revanth reddy

ఆ 5కోట్ల‌లో నా ప్ర‌మేయం లేదు : మ‌త్త‌య్య

Submitted by lakshman on Sat, 02/24/2018 - 04:31

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసు రోజుకో మ‌లుపు తిరుగుతుంది. ఈ కేసు సుప్రీం కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూస‌లేం మ‌త్త‌య్య  అత్య‌న్నుత న్యాయ స్థానానికి లేఖ రాయడం ఆస‌క్తిక‌రంగా మారింది. దీంతో ఆ కేసు ఏమ‌లుపు తిరుగుతుందోన‌ని తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. 

త్వరలో రేవంత్‌ పాదయాత్ర

Submitted by arun on Thu, 02/15/2018 - 12:18

పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెకుటల సాధనే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్‌-కృష్నా రైల్వేలైన్‌, నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతలకు నిధుల కేటాయింపుతో పాటు పలుడిమాండ్ల సాధనకు కొడంగల్‌ నుంచి హైదరాబాద్‌ వరకు 120 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు. బంరాస్‌ పేట, పరిగి,వికారాబాద్‌,. మన్నెగూడ,చేవేళ్ల, మెయినాబాద్‌ మీదుగా ఈ యాత్ర సాగునుంది.

మన ముఖ్యమంత్రికి ‘కుంభకర్ణ అవార్డు’ ఇవ్వాలి: రేవంత్ రెడ్డి

Submitted by arun on Sat, 02/03/2018 - 13:30

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఒంటికాలిపై లేచే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతకొద్ది రోజులుగా కేసీఆర్ సచివాలయానికి రాకుండా ఇంటి నుంచే వ్యవహారాలు చక్కబెట్టడంపై రేవంత్ విమర్శలు గుప్పిస్తూ ఓ ట్వీట్ చేశారు.‘సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టకుండా, ఇంటి నుంచి నిద్రావస్థలో పని చేస్తూ ఏడాది కాలం పూర్తి చేసుకున్న మన ముఖ్యమంత్రికి ‘కుంభకర్ణ అవార్డు’ ఇవ్వాలి.. స్లీపింగ్ మోడ్ సీఎం @ తెలంగాణ సీఎంఓ’ అంటూ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

రేవంత్ రెడ్డి దూకుడుకు టీఆర్ఎస్ క‌ళ్లెం..?

Submitted by lakshman on Mon, 01/29/2018 - 11:11

టీ కాంగ్ లీడ‌ర్ రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారా..? ఆరోప‌ణ‌లో ప్ర‌త్యారోప‌ణ‌లతో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతున్న రేవంత్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీఆర్ఎస్ నేత‌లు ఆపార్టీ అధినేత కేసీఆర్ తో సంప్ర‌దింపలు జ‌రిపార‌ని టాక్ . 

సీఎం కేసీఆర్ స‌హ‌జ‌ నటుడైతే పవన్ సినీనటుడు

Submitted by lakshman on Fri, 01/26/2018 - 22:40

తెలంగాణ ప‌ర్య‌ట‌న ముగించుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై టీ కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు.  కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్ మాట్లాడుతూ  ప‌వ‌న్ కు ప్ర‌భుత్వం చేస్తున్న అవినీతి గురించి తెలియ‌దా అని ప్ర‌శ్నించారు.  అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టు పేరు మార్చి రూ. 50 కోట్ల మేర అక్రమాలకు పాల్పడిందని గుర్తు చేశారు. 
 ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు తెలంగాణలో చిరంజీవికేదిక్కులేదు, తెలంగాణలో పవన్ కళ్యాణ్‌ను ఎవరు పట్టించుకొంటారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రంపై కేంద్రీకరిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. 

ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి

Submitted by arun on Thu, 01/25/2018 - 16:15

తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఆరుగురు ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ సెక్రటరీ పదవులు ఇచ్చారన్న రేవంత్‌.... ఈ నియామకాలు చెల్లవని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. దీనిపై గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశామన్న ఆయన...దీనిపై గవర్నర్‌ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలకు చెల్లించిన జీతభత్యాలను రికవరీ చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రసమయి, సోమారపు సత్యనారాయణ, వేముల ప్రశాంత్‌రెడ్డి... నిబంధనలకు విరుద్ధంగా పదవుల్లో ఉన్నారని గుర్తు చేశారు.

