంగం సిద్ధమైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రి వర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి గంట ముందే ప్రగతి భవన్ చేరుకోవాలంటూ సీఎంఓ నుంచి మంత్రులకు పిలుపు అందింది. మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైన వెంటనే అసెంబ్లీ రద్దుపై చర్చించనున్నారు. ఏక వ్యాక్య తీర్మానంతో  అసెంబ్లీని రద్దు చేస్తూ తీర్మానించే అవకాశాలున్నాయి. అనంతరం  సీఎం కేసీఆర్ నేరుగా గవర్నర్ ను కలిసి ఇదే విషయాన్ని వెల్లడించనున్నారు.  మధ్యాహ్నం రెండున్నర గంటలకు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

ముందస్తు సంకేతాలతో వేడెక్కుతోన్న తెలంగాణ....మంత్రులతో సీఎం అత్యవసర భేటీ

Submitted by arun on Wed, 08/22/2018 - 10:20

ముందస్తు సంకేతాలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. డిసెంబర్‌లోనే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన నిర్ణయాలను సిద్ధమవుతున్నారు. కేవలం రాజకీయ అంశాలే ప్రధాన అజెండాగా ఈరోజు కీలక సమావేశం జరగబోతోంది. మంత్రులతో అత్యవసరంగా సమావేశం కాబోతున్న కేసీఆర్‌‌ ముందస్తు వ్యూహాన్ని ఖరారుచేసే అవకాశం కనిపిస్తోంది.