revanth reddy

ఆస్తుల చిట్టా విప్పిన రేవంత్‌

Submitted by arun on Sat, 09/29/2018 - 16:32

తన పోరాటం గల్లీలోని టీఆర్ఎస్‌ నేతలతో కాదని ప్రగతి భవన్‌లోని కేసీఆర్‌తో అన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. మోడీతో కుమ్మక్కై తనపై కేసులు పెడితే భయపడేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. రెండు రోజుల పాటు తన నివాసంలో జరిగిన ఐటీ రైడ్స్‌పై ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన కేసీఆర్‌పై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు.  కాంగ్రెస్ నేతలను చూసి అభద్రతకు గురవుతున్న కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని రేవంత్ విమర్శించారు. 2014 తరువాత ఒక్కసారి విదేశీ పర్యటన చేయని తాను  విదేశాల్లో అకౌంట్లు ఎలా ఓపెన్ చేస్తానంటూ ప్రశ్నించారు.

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్

Submitted by arun on Sat, 09/29/2018 - 15:00

తన పోరాటం గల్లీలోని టీఆర్ఎస్‌ నేతలతో కాదని ప్రగతి భవన్‌లోని కేసీఆర్‌తో అన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. మోడీతో కుమ్మక్కై తనపై కేసులు పెడితే భయపడేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. రెండు రోజుల పాటు తన నివాసంలో జరిగిన ఐటీ రైడ్స్‌పై ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన .. కేసీఆర్‌పై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు.  కాంగ్రెస్ నేతలను చూసి అభద్రతకు గురవుతున్న కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని రేవంత్ విమర్శించారు. 2014 తరువాత ఒక్కసారి విదేశీ పర్యటన చేయని తాను .. విదేశాల్లో అకౌంట్లు ఎలా ఓపెన్ చేస్తానంటూ ప్రశ్నించారు.

31 గంటల విచారణలో..150 ప్రశ్నలు...ఐటీ అధికారులకు ధీటైన సమాధానమిచ్చిన రేవంత్

Submitted by arun on Sat, 09/29/2018 - 09:57

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇళ్లలో ఐటీ, ఈడీ సోదాలు ముగిసాయి. రేవంత్‌ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు సంబంధించిన 15 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండున్నర కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న అధికారులు .... రేవంత్ నివాసంలోని  రెండు కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లు , ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశారు.  దీంతో పాటు సోదాల్లో లభ్యమైన పత్రాలను మూడు సూట్‌కేసుల్లో తరలించారు. 

ముగిసిన సోదాలు.. మూడు సూట్‌కేసుల్లో డాక్యుమెంట్లు..!

Submitted by arun on Sat, 09/29/2018 - 09:46

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. గురువారం ఉదయం మొదలైన సోదాలు ఈ తెల్లవారుజామున రెండున్నర గంటలకు వరకు కొనసాగాయి. రెండు రోజులపాటు జరిగిన ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 

రేవంత్‌ నివాసానికి చేరుకున్న ఫోరెన్సిక్‌ నిపుణులు...

Submitted by arun on Fri, 09/28/2018 - 17:08

రేవంత్‌రెడ్డి నివాసంలో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 20 గంటలుగా రేవంత్‌ను విచారిస్తున్న ఐటీ అధికారులు.. ఆయనతో పాటు.. ఉదయ్‌ సింహాను కూడా మరోసారి విచారిస్తున్నారు. ఐటీ అధికారులతో పాటు సోదాల్లో ఫోరెన్సిక్‌ నిపుణులు కూడా పాల్గొన్నారు. డాక్యమెంట్లు, సంతకాలు ఇతరత్రా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. మూడు రోజుల పాటు సెర్చ్‌ వారెంట్‌తో వచ్చిన అధికారులు.. రేవంత్‌రెడ్డి భార్య సమక్షంలో బ్యాంకు లాకర్లు తెరిచారు. సోదాలు రేపు కూడా కొనసాగనున్నాయి. అయితే రేవంత్ రెడ్డి నివాసం వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించారు.

‘రేవంత్‌ రెడ్డి దేశ ద్రోహి’...: ఎంపీ బాల్క సుమన్‌

Submitted by arun on Fri, 09/28/2018 - 13:59

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులకు, టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ స్టువర్ట్ పురం దొంగల ముఠాగా మారిపోయిందని విమర్శించారు. తప్పులు, అక్రమాలు చేసినందుకు సోదాలు జరుగుతుంటే టీఆర్ఎస్ ను విమర్శించడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు. రేవంత్‌రెడ్డిపై ఐటీ దాడుల విషయంలో కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఈ విషయానికి టీఆర్ఎస్‌కు సంబంధం లేదన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న జానారెడ్డి, జైపాల్‌రెడ్డి ఇళ్లల్లో ఐటీ సోదాలు జరగడంలేదే..

