over-insensitive-remarks-flood-victims-kerala-man-sacked-gulf-firm

వరదలతో ప్రజలు అల్లాడుతుంటే కారుకూతలు కూశాడు.. ఇంతలో..

Submitted by nanireddy on Mon, 08/20/2018 - 17:53

 కేరళలో ఓ వైపు వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే.. ఓ ఉద్యోగి కారుకూతలు కూసి తగిన శాస్తి చేయించుకున్నాడు. కేరళకు చెందిన రాహుల్‌ ఒమన్‌ లులు గ్రూప్‌ కంపెనీలో  కేషియర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. పన్నెండు రోజులుగా వరద బీభత్సంతో కేరళ ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతుంటే అతను మాత్రం హేళన చేశాడు. వరద బాధితులకు వలంటీర్లు సహాయం చేస్తుండడంపై రెండు రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో ఆయనో పోస్ట్‌ పెట్టాడు.  సహాయక శిబిరాల్లో ఎవరైనా సానిటరీ నేప్‌కిన్స్ కోసం  అడిగితే, తాను మాత్రం వాటికి బదులుగా కండోమ్స్ అడుగుతానంటూ పోస్ట్ షేర్ చేశాడు. దాంతో సోషల్ మీడియాలో పలువురికి ఒళ్ళు మండి చివాట్లు పెట్టారు.