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై ఈసీకి రేవంత్‌ ఫిర్యాదు

Submitted by arun on Tue, 01/23/2018 - 15:46

తొమ్మిది మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతితో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి రేవంత్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆప్‌ ఎమ్మెల్యేల తరహాలో లాభదాయక పదువుల్లో ఉన్న టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటు కార్యదర్శులుగా నియమించారని, మరో ముగ్గురు లాభదాయక పదవుల్లో ఉన్నారని లేఖలో ఆరోపించారు. వినయ్ భాస్కర్, జలగం వెంకట్రావులను సీఎం కార్యాలయంలో సెక్రటరీలుగా నియమించారని శ్రీనివాస్ గౌడ్, సతీష్ కుమార్‌లను డిప్యూటీ సీఎం కార్యాలయాల్లో సెక్రటరీలుగా నియమించారని చెప్పారు.

న‌న్నుచూస్తే ప్ర‌భుత్వ‌మే పారిపోతుంది

Submitted by arun on Sat, 01/13/2018 - 18:27

విద్యుత్‌పై చర్చకు రాకుండా ప్రభుత్వం పారిపోయిందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. తనని రవ్వంత అంటున్న టీఆర్ఎస్‌ నేతలు...మీ అవినీతి కొంప తగలబెట్టడానికి ఆ రవ్వే చాలన్నారు. విభజన సమయంలో జనాభా ప్రాతిపదికన విద్యుత్‌ కేటాయింపులు చేసి ఉంటే....తెలంగాణకు నష్టం జరిగేదన్నారు రేవంత్‌రెడ్డి. సోనియా గాంధీ విచక్షణతో వ్యవహరించి వినియోగం ప్రాతిపదికన కేటాయింపులు చేశారన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టి జైలు పెడతామంటున్న కేసీఆర్‌....తన ఆరోపణలను ఆధారాలతో సహా బయట పెడుతున్నానని...తప్పైతే కేసు పెట్టాలని రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు.
 

బాల్కా సుమ‌న్ ను మంద‌లించిన సీఎం కేసీఆర్

Submitted by arun on Sat, 01/13/2018 - 12:16

తెలంగాణలో విద్యుత్ సెగలు రగులుతూనే ఉన్నాయి.. కాంగ్రెస్, టీఆర్ఎస్‌ మాటల తూటాలు విసురుకుంటూనే ఉన్నాయి.. అధికార పార్టీని పలాయన వాదమని కాంగ్రెస్ ఆరోపిస్తే.. వాదించే సత్తా లేకే విమర్శిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎదురు దాడి చేసింది. ఈసారి అధికార, విపక్ష పార్టీలు వ్యక్తిగత స్థాయిలో విమర్శల జోరు పెంచాయి.

సీఎం కేసీఆర్ మాట వింటే మీరు జైలుకే

Submitted by arun on Fri, 01/12/2018 - 14:44

అధికారులు జాగ్రత్తగా ఉండాలని.. కేసీఆర్ చెప్పినట్లు వింటే భవిష్యత్తులో జైలుకు వెళ్తారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హెచ్చరించారు... ఇండియా బుల్స్ కంపెనీ ఇచ్చే కమిషన్‌లకు ప్రభుత్వం కక్కుర్తి పడిందన్న ఆయన.. జగదీశ్వర్ రెడ్డి చెబుతున్నవి పచ్చి అబద్దాలని విమర్శించారు.. మూడున్నర ఏళ్లలో లగడపాటి, జూపల్లి రామేశ్వర్ రావు, సీమాంధ్ర నేతల కంపెనీల నుండి విద్యుత్ ను కొనుగోలు చేసింది నిజం కాదా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. తక్కువ ధరకు ఏపీ విద్యుత్ ఇస్తామన్నా ఎందుకు కొనలేదని నిలదీసారు.. ప్రభుత్వ అవినీతిని నిరూపించకపోతే అబిడ్స్ లో ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేసిన రేవంత్ రెడ్డి..