చెప్పింది గోరంత..బయట పడుతోంది కొండంత: రామారావు

Submitted by arun on Fri, 09/28/2018 - 12:40

రేవంత్ రెడ్డి సంస్ధలపై రెండు నెలల పాటు సమాచారం సేకరించాకే .. దర్యాప్తు సంస్ధలను ఆశ్రయించినట్టు న్యాయవాది రామారావు తెలిపారు. దర్యాప్తు సంస్ధల విచారణ నుంచి తప్పించుకునేందుకు రాజకీయ కుట్రలంటూ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫిర్యాదులో తాను చెప్పిన దాని కంటే ఎక్కువ మొత్తంలోనే అక్రమాలు వెలుగు చూస్తున్నాయని తెలిపారు. పన్నులు కట్టకుండా తప్పించుకునేందుకు 19 డొల్లకంపెనీలు ఏర్పాటు చేసి నిధులు మళ్లించారన్నారు. ఈ వ్యవహారంలో 15 రోజుల ముందే రేవంత్‌కు ఐటీ నోటీసులు అందాయని న్యాయవాది రామారావు తెలిపారు.

‘లాకర్లు తెరిచేందుకు రేవంత్‌ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లిన ఐటీ అధికారులు’

Submitted by arun on Fri, 09/28/2018 - 11:46

రేవంత్‌ రెడ్డి బ్యాంక్‌ అకౌంట్లపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. బ్యాంక్‌ లాకర్లు తెరిచేందుకు రేవంత్‌ భార్య గీతను బ్యాంక్‌కు తీసుకెళ్లారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి తమ్ముడి బ్యాంక్‌ లాకర్లు పరిశీలించిన ఐటీ అధికారులు.. అదే బ్యాంక్‌లో రేవంత్‌రెడ్డికి చెందిన లాకర్లను ఓపెన్‌ చేయనున్నారు. రేవంత్ బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించడంతోపాటు రేవంత్ వియ్యంకుడు, ఓటుకు నోటు కేసులో ఉన్న సెబాస్టియన్, ఉదయసింహాల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించి నోటీసులు జారీ చేశారు. కాగా... ఇప్పటికే రేవంత్‌రెడ్డిపై బ్లాక్‌మనీ, ఐటీ, మనీ లాండరింగ్‌, ఫెమా, బినామీ లావాదేవీల చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఐటీ అండ్ ఈడీ రైడ్స్‌పై రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 09/28/2018 - 10:52

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డికి అరెస్ట్‌ భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఐటీ అండ్ ఈడీ రైడ్స్‌తో ప్రమాదాన్ని ముందే ఊహించిన రేవంత్‌ కోస్గి బహిరంగ సభలో ఉద్వేగానికి లోనయ్యారు. రేవంత్‌రెడ్డి బయట ఉంటే 30వేలు జైలుకెళ్తే 50వేల మెజారిటీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అరెస్ట్‌ చేస్తే జైలు నుంచే నామినేషన్‌ దాఖలు చేస్తానన్న రేవంత్‌రెడ్డి తనను భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత మీదేనంటూ కొడంగల్‌ ప్రజలపై భారం వేశారు.

నిన్న జగ్గారెడ్డి... నేడు రేవంత్‌‌రెడ్డి... రేపు...

Submitted by arun on Fri, 09/28/2018 - 10:25

వరుస కేసులు, అరెస్టులు టీకాంగ్రెస్‌ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. నిన్న జగ్గారెడ్డి... నేడు రేవంత్‌‌రెడ్డి... ఇలా ఒక్కో జిల్లాలో ఒక్కో కీలక నేతను... ఏదో ఒక కేసులో ఇరికిస్తున్నారని టీకాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుత పరిణామాలు కాంగ్రెస్‌కి నష్టం చేస్తాయేమోనన్న భయం ఆ పార్టీని కలవరపెడుతున్నా కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇంతకు ఇంత వడ్డీతో సహా చెల్లిస్తామంటూ టీఆర్‌ఎస్‌ను హెచ్చరిస్తున్నారు.