ram mandir in ayodhya

ఆయోధ్య రామమందిరం కోసం 500 జిల్లాల్లో బహిరంగ సభలు

Submitted by arun on Tue, 11/06/2018 - 11:02

రామ మందిర నిర్మాణానికి చట్టం తిసుకురావలని కోరుతూ 500 జిల్లాల్లో భారీబహిరంగ సభలు నిర్వహించాలని అఖిల భారత సంత్‌ సమితి తీర్మానించింది. ఇందు కోసం ఈనెల 25 నుంచి జన సమీకరణ చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో ముగిసిన సంత్‌ సమ్మేళనంలో అఖిలభారత సంత్ సమితి నిర్ణయం తీసుకుంది. కాగా రామ మందిర నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి మౌనం పాటిస్తున్నప్పటికీ కొంత మంది కేంద్ర మంత్రులు మాత్రం బహిరంగంగానే పలురకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. గిరిరాజ్‌ సింగ్‌, ఉమాభారతిలకు ఇప్పుడు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్‌ అథవాలే తోడయ్యారు.

అయోధ్య‌లో 151 మీటర్ల ఎత్తున్న రాముడి విగ్ర‌హం

Submitted by arun on Sat, 11/03/2018 - 12:25

గుజ‌రాత్‌లోని న‌ర్మ‌దా న‌దిపై 182 మీటర్ల ఎత్తున్న స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ విగ్ర‌హాన్ని మోదీ ఆవిష్క‌రించిన విషయం తెలిసిందే, ఇదే తరహాలో అయోధ్య‌లో రాముడి భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటుకు భారీ సన్నాహాలు చేస్తున్నారు.. స‌ర‌యూ న‌ది తీరంలో సుమారు 151 మీట‌ర్ల ఎత్తున్న రాముడి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర అధికారులు వెల్లడించారు.. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ దీనికి సంబంధించిన వివరాలు దీపావ‌ళి రోజున ప్ర‌క‌ట‌న వెల్లడించనున్నారు.. భూప‌రీక్ష నిర్వ‌హించకే విగ్ర‌హాన్ని ఎక్క‌డ ఏర్పాటు చేయాలో నిర్ణ‌యిస్తామ‌ని అధికారులు స్పష్టంచేశారు..